చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వడ్డెర బిడ్డలను బలిచేస్తారా

గులకరాయి డ్రామాలో వడ్డెర యువకులను ఇరికించటంపై సంఘ నేతల ఆగ్రహం

by చైతన్యరధం
Apr 20, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డలను బలి చేసే కుట్ర
  • వడ్డెర బిడ్డలపై హత్యాయత్నం కేసు పెట్టించిన వెల్లంపల్లి, జగన్‌రెడ్డి
  • అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం
  • వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలి
  • లేదంటే సైకో జగన్‌కు తగిన బుద్ధి చెబుతాం

అమరావతి(చైతన్యరథం): జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలిచేసి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్‌రెడ్డి గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు మండిపడ్డారు. బీసీ వర్గాలకు చెందిన వడ్డెర బిడ్డలపై హత్యాయత్నం కేసు పెట్టి బలవంతంగా ఒప్పించి ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో సంఘం నాయకులు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

నవ్వుకుంటున్న జనం: గురుమూర్తి
వైసీపీ నేతలు నాడు ఆడిన కోడికత్తి డ్రామాలాగే నేడు గులకరాయి నాటకానికి తెరలేపి వడ్డెర బిడ్డలు వేముల సతీష్‌, వేముల దుర్గారావులను అక్రమ కేసులో ఇరికించారని టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లతో వారి తల్లిదండ్రులు దిక్కుతోచకుండా ఉన్నారన్నారు. బీసీ బిడ్డలపై వెల్లంపల్లి పెట్టిన కేసు వడ్డెరలను అవమానించడమే అన్నారు. ఏదో జరిగిపోయినట్లు పోలీసులు పరుగులు పెట్టి సతీష్‌ను తీసుకెళ్లడం పెద్ద డ్రామాలా ఉందన్నారు. చీకట్లో వచ్చిన గులకరాయి.. ముఖ్యమంత్రి జగన్‌కు తగిలి అక్కడ నుండి వెల్లంపల్లికి తగిలి గాల్లో ఎగిరిపోవడం కోడికత్తి డ్రామా 2 లా ఉందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

రాష్ట్రంలో చంద్రబాబు మీద నందిగామలో, ఎర్రగొండపాలెంలో జరిగిన దాడుల్లో భద్రతాధికారి మధుకు రక్తం కారిపోయేలా దెబ్బలు తగిలాయన్నారు.. సెక్యూరిటీ సిబ్బంది సంతోష్‌కుమార్‌కు తల పగిలి రక్తం కారిందన్నారు. చంద్రబాబుపై నాలుగుసార్లు దాడి జరిగినా.. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినా.. చర్యలు లేవన్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్‌ చేసిన దాడిని జగన్‌ సమర్థించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై రాళ్లదాడి జరిగినప్పుడు.. కొడాలి నాని వెటకారంగా మాట్లాడుతూ.. రాయిపెట్టి కొడితే చచ్చిపోవడానికి అది ఏదైనా పావురమా పిట్టనా అన్నాడు.. మరి ఈ రోజు రాయితో జగన్‌ను ఎలా చంపేస్తారనే ఇంగిత జ్ఞానం వారికి లేదా అని గురుమూర్తి ప్రశ్నించారు. అయినా ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి రాయితో కుట్ర చేస్తారా. రాయి దాడి డ్రామాను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.

పోలీసులు మూల్యం చెల్లించుకుంటారు
పోలీసులు గత ఐదేండ్లుగా బీసీలు, దళితుల మీద ఎన్నో కేసులు పెట్టారు. నాలాంటి వారు కూడా రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాం. దయచేసి పోలీసులు ఐపీసీ సెక్షన్‌ అమలు చేయాలి… వైసీపీ సెక్షన్‌ కాదు. బీసీ బాలుడు అమర్నాథ్‌ గౌడ్‌ ను నడిరోడ్డు పై కాళ్లు చేతులు కట్టేసి తగలబెడితే ఏం చేశారు.? ఆ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఆదుకున్నారు. జై జగన్‌ అనేందుకు నిరాకరించిన బీసీ నాయకుడు తోట చంద్రయ్య పీక కోసి చంపేస్తే ఏం న్యాయం చేశారు. మరో బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను నడిరోడ్డుపై నరికారు. ఇవేం మీకు కనబడలేదా? గంజాయి మత్తులో ఎంత మంది బీసీ బిడ్డలపై అత్యాచారాలు జరిగాయి ? ఎంతమంది ఆస్తులను ధ్వంసం చేశారు. ఎంతమంది బీసీ బిడ్డలు కనిపించకుండా పోయారు. ఎంత మంది బీసీ బిడ్డలను హతమార్చారు. ఇవేం కనబడటంలేదా? పోలీసుల వైసీపీ తొత్తులుగా మారి బీసీలకు అన్యాయం చేస్తే మూల్యం చెల్లించుకుంటారని గురుమూర్తి హెచ్చరించారు.

వైసీపీకి గుణపాఠం ఖాయం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల శవాల పునాదుల మీద జగన్‌ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. ఎస్సీ, బీసీలను అడ్డు పెట్టుకుని జగన్‌ అధికారం కోసం మరోసారి వడ్డెర బిడ్డలను ఖూనీకోరులుగా మార్చి అవమానిస్తున్నాడని గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అవమానిస్తున్న జగన్‌ కు గుణపాఠం చెబుతామన్నారు. బీసీలు కళ్లు తెరిచారని.. జగన్‌ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయడం ఖాయమన్నారు. జగన్‌ ఆడిన జగన్నాటకం అట్టర్‌ ప్లాఫ్‌ అయిందన్నారు. జగన్‌ పాలన అంతా విధ్వంసం, గూండాయిజమే అన్నారు. టీడీపీ పాలనంతా అభివృద్ధి, సంక్షేమం అన్నారు. జగన్‌ది కన్నింగ్‌ టీమ్‌ అని.. మాది విన్నింగ్‌ టీమ్‌ అని, మా పోరాటంతో… చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ కూటమి ఊహించని మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలతో ఆడుకున్న జగన్‌ రెడ్డిని సింగిల్‌ డిజిట్‌ లో కూర్చోబెట్టడం ఖాయమని గురుమూర్తి స్పష్టం చేశారు.

అధికారం కోసం వడ్డెర్లపై జగన్‌ కుట్ర: మల్లెల
రెక్కాడితే కాని డొక్కాడని.. చేతివృత్తులపై ఆధారపడే శ్రామికులు వడ్డెరలని… సీఎంపై రాయి విసిరారని దుర్మార్గంగా వడ్డెర కులస్తుల్ని ఇరికించడం దారుణమని టీటీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వడ్డెర సేవా సంఘం అధ్యక్షుడు మల్లెల ఈశ్వరరావు అన్నారు. పసిబిడ్డలతో కోర్టు దగ్గర దుర్గారావు భార్య విలపిస్తుంటే తనకు దుఖం ఆగలేదన్నారు. ఇదేనా వైసీపీ ప్రభుత్వం చెబుతున్న సంక్షేమం.. ఇదేనా బీసీలను ఉద్ధరించే ప్రభుత్వమని మండిపడ్డారు. అప్పుడు కోడి కత్తి డ్రామాతో ఎస్సీ బిడ్డను ఇరికించి ఐదేండ్లు జైల్లో మగ్గేలా చేశాడన్నారు. ఇప్పుడు బీసీ బిడ్డను ఇరికించేందుకు యత్నిస్తున్నాడన్నారు. జగన్‌కు మా వడ్డెర్లే కనిపించారా అని ఈశ్వరరావు ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని మాయమాటలు చెబుతున్న జగన్‌ సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. ఈ ముఖ్యమంత్రికి, వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులకు జాలి, దయలేదన్నారు.
శ్రమనే ఆధారం చేసుకుని బతికే వడ్డెర్లను అక్రమ కేసుల్లో ఇరికిండం ఎంత వరకు న్యాయమో చెప్పాలన్నారు. వడ్డె ఓబన్న ఆశయాల కోసం పనిచేసే వ్యక్తులు వడ్డెర్లు అన్నారు. దాడులకు వెళ్లటం, ఎదుటివారిని అగౌరవ పరచడం మా వడ్డెర్ల రక్తంలో లేదన్నారు. వడ్డెర బిడ్డలపై దుర్మార్గంగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. వడ్డెర్లు హత్యలు చేసే వారా ? అని ఈశ్వరరావు ప్రశ్నించారు.

ఉద్యమిస్తాం
ఈనాటికి దుర్గారావు ఎక్కడ ఉన్నాడో చూపించడం లేదని… వెంటనే దుర్గారావును విడిచి పెట్టాలని ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఇకనైనా బీసీల పట్ల పోలీసుల తీరు మారాలన్నారు. పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లు అంతా ఏకమై ఈ సైకో ముఖ్యమంత్రి, పాలకులకు బుద్ధి చెబుతామన్నారు. తప్పు వెంటనే సరిదిద్దుకొని దుర్గారావు, సతీష్‌ లను తక్షణమే విడిచి పెట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వడ్డెర సంఘం అధ్యక్షడు వేముల దుర్గారావు, గుంటూరు నగర వడ్డెర సంఘం అధ్యక్షుడు ఒరుసు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వడ్డెర యువత అధ్యక్షుడు తిరుమల కొండ వెంకటేష్‌, మంగళగిరి పట్టణ వడ్డెర అధ్యక్షుడు వేముల శివ, విజయవాడ వడ్డెర యువత అధ్యక్షుడు దేవెళ్ల శ్రీనివాస్‌లు పాల్గొని మాట్లాడారు.

Previous Post

ఒక్క ఛాన్స్‌తో సర్వనాశనం

Next Post

హత్యాయత్నం కాదు..జగన్నాటకమే

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

కార్యకర్త
@ May 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist