అమరావతి (చైతన్య రథం): తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెడతామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టుపెట్టి పిలవరని వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సభకు రావటం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తుచేశారు. దేవుడిని కూడా వైకాపా నేతలు రోడ్డుమీదకు తీసుకురావవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమన్నారు.
మండలి ఛైర్మన్‌ను కలిసిన కూటమి ఎమ్మెల్సీలు
శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజును కూటమి ఎమ్మెల్సీలు ఆయన ఛాంబర్‌లో కలిశారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలువైన సమయం వృథా చేయకుండా చూడాలని.. సభ సజావుగా నడిపించాలని కోరారు.















