రాయచోటి(చైతన్యరథం): నియోజకవర్గంలో గత 30 రోజులుగా జరుగుతున్న రాయచోటి ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆదివారం గ్రాండ్ ఫైనల్స్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫైనల్లో గెలిచిన జట్టుకు బహుమతులు, ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో రాష్ట్రంలోనే యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు కల్పిస్తోందని, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ-స్పోర్ట్స్ అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులకు క్రీడలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొనమల ఖాదరవల్లి, మున్సిపల్ కౌన్సిలర్ పాపిరెడ్డి మదన్మోహన్‌రెడ్డి, కొలిమి హరున్‌బాషా, టీడీపీ నాయకులు నాగిరెడ్డి, మైనద్దీన్, హాజీ మస్తాన్, ప్రభాకర్, నాసర్ ఈవెంట్ ఆర్గనైజర్లు, క్రీడాకా రులు తదితరులు పాల్గొన్నారు.















