చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సంక్షేమంపై చర్చకు మేం రెడీ… జగన్‌ సిద్ధమా?

సవాల్‌ విసిరిన యువనేత లోకేష్‌

by చైతన్యరధం
Apr 11, 2024 at 8:24am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంక్షేమంపై చర్చకు మేం రెడీ… జగన్‌ సిద్ధమా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడంలో జగన్‌ పీహెచ్‌డీ
  •  చంద్రబాబు వస్తే పెట్టుబడులు…జగన్‌ వస్తే దాడులు!
  • ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఆర్కేను ప్రజలు నిలదీయాలి
  • ఈ ఉగాదితోనైనా విధ్వంసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలి

మంగళగిరి(చైతన్యరథం): సంక్షేమం పేరుతో పేదల ఖాతాల్లో రూ.10 వేసి రూ. 100 లాగేయడం జగన్‌ కు వెన్నతో పెట్టిన విద్య.. 5ఏళ్లలో 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన జగన్‌, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు.. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ…మీరు సిద్ధమా అని యువనేత నారా లోకేష్‌ సీఎం జగన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్‌ అపార్ట్‌మెంట్‌ వాసులతో బుధవారం యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమేనని విమర్శించారు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు, ఎన్నికల సమయంలో ఎడపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తారని పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. పేదవిద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీవిద్య పథకాన్ని నిర్వీర్యం చేశాడు. జగన్‌ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు, పేదపిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా? విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగనామం పెట్టాడు. మేం అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం తెస్తాం. ఫీజు బకాయిల కారణంగా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చిక్కుకుపోయిన 6 లక్షలమంది సర్టిఫికెట్లను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసి విద్యార్థులకు అందజేస్తాం.  జగన్‌ ఇచ్చిన హామీలపై ఎవరైనా నేరుగా లేదా సోషల్‌ మీడియాలో నిలదీస్తే తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. గత అయిదేళ్లుగా ఏపీ సమాజం భయంతో బతుకుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు.  జగన్‌ను అరెస్టు చేస్తే వేలకోట్ల రూపాయల అవినీతి బయటకు వచ్చింది, చంద్రబాబుని  అరెస్టు చేస్తే ఆయన చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. తప్పుడు కేసులతో చంద్రబాబును 53రోజులు జైలులో పెడితే ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో తెలుగుప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేశారు. 5కోట్లమంది ప్రజల ఆశీస్సులతో ఆయన సింహంలా బయటకు వచ్చారు. చంద్రబాబు వస్తే రాష్ట్రానికి రోజుకో పెట్టుబడి వస్తుంది, జగన్‌ మళ్లీ వస్తే ప్రతిరోజూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడుల వార్తలే కన్పిస్తాయి. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్‌… అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పారు. జగన్‌ ఒక విధ్వంస పాలకుడు… ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించాడు. పోలవరం, అమరావతిని నాశనంచేసి మూడుముక్కలాట ఆడారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదం, అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం. భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని యువనేత లోకేష్‌ స్పష్టం చేశారు.

అభివృద్ధి అంటే ‘మంగళగిరి మోడల్‌’ అనేలా చేసిచూపిస్తా!

సంబంధితవార్తలు

నేడు ఉదయం 9.15 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

దేశం మొత్తం అభివృద్ధి అంటే గుజరాత్‌ మోడల్‌ అంటారని… రాబోయే రోజుల్లో మంగళగిరి మోడల్‌ అనేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలోని జూపిటర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులతో బుధవారం యువనేత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. ఈ ఉగాదితోనైనా విధ్వంసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలని కోరుకుంటున్నా. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ఆర్కేను నిలదీయాలి. వందరోజుల్లో అమరావతి పనులు ప్రారంభించి పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. అభివృద్ధిలో దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా చేస్తాం. ఐటీ, ఇతర పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంతో పాటు కుళాయి ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. పెరిగిన పన్నులు, ధరలను తగ్గిస్తాం. బ్లాక్‌ మోడల్‌ తరహాలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. దక్షిణ భారతంలోనే మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా అభివృద్ధి చేస్తాం. దీంతో అదనంగా 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మంగళగిరి నియోజకవర్గంలో గంజాయి పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే పెద్దఎత్తున గంజాయి లభిస్తోంది. సీఎం ఇంటి సమీపంలో గ్యాంగ్‌ రేప్‌ జరిగి ఏళ్లు గడిచినా నిందితులను పట్టుకోలేదు. వంద రోజుల్లో గంజాయి సమస్యలకు చెక్‌ పెడతాం. 2019 ఎన్నికల్లో 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను. అప్పటి నుంచి కసితో పనిచేస్తున్నా. మంగళగిరిలో గతంలో ఎవరూ చేయని విధంగా 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రతిపక్షంలో ఉండగానే బీపీవో కంపెనీ తీసుకువచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే దేశం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత లోకేష్‌ చెప్పారు.

నేలపై తిరిగితే అభివృద్ధి కనిపిస్తుంది: పెమ్మసాని

గుంటూరు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో  ఏం అభివృద్ధి జరిగిందని జగన్‌ అంటున్నారు, బాబు హయాంలో చేసిన అభివృద్ధి చూడాలంటే హెలికాప్టర్లపై కాకుండా నేలపై తిరగాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24వేల కిమీల సీసీ రోడ్లు వేశారు. పట్టిసీమ నిర్మాణంతో రైతులను ఆదుకున్నారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం. ఎన్నికలు రాగానే జగన్‌ ఓట్ల రాజకీయం ఆడుతున్నారు. వైసీపీ వాళ్లు కాకపోతే పింఛన్లు తీసేస్తున్నారు.  పింఛన్ల పేరుతో వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. శవరాజకీయాలు చేస్తున్న జగన్‌ను ప్రజలంతా తిప్పికొట్టాలని పెమ్మసాని పిలుపునిచ్చారు.

విజనరీ లీడర్‌ అవసరం: చిల్లపల్లి

జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం ఒకతరం వెనకబడి పోయిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం కోలుకోవాలంటే చంద్రబాబు లాంటి విజనరీ లీడర్‌ అవసరం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంగళగిరి ప్రాంతంలో బిల్డర్లు పారిపోయారు. రాష్ట్రాన్ని జగన్‌ యాచించే స్థాయికి దిగజార్చాడు. ఐదేళ్లు దోపిడీపై తప్ప అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు.  ఆహ్లాదాన్ని పంచే హాయ్‌ల్యాండ్‌ నేడు బూత్‌ బంగ్లా మాదిరి తయారైంది, లోకేష్‌ గెలుపు ` మంగళగిరి అభివృద్ధికి మలుపు కాబోతుంది. రాష్ట్రమంతా మంగళగిరివైపు చూస్తోంది. మరోమారు వైసీపీ ఉచ్చులో పడకుండా ఓటర్లు విచక్షణతో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి. వైసీపీ అంటేనే గొడవల బ్యాచ్‌, ఎటువంటి గొడవ చేసినా డైవర్ట్‌ కాకుండా లోకేష్‌ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రీనివాసరావు విజ్ఞప్తిచేశారు.

 

లోకేష్‌ దృష్టికి అపార్ట్‌మెంట్‌ వాసుల సమస్యలు..

జూపిటర్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు తమ సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం లేదు. 80శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బు పడలేదు. గన్నవరం విమానశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు కల్పించాలి. గోపాల మిత్రలను ఆదుకోవాలి. కోతలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్య పథకాన్ని నిలిపివేసి ఇబ్బంది పెడుతున్నారు. ఎస్‌ఆర్‌ఎం, విట్‌కు వెళ్లే రోడ్లు పాడైపోయాయి, చదుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లోకేష్‌ స్పందిస్తూ వచ్చే ప్రభుత్వంలో గోపాల మిత్రలను ఆదుకుంటామని, గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, ఇంటివద్దకే పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్నారు. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని తీసుకురావడంతో పాటు 6 లక్షల మంది విద్యార్థులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసి సర్టిఫికెట్లు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

 

పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని ఆర్కే మోసం చేశారు! – లోకేష్‌ ఎదుట యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసుల గోడు

పింఛన్ల విషయంలో టీడీపీపై జగన్‌ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు, రాబోయే ప్రజా ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఇంటి వద్దే అందిస్తామని యువనేత నారా లోకేష్‌ చెప్పారు.  చినకాకాని యార్లగడ్డ సుబ్బారావు కాలనీ వాసులతో యువనేత బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈనెలలో సకాలంలో పింఛన్‌ అందక 32మంది చనిపోయారు. మా ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ను 4వేల రూపాయలకు పెంచడంతోపాటు వాలంటీర్ల ద్వారా ఇతర సంక్షేమ పథకాలను అమలుచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సమస్యలను చెబుతూ… మా ప్రాంతంలో 400 కుటుంబాలు ఉన్నాయి,  గత ఎన్నికల సమయంలో ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తానని చెప్పిన ఆర్కే ఐదేళ్లుగా కన్పించకుండా పోయారు. మా ప్రాంతంలో అంగన్‌ వాడీ భవనం, వాటర్‌ ట్యాంక్‌ నిర్మించాలి. స్కూలు, వీధిదీపాలు ఏర్పాటుచేయాలి. 1999లో  చంద్రబాబు హయాంలో ఇచ్చిన  ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి, శ్మశాన వాటిక ఏర్పాటుచేయాలి. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. యువనేత లోకేష్‌ మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆర్కేకు పనిచేసే మనసులేదు. ఆయన అద్భుతమైన నటుడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలనీవాసులు కోరిన విధంగా ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామని లోకేష్‌ హామీ ఇస్తారు. కాలనీవాసులు  నా దృష్టికి తెచ్చిన సమస్యలన్నింటిటీ పరిష్కరిస్తాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంతో పాటు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

Tags: ఎన్డీఏ కూటమిమంగళగిరిమంగళగిరి ప్రజలుమన మంగళగిరి మన లోకేష్యువనేత నారా లోకేష్‌
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2024

Next Post

నేటినుండి తుదివిడత నిజం గెలవాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist