చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ గేటు కూడా తాకలేవని వైసీపీ నేతలు అంటే..మీరు డిప్యూటీ సీఎంను చేశారు

పిఠాపురం ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌ కృతజ్ఞతలు

చైతన్యరధం by చైతన్యరధం
July 4, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అసెంబ్లీ గేటు కూడా తాకలేవని వైసీపీ నేతలు అంటే..మీరు డిప్యూటీ సీఎంను చేశారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పిఠాపురం: తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని వైసీపీ నేతలు సవాల్‌ చేస్తే పిఠాపురం ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేశారని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గేటు తాకడం కాదు..దాన్ని బద్దలుగొట్టుకుని పవన్‌ కళ్యాణ్‌ అసెంబ్లీలో ఆడుగుపెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో సైతం జనసేన గురించి మాట్లాడుకునేలా చేసిందన్నారు. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న మనిషికి అండగా నిలవాలనుకున్నా. మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారు. ఒక పార్టీ 100 శాతం స్ట్రయిక్‌ రేటుతో విజయం సాధించటం దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. పవన్‌ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు సవాల్‌ చేశారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్‌ గా తీసుకున్నారు. గేటు తాకడం ఏంటి బద్దలుగొట్టుకుని వస్తారని వర్మ చెప్పారు. ఆ మాటలు నిజమయ్యాయి. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు. కానీ, బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే నేను పంచాయతీరాజ్‌ శాఖ తీసుకున్నా. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదు. నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పా. సినిమాల్లో నాకు వచ్చిన ఆదాయంతో పన్నులు కట్టాను. ఇప్పుడు మీ డబ్బు కాబట్టే ప్రతి రూపాయికి అధికారులను లెక్కలు అడుగుతున్నా. బాధ్యతగా ఉండాలనే మా శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నామని పవన్‌ చెప్పారు.

హామీలన్నీ గుర్తున్నాయి
పవన్‌ కళ్యాణ్‌ అనే నేను అంటూ మీ ముందు ప్రమాణం స్వీకారం చేస్తున్నాను. అన్ని వర్గాల వారికీ నేను హామీ ఇస్తున్నాను. నేను లంచాలు తీసుకోను. మీ అభ్యున్నతికి పాటుపడతాను. గతంలో వైసీపీ నాయకులు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో ఉండడు… హైదరాబాద్లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి ఉద్యోగులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అధికారులను గౌరవిస్తూనే పనులు చేయించుకోవాలి. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, ఉపాధి అవకాశాలు వంటి హామీలన్నీ గుర్తున్నాయి. నా కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి వచ్చి తన బాధ నాతో చెప్పుకొంది. ఆమె బాధ తీర్చాలని 3 రోజులు తాపత్రయపడ్డాను. 3 నెలల కేసు చిక్కుముడిని పోలీసులు త్వరగా ఛేదించారు. అదే వైసీపీ ప్రభుత్వం 30 వేల మందికి పైగా అడబిడ్డలు కనిపించకుండా పోతే కనీసం పట్టించుకోలేదు. వ్యవస్థల్లో తప్పు లేదని ఈ ఘటనలతో నిరూపితమైంది. వ్యవస్థలను సరిదిద్దుకోవాలని అధికారులు కూడా చెబుతున్నారని పవన్‌ అన్నారు.

చేసి చూపించాం
ఓటర్లు రక్తం చిందకుండా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారు. 151 స్థానాలున్న పార్టీని 11 స్థానాలకు పడగొట్టారు. బస్సులు, రైళ్ళు, విమానాల్లో వచ్చి ఓటేసి వెళ్లారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సమయంలో కూడా ఎవరికీ ఇంత మెజారిటీ రాలేదని ఇటీవల స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయలేదని వైసీపీ నేతలు అంటే తొలి రోజే పంపిణీ చేసి చూపించాం. ఒక్క వాలంటీరు సాయం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది. చంద్రబాబు అపార అనుభవం అందుకు తోడ్పడిరది. పంచాయతీరాజ్‌ గురించి ఎన్నో ఫైల్స్‌ చదువుతున్నాను. వైకాపా హయాంలో అడ్డగోలుగా నిధులు దారి మళ్లించారు. రుషికొండకు గుండు చేసి రాజభవనం కట్టించిన రూ.600 కోట్ల ఖర్చులో కొంచెమైనా కేటాయించి ఉంటే రోడ్లు బాగుపడేవి. ఉద్యోగులకు జీతాలు అందేవని పవన్‌ అన్నారు.

అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం
ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఏం చెప్పాలని ఎంపీ ఉదయ్‌ అడిగారు. ఆయనకు మనం బలం అవ్వాలి కానీ, బరువు కాకూడదని చెప్పాను. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజంను అభివృద్ధి చేస్తాం. అందమైన కోస్టల్‌ రోడ్డును నిర్మిస్తాం. పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తాం. గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తాం. కోటగుమ్మం గేట్‌ వద్ద రైల్వే పై వంతెన కావాలని కేంద్రాన్ని కోరాం. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఢల్లీిలో మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను, చంద్రబాబు ఆలోచిస్తున్నాం. పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించా. ఏ వినతులైనా వారు స్వీకరిస్తారు. ఉపాధి, వైద్యం, శాంతిభద్రతల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా మీకు రుణపడి ఉంటా. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Tags: కృతజ్ఞతలుపవన్‌ కళ్యాణ్‌పిఠాపురం ప్రజలు
Previous Post

జర్నలిస్టుల రాయితీ పాసులను పునరుద్ధరించాలి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2024

Next Post
చైతన్యరధం ఈ పేపర్ 04-07-2024

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2024

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.