చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రెడ్‌బుక్‌ అంటే జగన్‌కు భయమెందుకు?

విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Oct 19, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రెడ్‌బుక్‌ అంటే జగన్‌కు భయమెందుకు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తీరు మారని సాక్షిలో ఇప్పటికీ విషపు రాతలే
  • అసత్య వార్తలపై చట్టప్రకారం చర్యలు
  • ప్రజాకోర్టులో గెలిచాం..సాక్షిపై పరువు నష్టం కేసులోనూ గెలుస్తాం
  • క్యాలండర్‌ ప్రకారమే సూపర్‌ ` 6 పథకాల అమలు
  • జగన్‌లా కల్లబొల్లి కబుర్లు చెప్పం, చెప్పింది చేస్తాం
  • ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించేలా పకడ్బందీ చర్యలు
  • విశాఖపట్నంలో రీజనల్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు
  • విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నం (చైతన్యరథం): ఎర్ర బుక్కు చూస్తే జగన్‌ ఎందుకు భయపడుతున్నారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ప్రశ్నించారు. గత ఐదేళ్లలో చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసు విచారణకు శుక్రవారం విశాఖ కోర్టుకు వచ్చిన మంత్రి లోకేష్‌ కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ…తాను అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నానన్నారు. నేను పాదయాత్ర చేస్తుంటే జీఓ 1 తెచ్చి అడ్డుకోవాలని చూశారు, గతంలో టీడీపీ తరపున వాదించిన అడ్వకేట్లపై కూడా దాడులు చేశారు, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2019లో బ్లూమీడియా సాక్షి విశాఖ ఎడిషన్‌లో నాపై ఫేక్‌ న్యూస్‌ ప్రచురించింది. దానిపై నేను రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశాను. వాదనలు, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కొనసాగుతున్నాయి. నేను ఈ విచారణలకు వచ్చినప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనంగానీ, వసతిగానీ వినియోగించలేదు. విమాన టిక్కెట్లు కూడా నేనే కొనుక్కుంటున్నాను.

ప్రజాజీవితంలో మేం బాధ్యతగా మెలిగే వాళ్లం. మూడోసారి విశాఖకు వచ్చాను. నేను పాదయాత్రలో వాడిన బస్సులోనే విశాఖ పార్టీ కార్యాలయంలో బసచేస్తున్నా. టీడీపీ ఆవిర్భవించాక ఆరుసార్లు అధికారాన్ని చేపట్టినప్పటికీ మేం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు, ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికే టీడీపీ అధికారాన్ని వినియోగించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాకోర్టులో ఎన్డీయే కూటమి విజయం సాధించింది, విశాఖ కోర్టులో కూడా మేం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఇప్పటికీ సాక్షిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. 2014-19 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడూ మాపై అనేక తప్పుడు వార్తలు ప్రచురించారు. అందుకే వైసీపీని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెబితే బాగుంటుంది. తప్పుడు వార్తల పరంపర కొనసాగిస్తే ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలు వదిలిపెట్టవు. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి, కేసులు పెడతాం. తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-01-2026

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

క్యాలండర్‌ ప్రకారమే సూపర్‌ ` 6 పథకాల అమలు
సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్‌ సమాధానమిస్తూ పథకాల అమలుకు మా వద్ద క్యాలండర్‌ ఉంది. దాని ప్రకారమే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి పెన్షన్‌ సొమ్ము పెంచి ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. నిరుద్యోగులకు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇచ్చాం. విద్యావ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నాం. వివిధ సామాజికవర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం పలు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. జగన్‌ మాదిరి కల్లబొల్లి కబుర్లు చెప్పం. గత ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన సంపూర్ణ మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు ఏమయ్యాయి? నోటికొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

మద్యం ఎంఆర్‌పీ ధరలకు అమ్మాల్సిందే
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించాలి. కొత్తగా ప్రారంభించిన ప్రైవేటు మద్యం షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ షాపులు ప్రారంభించి రెండురోజులే అయింది. పకడ్బందీగా విజిలెన్స్‌ ఏర్పాటు చేసి, ఎంఆర్‌పీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

విశాఖలో రీజనల్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు
ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌లో భాగంగా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా యువ ఐఏఎస్‌ అధికారి సారథ్యంలో ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఈడిబి)ని ఏర్పాటు చేశాం. దీంతోపాటు రీజనల్‌ బోర్డులు కూడా ఏర్పాటు చేసి, సులభతరంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. విశాఖలో కూడా ఒక రీజనల్‌ బోర్డు ఏర్పాటుచేస్తాం. దీనిద్వారా నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయి. 2029లో ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెట్టుబడిదారుల్లో ఉండటం సహజమే. జగన్‌ ప్రభుత్వ హయాంలో చాలా పరిశ్రమలు రాష్ట్రం నుంచి పరారయ్యాయి. అమర్‌ రాజా బ్యాటరీస్‌పై వేధింపులకు పాల్పడ్డారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. మళ్లీ రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలన రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. త్వరలోనే విశాఖలో టీసీఎస్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మరికొన్ని కంపెనీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కార్యరూపం దాల్చాక వాటిపై స్పష్టత ఇస్తా. ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయం. దీనిపై ఇప్పటికే ఎంపీి, ఎమ్మెల్యేలందరం సమావేశమై స్పష్టత ఇచ్చామని మంత్రి లోకేష్‌ అన్నారు.

న్యాయపరమైన చిక్కులు తొలగించి నామినేటెడ్‌ పదవుల భర్తీ
నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనాలోచిత చర్యలవల్ల పలు కార్పొరేషన్లు కాంప్లికేటెడ్‌గా మారాయి. న్యాయపరమైన చిక్కులను తొలగించి పదవులను భర్తీచేస్తాం. విశాఖతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదన్నది అవాస్తవం. తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం, చిన్నచిన్న సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుంటాం. బ్లూ మీడియాకు దీనిపై అంత ఉత్సుకత ఎందుకని మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు.
త్వరలో వాట్సాప్‌ ద్వారా బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు
బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీకి గత ప్రభుత్వంలో ఎటువంటి విధివిధానాలు లేవు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్టీజీఎస్‌ శాఖ ద్వారా త్వరలోనే బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లతోపాటు క్యాస్ట్‌, మ్యారేజి వంటి సర్టిఫికెట్లను ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా వాట్సాప్‌ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల టీఏ, డీఏ, సరెండర్‌ లీవుల వంటివి గత ప్రభుత్వం రూ.8 వేల కోట్లు పెండిరగ్‌లో పెట్టింది. వాటన్నింటినీ ఒకేసారి ఇవ్వడం కష్టం, పద్ధతి ప్రకారం వాటన్నింటినీ అందజేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

రుషికొండపై ఆలోచించి నిర్ణయం
మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కడు ఉండటానికి రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎన్‌జిటి రూ.200 కోట్లు ఫైన్‌ వేసింది. ఒక వ్యక్తి బతకడానికి ఇంత సొమ్ము ఖర్చుచేయడం అవసరమా? ఈ డబ్బుతో లక్షలమంది గూడులేని పేదలకు ఇళ్లు లభించేవి. రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలనే విషయమై ఆలోచించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు దానిని జాగ్రత్తగా పరిరక్షించాల్సి ఉంది. అందుకోసం ప్యాలెస్‌ చుట్టూ ఉన్న రెండు రోడ్లలో ఒకటి మూసివేసి ఉంచారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెండో రహదారిని ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

నవంబర్‌ `డిసెంబర్‌ లో పూర్తిస్థాయి బడ్జెట్‌
నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతాం. విశాఖలో ఫ్రీహోల్డింగ్‌ భూములపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక రెవిన్యూ మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన 117 జీఓపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నెలరోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఉచిత ఇసుక విధానంలో లోపాలను సరిచేస్తాం. 2019లో ఏ ధరకు ఇసుక లభించిందో అదే ధరకు ఇసుక లభ్యమయ్యేలా చూస్తాం. యూనివర్సిటీల్లో కొత్త వీసీల నియామకానికి సెర్చి కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. వీసీల నియామకం పూర్తిచేశాక ఆయా యూనివర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తాం. పాఠశాలల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా త్వరలో ఏజెన్సీలోని పాఠశాలలను కూడా సందర్శిస్తానని మంత్రి లోకేష్‌ చెప్పారు.

Previous Post

మంత్రి లోకేష్‌ చొరవ పాఠశాలలకు వీడిన నిధుల గ్రహణం

Next Post

హామీలు నిలబెట్టుకుంటాం న్యాయవాదులకు మంత్రి లోకేష్‌ భరోసా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026

కార్యకర్త
@ February 1, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-01-2026

కార్యకర్త
@ January 31, 2026
కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 31, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చైతన్యరధం
@ January 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-01-2026

కార్యకర్త
@ January 30, 2026
కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం
ఆంధ్రప్రదేశ్

కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

చైతన్యరధం
@ January 30, 2026
కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు

చైతన్యరధం
@ January 30, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

చైతన్యరధం
@ January 29, 2026
రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

చైతన్యరధం
@ January 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 31, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చైతన్యరధం
@ January 31, 2026
కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist