చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పసుపుజెండా ఎగరేస్తా… ఇచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తా!

దుగ్గిరాల, పేరకలపూడి రచ్చబండ సభల్లో నారా లోకేష్‌

by చైతన్యరధం
Mar 26, 2024 at 7:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రతిపక్షంలో ఉన్నా అహర్నిశలు సేవలందించా
  • నేను చేసిన పనుల్లో 10శాతం కూడా ఆర్కే చేయలేదు
  • పెన్షన్లలోనూ రాజకీయం చేస్తున్న దుర్మార్గుడు జగన్‌
  • దుగ్గిరాల, పేరకలపూడి రచ్చబండ సభల్లో నారా లోకేష్‌

దుగ్గిరాల(చైతన్యరథం): గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అహర్నిశలు సేవలు చేస్తున్నా.. రెండుసార్లు గెలిచిన ఆర్కే నేను చేసిన సంక్షేమంలో పదో వంతు కూడా చేయలేదని టీడీపీ యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల, పేరకలపూడి రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… మీ అందరి ఆశీస్సులతో ఈసారి మంగళగిరిలో పసుపుజెండా ఎగురవేస్తా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పోరాడి అత్యధిక నిధులు తెస్తా. ఎన్నికల సమయంలో కరకట్ట కమలహాసన్‌ అద్భుతంగా నటిస్తారు, ఆ తర్వాత కన్పించకుండా పోతారు. ముఖ్యమంత్రి మంగళగిరికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రెండునెలల క్రితం పార్టీకి రాజీనామా చేశారు, మళ్లీ ఇప్పుడు జగన్‌ పంచన చేరారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోయారు. 2019లో ఒక్క ఛాన్స్‌ పేరుతో మోసపోయారు మరోసారి మాయమాటల నమ్మి మోసపోవద్దని లోకేష్‌ హితవు పలికారు.

సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం
టీడీపీ వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దుచేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ` సంక్షేమాలను జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తాం. ప్రజల తరపున పోరాడినందుకే నాపై 22 కేసులు పెట్టారు, చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైలులో ఉంచారు. కుంటిసాకులతో సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు, పెన్షన్లలో కూడా రాజకీయం చేస్తున్న దుర్మార్ముడు జగన్‌ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా చైతన్యవంతులై తరిమికొట్టాలి. 3132 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రలో నా దృష్టికి ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రజలకు అండగా నిలచేందుకు చంద్రబాబు, పవన్‌ సూపర్‌ ` 6 కార్యక్రమాలను ప్రకటించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక గతంలో బీసీ, ఎస్సీ మైనారిటీలకు అమలుచేసిన సంక్షేమపథకాలను పునరుద్ధరిస్తాం. హజ్‌ యాత్రకు వెళ్లేవారికి సాయం పెంచుతాం. ఏటా జాబ్‌ కేలండర్‌ తో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని పునరుద్ధరించి, వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

ఇంకా ఎంతమందిని పొట్టనబెట్టుకుంటారు?
జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు బాగా పెరిగాయి. అమర్నాథ్‌ గౌడ్‌ అనే బీసీ బాలుడు తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. నిందితుడికి బెయిల్‌ వస్తే ఊరేగింపుతో తీసుకెళ్లారు. సీఎం సొంత జిల్లాలో చేనేత సోదరుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ ఎమ్మెల్యేనే కారణం. సుబ్బారావు భూమిని బినామీల పేరుతో కబ్జా చేయడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దళితులను కూడా వదిలిపెట్టలేదు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ ను చంపి డోర్‌ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం, పలమనేరులో మిస్బా ఆత్మహత్యకు వైసీపీనే కారణం. నర్సరావుపేటలో వక్ఫ్‌ భూముల కోసం పోరాడిన ఇబ్రహీంను నడివీధిలో నరికి చంపారు. ఇంకా ఎంతమందిని పొట్టబెట్టుకుంటారు? ముస్లిం సోదరుల విషయంలో వైసీపీ పేటీిఎం బ్యాచ్‌ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. మైనార్టీలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని లోకేష్‌ భరోసా ఇచ్చారు.

యువనేత దృష్టికి సమస్యల వెల్లువ
దుగ్గిరాల వాసులు తమ సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఎస్సీలకు ఫంక్షన్‌ హాల్‌, కమ్యూనిటీ భవనం నిర్మించాలి. నిరుద్యోగ యువతకు లోన్లు ఇవ్వాలి. శ్మశాన వాటిక, ఆరోగ్యకేంద్రం అభివృద్ధి చేయాలి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిల వల్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. పేరకలపూడి వాసులు తమ సమస్యలను చెబుతూ… ప్రభుత్వాసు పత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం, తెనాలి వెళ్లాల్సి వస్తోంది. గ్రామానికి రవాణా సౌకర్యం లేదు, ప్రస్తుతం ఒకే ఒక బస్సు నడుస్తోంది. పంచాయితీ పరిధిలో వీధిదీపాలు ఏర్పాటుచేయాలి.

స్కూలు పిల్లలకు ప్లే గ్రౌండ్‌ అభివృద్ధి చేయాలి. గ్రామంలో క్రైస్తవ శ్మశానవాటిక ఏర్పాటుచేయాలి. మోరంపూడి రోడ్డు వేయాలి, వంతెన నిర్మించాలి. గ్రామంలో 7వతరగతి వరకు స్కూలు ఉంది, 10వతరగతి వరకు అప్‌ గ్రేడ్‌ చేయాలి. పంటలు నిల్వ చేసుకోవడానికి గోడౌన్‌ నిర్మించాలని కోరారు. దీనిపై యువనేత లోకేష్‌ స్పందిస్తూ… దుగ్గిరాల గ్రామంలో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. మంగళగిరి-తెనాలి రోడ్డు నిర్మించడంతో పాటు అంతర్గత రహదారులు కూడా అభివృద్ధి చేస్తాం. దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2024

Next Post

జగన్‌రెడ్డి బస్సు యాత్ర ‘క్షమాపణ యాత్ర

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

కార్యకర్త
@ August 4, 2026
తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి
ఆంధ్రప్రదేశ్

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

చైతన్యరధం
@ August 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

కార్యకర్త
@ August 3, 2026
పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం
ఆంధ్రప్రదేశ్

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

చైతన్యరధం
@ August 3, 2026
పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు
ఆంధ్రప్రదేశ్

పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్రలో జోష్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

చైతన్యరధం
@ August 4, 2026
పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

చైతన్యరధం
@ August 3, 2026
పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist