తెలుగుదేశం నిర్వహించిన మహానాడులో ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం టిడిపి మ్యానిఫెస్టో ప్రకటించిందని టిడిపి నాయకులు అన్నారు. మహిళా సాధికారిక కింద మహిళలకు మేలు జరిగే విధంగా పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని నందవరం తెలుగుదేశం పార్టీ మహిళలు అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయ్ మాధవరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున తెలుగు మహిళలు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి నాయకులను గెలిపించుకుంటామని మహిళలు వాగ్ధానం చేశారు.
చంద్రన్నకు పాలాభిషేకం చేసిన కుందుర్పి టిడిపి నాయకులు కుందుర్పి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఆదేశాల మేరకు కుందుర్పి మండల కేంద్రంలో బుధవారం టిడిపి నాయకులు చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రన్న మ్యానిఫెస్టో పేదలకు, మహిళలకు ఒక వరం అని టిడిపినాయకులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం అన్నారు. వైసిపికి ప్రజలే బుద్ధి చెప్పే కాలం దగ్గర్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు
జగన్ రెడ్డి అరాచక,విద్వంసక, నరహంతక, అవినీతి, అభివృద్ధి నిరోధక పాలనకు నాలుగు ఏళ్లు పూర్తి అయ్యాయి. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపాయింది. ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. జగన్‌రెడ్డిని గద్దెదించి ప్రజా రంజక పాలన అందించటానికి చంద్రన్న రూపొందించిన మిని మేనిఫెస్టోను ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తామంటున్నారు. సయ్యద్ రఫీ టీడీపీ అధికార ప్రతినిధి.