చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

అమరావతిపై త్వరలో శ్వేతపత్రం

అమరావతి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 

చైతన్యరధం by చైతన్యరధం
June 21, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
chandrababu naidu

chandrababu promise to TDP is responsible for restructuring the state

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దశల వారీగా ప్రణాళికాయుతంగా నిర్మాణం
  • ప్రజల సూచనలూ స్వీకరిస్తాం
  • ఏపీ అంటే అమరావతి, పోలవరం
  • ప్రజా రాజధానిని  విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి
  • వైసీపీకి ఓటేసిన ప్రజలు పునరాలోచించుకోవాలి
  • అమరావతి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి,చైతన్యరథం: ఆంధ్ర ప్రజల కలల రాజధాని అమరావతిని జగన్‌రెడ్డి  అతలాకుతలం చేశారని, ఆయన పాలనలో ప్రజా రాజధానికి ఎంత నష్టం జరిగింది, భవిష్యుత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది, అమరావతి నిర్మాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. జగన్‌రెడ్డి మూర్ఖత్వపు పాలనలో రాష్ట్ర ఖజనా ఒట్టిపోయిందని, విపరీతంగా అప్పులు పెరిగిపోయాయని, ఈ పరిస్థితుల్లో అమరావతి నిర్మాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని, దీనికి ప్రజల నుండి కూడా సూచనలు తీసుకుంటామని చెప్పారు. దశల వారీగా ప్రణాళికాయుతంగా అమరావతి నిర్మాణాన్ని చేపడతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయిన అమరావతిని జగన్‌రెడ్డి పాడు పెట్టారని, ఐదేళ్ల పాటు ఒక్క ఇటుక రాయి కూడా వెయ్యకపోగా ఇంకా విధ్వంసం చేశాడని అన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా అని ప్రజలందరూ చర్చించాల్సిన అసవరం ఉందన్నారు. ఎన్నికల్లో జగన్‌రెడ్డికి 11 సీట్లు మాత్రమే వచ్చాయని, కొన్ని ఓట్లు కూడా వచ్చాయని, అయితే ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం అవసరమా అని వైసీపీకి ఓటు వేసిన ప్రజలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి గురువారం చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. అమరావతి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలు
‘రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘అనేక సవాళ్లను, కేసులను అధిగమించి 1,631 రోజులు ఆందోళనలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారడంతో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో రైతులు ఆందోళనలు విరమించారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం…భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఏపీ అనే పదంలో ఏ అంటే అమరావతి…పీ అంటే పోలవరం. అమరావతి ప్రజారాజధాని…తెలుగువారికి చిరునామాగా ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలకు దశ, దిశను నిర్ధేశిస్తుంది. ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గర్వంగా పనులు చేసుకోవచ్చు. కానీ రాజధానిని జగన్‌ అతలాకుతలం చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువనీళ్లు ఉండే నది గోదావరి.
పోలవరం నిర్మాణం జరిగి నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లివ్వచ్చు. విభజన అనంతరం రాజధాని కట్టుకోవడానికి ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘పోలవరం, అమరావతి ప్రాజెక్టులు వ్యక్తిగత అంశానికి సంబంధించినది కాదు…వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది….అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతాయి. ప్రజల్ని సాధికారితవైపు నిలబెట్టవచ్చు. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం పూర్తైతే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరంను గోదావరిలో కలిపింది. పోలవరానికి శాపంగా మారిన వ్యక్తి వల్ల, మూర్ఖత్వం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని విధ్వంసంపై ప్రజలకు వివరిస్తాం…
‘‘ఐదేళ్లు పట్టించుకోకపోవడంతో బిల్డింగులన్నీ బూజు పట్టాయి. కొన్నింటిని పగలగొట్టారు. రాజధానికి వ్యతిరేకంగా ఏమేం చేయాలో అన్నింటినీ చేశారు. కాపాడుకోవాలనుకున్న రైతులపైనా పోలీసులు ఏకపక్షంగా కేసులు పెట్టారు. నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు తెచ్చిపెట్టిన మెటీరియల్‌ దోచుకెళ్లారు. రాజధానిలో గత ప్రభుత్వం ఎంతటి నష్టం కలిగించిందో ప్రజలకు వివరిస్తాం. బ్రహ్మాండంగా ఉండాల్సిన రాజధానిలో..ఇప్పుడు తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలతో కమ్మేసుకుంది. ఇవన్నీ బాగుచేస్తాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిపైన విషం చిమ్మారు
‘తెలుగుజాతి గర్వంగా, గౌరవంగా తలెత్తుకు తిరిగే రాజధాని అమరావతి. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. కేంద్రం 12 విద్యా సంస్థలను ఇచ్చింది. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిలో ఎన్‌ఐటీ, ఒంగోలులో ఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీని…ఇలా ప్రాంతాల వారీగా నెలకొల్పాం. కానీ గత ప్రభుత్వం ఏదీ జగనివ్వలేదు..ముందుకు సాగనివ్వలేదు. రాజధానిపై ఇష్టారీతిన బురదజల్లారు. నిత్యం విష ప్రచారం చేశారు…బ్రాండ్‌ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్‌ సైడర్‌ ట్రేడిరగ్‌ అన్నారు…స్విస్‌ ఛాలెంజ్‌ లో మోసం అన్నారు. సింగపూర్‌ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధాని పెట్టండని శివరామకృష్ణకమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే 12 పార్లమెంట్‌ స్థానాలు ఒకవైపు…మరో 12 పార్లమెంట్‌ స్థానాలు ఇంకోవైపు ఉండేలా చూసి…గుంటూరు సెంట్రల్‌ గా అమరావతిని రాజధానిగా గుర్తించాం.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట
‘మూడు రాజధానుల అని మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఎక్కడివి అని మాట్లాడారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకుని 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఇష్టపడని ఈ రోజుల్లో రాజధాని కోసం ముందుకు వచ్చి రైతుల భూమలు ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూములు, ప్రభుత్వ భూముల్లో రోడ్లు, బిల్డింగులు, ఇతర నిర్మాణాలు పోను మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజధాని నుండి సంపద తోనే అమలు చేయవచ్చు…కానీ గత పాలకులు నిర్వీర్యం చేశారు.
పవిత్ర మట్టి, నీళ్ల మహిమే రాజధానిని కాపాడిరది
‘‘ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ ప్రజావేదిక కూల్చి జగన్‌ పాలన ప్రారంభించారు. రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుండి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ప్రధాని నరేంద్రమోదీ కూడా పార్లమెంట్‌ మట్టి, యమునా నది నుండి నీళ్లు తెచ్చి నాడు మనకు సంఫీుభావం తెలిపారు. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడిరది. తాత్కాలికంగా కొంతమంది అతాలకుతలం చేయాలనుకున్నా ఈ మహత్యం వల్ల మళ్లీ నిలబెట్టుకోగలిగాం’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరి సహకారం, భాగాస్వామ్యంతో రాజధాని నిర్మాణం
‘‘వైసీపీకి ఓట్లు వేసిన వారు కూడా ఎలాంటి వారికి ఓటు వేశారో ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటేయడానికి క్యూలో అర్థరాత్రి వరకు ఓటర్లు నిలబడ్డారు. ఇతర ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకునే వారు కూడా సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకనే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారు.
ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్ని అణచివేస్తాం. రాజధానిలో జరిగిన నిర్మాణాలను ఉన్మాదిబారి నుండి దేవుడే కాపాడారు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్‌  కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్‌ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత ఉందా అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలీదు..అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలీదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాష్ట్రానికి పూర్వవైభం తీసుకొస్తాం..పునర్నిర్మిస్తాం. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారలు ప్రవర్తన మార్చుకోవాలి. అందరి సహకారం, భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరుగుతుంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Tags: అమరావతిచంద్రబాబునాయుడుపోలవరంరాజధాని అమరావతిశ్వేతపత్రం
Previous Post

క్రమశిక్షణతో, సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా

Next Post

గుజరాత్‌ తరహాలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

Next Post
గుజరాత్‌ తరహాలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

గుజరాత్‌ తరహాలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.