- ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించారు
- దారుణంగా జవాబు పత్రాల మూల్యాంకనం
- సిట్ నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
- మంత్రులతో సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలు.. నిరుద్యోగులకు జరిగిన అన్యాయానికి నిదర్శన మని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అర్హతలేని వారికీ ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారనడానికి ఈ అక్రమాలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల పేరుతో వైకాపా నిరుద్యోగులకు ఎంతో ద్రోహం చేసిందని మండిపడ్డారు. అమరావతిలో ఎస్ఐపీబీ సమావేశం అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. “హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదిక చూస్తే గ్రూప్-1 అక్రమాల గురించి తెలుస్తుంది. ఈ నివేదికను ప్రతిఒక్కరూ అధ్యయనం చేయాలి. ఇంత దారుణంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఎప్పుడూ జరగలేదు. నిరుద్యోగులకు చేసిన మోసంపై వైకాపాను ప్రజలు నిలదీయాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ద్రోహాన్ని కప్పిపుచ్చు కునేందుకు పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై కుట్రపూరి తంగా విషప్రచారం చేస్తున్నారు. డీఎస్సీపై వచ్చిన విమర్శలను ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని సూచించారు. వైసీపీ నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటిని అసెంబ్లీలో కూడా చర్చిద్దామని పేర్కొన్నారు.














