చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల అహంకారం అణిచేస్తాం

ఉప ముఖ్యమంత్రి పవన్‌ హెచ్చరిక

by చైతన్యరధం
Dec 29, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వైసీపీ నేతల అహంకారం అణిచేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇంకా జగన్‌ ప్రభుత్వమే ఉందనుకుని విర్రవీగుతున్నారు
  • ఎంపీడీవోపై దాడి రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడిగా భావిస్తాం
  • నిందితులను కఠినంగా శిక్షిస్తాం
  • అధికారులకు అండగా ఉంటాం
  • 11 సీట్లకు పరిమితం చేసినా వైపీసీ నేతకు బుద్ధి రాలేదు
  • వైసీపీ నాయకుడు సుదర్శన్‌ రెడ్డి దాడిలో గాయపడ్డ ఎంపీడీవోకు పరామర్శ
  • అధైర్యపడొద్దని కుటుంబ సభ్యులకు భరోసా

కడప (చైతన్యరథం): అహంకారం నడి నెత్తికి ఎక్కిన వైసీపీ నాయకులు అధికారులపై దాడులు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లను ప్రశ్నిస్తే ఎవరైనా ఒకటే.. వీరి ఆధిపత్యం ఒప్పుకోకపోతే ఎవరి మీదనైనా దాడులకు దిగే స్వభావం చూపిస్తారని మండిపడ్డారు. తమను ప్రశ్నించే వాళ్లను, ఎదురు చెప్పే వాళ్లపై దాడి చేసి భయపెట్టడాన్ని వైసీపీ నాయకులు నైజంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారి అహంకారం దించుతాం.. తోలు తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో జవహర్‌ బాబుపై వైసీపీ నాయకుడు సుదర్శన్‌ రెడ్డి చేసిన దాడి అధికార యంత్రాంగం మొత్తం మీద చేసిన దాడిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అధికారిక విధుల్లో ఉన్న ఎంపీడీవో జవహర్‌ బాబుపై వైసీపీ నాయకుడు సుదర్శన్‌ రెడ్డి సుమారు 20 మంది అనుచరులతో వచ్చి కార్యాలయంలోనే దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన జవహర్‌ బాబుని కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం పవన్‌ వచ్చారు. చికిత్స పొందుతున్న జవహర్‌ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జవహర్‌ బాబుకి పలు ఆరోగ్య సమస్యలు ఉన్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని, మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలోనే ఉన్న జవహర్‌ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఎంపీడీవో జవహర్‌ బాబుపై దాడికి పాల్పడిన వ్యక్తి చట్టాల గురించి బాగా తెలిసిన వ్యక్తి.. గతంలో ఏపీ స్టేట్‌ లా ప్రాసిక్యూషన్‌ ఆఫీసర్‌గా ఉన్నారు.. అలాంటి వ్యక్తి కూడా ఎంపీడీవోపై భౌతిక దాడికి పాల్పడడం అనాగరికం.. హేయమని తప్పుబట్టారు. సదరు వైసీపీ నాయకుడి తల్లి ఎంపీపీగా పని చేస్తున్నారు. ఆమె ప్రజాప్రతినిధి అయితే ఆమె కార్యాలయ తాళాలు ఆమెకే ఇవ్వాలి. ఆ కార్యాలయ తాళాలు ఇవ్వను అని నిబంధనలు గురించి చెబితే ఎంపీడీఓ జవహర్‌ బాబుపై తీవ్రంగా దాడి చేయడం అప్రజాస్వామికమని పవన్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

ఈ దాడి చిన్న విషయం కాదు
ఎంపీడీఓపై అహంకారంతో ఇష్టం వచ్చినట్లు దాడి చేయడం ఏమిటి? ఇది ఆయన ఒక్కరి మీద జరిగిన దాడిగా మేము భావించడం లేదు. రాష్ట్ర యంత్రాంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. ఇందులో ఎంతటి వారు ఉన్న సరే చట్టం ముందుపెడతాం. ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులపై భౌతిక దాడులకు పాల్పడితే వారి ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బ తింటుంది. భవిష్యత్తులో కూడా దృఢంగా పని చేయలేరు. అధికార యంత్రాంగాన్ని భయపెట్టాలని భావిస్తే మేం చూస్తూ ఊరుకోబోమని పవన్‌ స్పష్టం చేశారు.

11 సీట్లు ఇచ్చినా బుద్ది రాలేదు
వైసీపీ నాయకులను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారి అహంకారం తగ్గలేదు. అహంకారంతో బరితెగించి ఈ పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం ఎంపీడీవో జవహర్‌ బాబుపై దాడి చేసిన జల్లా సుదర్శన్‌ రెడ్డి అనే వ్యక్తికి దాడులు చేయడం కొత్త కాదు. గతంలో కూడా ఎంపీడీవోగా పనిచేసిన ప్రతాప్‌ అనే అధికారిపైనా ఇదే జల్లా సుదర్శన్‌ రెడ్డి దాడి చేశారు. శేఖర్‌ నాయక్‌, శ్రీనివాసులు రెడ్డి అనే అధికారులు మీదా దాడి చేశారు. ఇది మా రాజ్యంగం అనుకొని వారికి ఎదురు చెబితే ఇష్టానుసారం అందరిపై దాడులు చేస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. వీరి ఆధిపత్య అహంకారాన్ని తగ్గించుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని పవన్‌ అన్నారు.

చూస్తూ ఊరుకోం
ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తామని చాలా మర్యాదగా, హుందాగా చెప్పిన జవహర్‌ బాబుపై ఇష్టానుసారం దాడి చేశారు. గడియ వేసి దాడికి తెగబడ్డారు. ఇది క్షమించరాని నేరం. జవహర్‌ బాబుకి హైబీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. భౌతికంగా దాడి చేయడమే కాకుండా ఆయన కులాన్ని కూడా దూషించి.. సుదర్శన్‌ రెడ్డి తన అహంకారాన్ని మరోసారి చూపించారు. వీరి ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై దాడి చేయడం అలవాటుగా మారింది. ఇంకా గత ప్రభుత్వమే ఉందనుకుంటూ, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నారు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకునే వ్యక్తిని కాదు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేను తప్పు చేసినా బలంగా శిక్ష పడాలి అని భావించే వ్యక్తిని. అలాంటిది అధికారిక విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేయడం తీవ్రంగా పరిగణిస్తాం. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పవన్‌ తెలిపారు.

అధికారులకు అండగా కూటమి ప్రభుత్వం
ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న అధికార యంత్రాంగంపై దాడులు చేస్తే ఏ మాత్రం సహించేది లేదు. నిబద్ధతగా పనిచేసే అధికారులకు కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రజల విషయాల్లో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పని చేస్తుంది. జవహర్‌ బాబు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అని నేను ఇక్కడికి రాలేదు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కష్టపడి పని చేసే అధికారులకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. విధులు నిర్వర్తిస్తున్న వారిపై ఇష్టానుసారం భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదు. కేసులో ఉన్న అందర్నీ తప్పనిసరిగా పట్టుకోవాలని, తప్పించుకున్న తొమ్మిది మందిని కూడా వెంటనే పట్టుకోవాలని ఎస్పీకి చెప్పాం. ఈ కేసులో నిందితులందరికీ చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని పవన్‌ స్పష్టం చేశారు.

రాయలసీమ యువతలో చైతన్యం రావాలి
బాధితుడైన ఎంపీడీఓ జవహర్‌ బాబు భార్య భయపడుతున్నారు. అలాంటి పరిస్థితికి ఇక్కడ ప్రజలను కొందరు తీసుకొని వచ్చారు. ఆ పార్టీ నాయకుడికి సూచిస్తున్నాను… వాళ్ల పార్టీలో ఇలాంటి దౌర్జన్యం చేసే వారిపై దృష్టి పెట్టి సరి చేసుకోవాలి. ప్రజలు ఇలాంటి బెదిరింపులను ఎదిరించి 11 సీట్లు ఇచ్చినా వాళ్ళకి బుద్ది రాలేదు. రాయలసీమ ప్రజలకు… ముఖ్యంగా యువతకు, మహిళలకు నేను చెబుతున్నది ఒక్కటే. దేనికీ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయినప్పుడు కచ్చితంగా యువత ప్రశ్నించాలి. అవసరమైతే దాడులు చేసే వారికి ఎదురు తిరగాలి. ఓటు వేసేశాం అక్కడితో పని అయిపోయింది అనుకోవద్దు. మార్పు అనేది కచ్చితంగా యువత నుంచే రావాలి. తప్పు చేసేవారు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టవద్దు. ఆఖరికి కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న దళిత అధికారులకు కూడా రక్షణ కరవైంది. వారు ప్రజల కోసం స్వేచ్ఛగా పని చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నాయకులను మళ్లీ మరోసారి ఎన్నికల్లో పాల్గొననీయకుండా యువతే పూనుకోవాలి. ఇలాంటి నాయకులు మాకు అక్కర్లేదు అని ప్రజలే బలంగా చెప్పాలి. రాయలసీమ యువతకు అండగా నిలుస్తాం.

అధికారిక ఆధిపత్య అహంకారాన్ని సమష్టిగా ఎదుర్కొందాం. అధికారులపై దాడులు చేసే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పక్కా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం. అధికారులపై భౌతిక దాడులకు పాల్పడే ఎలాంటి వ్యక్తులైన ఊరుకోవద్దని, కచ్చితంగా అధికార యంత్రాంగానికి అండగా నిలబడాలని చెప్పాం. ఎంపీడీవో జవహర్‌ బాబు భార్య కూడా తాము నిస్సహాయులం అని, ఏమీ చేయలేమని, మళ్లీ బయటకు వస్తే ఎలాంటి దాడులు జరుగుతాయోనని భయపడుతున్నారు. మేం ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. దీనిపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు తగు ఆదేశాలు ఇస్తాం. రాయలసీమలో అహంకారం తలకెక్కి ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే వారిని చట్టానికి అప్పగిస్తాం. యువత కూడా చైతన్యవంతులై ఈ దాష్టీకాలను ఎదిరించాలని పవన్‌ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్‌, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, అన్నమయ్య, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, కడప జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణ తేజ, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 28-12-2024

Next Post

గాలివీడు ఎంపీడీవోపై దాడి..వైసీపీ నేతల బరితెగింపునకు పరాకాష్ట

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist