అమరావతి (చైతన్య రథం): క్రిస్మస్ పర్వదినం రాష్ట్ర ప్రజలకు కొత్త వెలుగులు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. క్రైస్తవ పర్వదినం క్రిస్మన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఎక్స్’ వేదికపై పోస్టు పెట్టారు. “శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ క్రైస్తవ సోదరులకు శు భాకాంక్షలు తెలుపుతున్నాను. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవవంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరం. క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోంది. రాష్ట్రంలోని 8,418మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గత 12 నెలల గౌరవ వేతనాలను ఒకేసారి ఇస్తూ రూ.51 కోట్లు విడుదల చేశాం. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఇదే నిదర్శనం” అని చంద్రబాబు పోస్టులో పేర్కొన్నారు.













