- శాసనమండలిలో కల్తీ నెయ్యిపై చర్చను అడ్డుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు
- వారికి ధీటైన సమాధానం ఇచ్చిన మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్
- హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
అమరావతి (చైతన్యరథం): శాసనమండలిలో అధికార పక్ష సభ్యులు సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంతో వైసీపీ సభ్యులు ఆత్మరక్షణలో పడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ఇన్ని రోజులు వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారానికి సభలో ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ ధీటైన సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యిపై ఇన్ని రోజులై వైసీపీ నేతలు చేసిన తప్పుడు ప్రచారం మండలిలో జరిగిన చర్చ ద్వారా మరోసారి బయటపడింది. వైసీపీ డొల్లతనం బట్టబయలైంది. ఏం మాట్లాడాలో తెలియక వైసీపీ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే… ఒక దశలో శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీ తీరును తప్పుబట్టి ఆగ్రహం వ్యక్తం చేయక తప్పనిసరైంది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే దేవాలయాల ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. గత ఐదేళ్లల్లో ఒక్కసారి కూడా జగన్మోహన్‌రెడ్డి సీఎం హోదాలో సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించకపోవడం, ఒక్కసారి కూడా కుటుంబంతో దర్శనానికి వెళ్లకపోవడం, డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడం వంటి అంశాలు జగన్ మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయని జగన్ తీరును అచ్చెన్నాయుడు ఎండగట్టారు.
అదే విధంగా గతంలో సాక్షిలో ప్రచురితమైన వార్తను మంత్రి అచ్చెన్నాయుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. జీసెస్ ఫొటోను సాక్షిలో తప్పుగా ప్రచురించినందుకు క్రైస్తవులకు శతకోటి క్షమాపణలు చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, తాను చేసిన పాపాలకు హిందువులకు క్షమాపణ చెప్పకపోగా… హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని ప్రతిరోజూ మండలిలో పట్టుబట్టిన వైసీపీ సభ్యులు… నేడు అదే అంశంపై నిర్వహించిన చర్చలో కల్తీ నెయ్యి విషయం తప్ప మిగతా అంశాలను ప్రస్తావిస్తూ నవ్వులపాలయ్యారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. మండలిలో వైసీపీని డిఫెన్సులోకి నెట్టేయడంలో టీడీపీ సీనియర్లు అచ్చెన్నాయుడు, పయ్యావుల సక్సెస్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.















