చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఓట్ల పండుగ నేడే!

నేటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

చైతన్యరధం by చైతన్యరధం
May 13, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఓట్ల పండుగ నేడే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ సమయం
  • మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వరకు, మరో మూడు చోట్ల 4 గంటల వరకే..
  • మొత్తం ఓటర్లు 4.14 కోట్లు, 46వేల 389 పోలింగ్‌ కేంద్రాలు
  • 1.14 లక్షల మంది భద్రతా సిబ్బంది
  • ఎన్నికల విధుల్లో మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది
  • 14 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వందశాతం వెబ్‌ కాస్టింగ్‌
  • గతంలోకన్నా పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఈసీ అంచనా

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఓట్ల పండుగకు వేళయింది. సోమవారం జరిగే ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోగా.. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్‌ సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీ చేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 2.02 కోట్ల మంది పురుషులు కాగా.. 2.1 కోట్ల మంది మహిళలు, 3,421 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అలాగే, 68,185 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తంగా 1.14లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 3,500 మంది కర్ణాటక పోలీసులు, 4500 మంది తమిళనాడు పోలీసులు, 1,614 మంది మాజీ సైనికులు. 246 మంది విశ్రాంత పోలీసు సిబ్బంది. తదితరులు ఉన్నారు.
మొత్తం 46వేల 389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగానికి పైగా పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటే వేసే అవకాశం కల్పిస్తారు.
వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 46వేల 389 పోలింగ్‌ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. 3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్‌ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్‌ఓలు విధుల్లో ఉంటారు. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల 459 పోలింగ్‌ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్టు ఈసీ తెలిపింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో వందశాతం వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని, పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయట వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
పోలింగ్‌ నిర్వహణ పర్యవేక్షణ కోసం ముగ్గురు ప్రత్యేక సాధారణ, పోలీసు, వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లును ఈసీ నియమించింది. పోలింగ్‌ రోజు సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. జూన్‌ 1వ తేదీ వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్‌లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో హింసకు తావులేని రీతిలో, రీ పోలింగ్‌ అవసరం రాని విధంగా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యం అని ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. పట్టణ ప్రాంత ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.
లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు,175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్ధులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్ధులు రేసులో ఉన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో ఆరుగురు మాత్రమే పోటీ చేస్తున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీపడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కంటే ఎక్కువ బ్యాలెట్‌ యూనిట్లు వినియోగిస్తారు.
ఆదివారం సాయంత్రానికి సిబ్బంది పోలింగ్‌ బూత్‌లకు చేరుకుని, మే 13న ఉదయం పోలింగ్‌ సిబ్బంది మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవుతుందని సీఈఓ తెలిపారు. అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటరు ఎవరైనా పోలింగ్‌ ఏజెంట్‌గా ఉండవచ్చు. రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్‌ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చు అని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని సీఈవో స్పష్టం చేశారు. తెల్లటి స్లిప్పులపై ఓటరు పేరు, సీరియల్‌ నెంబరు ఉండవచ్చని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకెళ్లకూడదని చెప్పారు. పోలింగ్‌ రోజు ప్రతి అభ్యర్థికీ మూడు వాహనాలు అనుమతిస్తారన్నారు.
ఈసారి ఏపీకి ఓటర్లు కూడా భారీగా తరలివస్తుండటంతో 83 శాతం పైగా పోలింగ్‌ జరిగే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది. గతంలో 79.74 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ రోజు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలసి ఈసీ అధికారుల్ని ఆదేశించింది, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పోలింగ్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక యాప్‌ (పోల్‌ డేటా మానిటరింగ్‌ యాప్‌)ను తీసుకువచ్చామని వెల్లడిరచారు.
ఈవీఎంలు, తదితర ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు నిర్దేశించిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి తమకు కేటాయించిన ఈవీఎంలు, తదితర సామగ్రి తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు పయనమయ్యారు. కాగా, సెక్టార్‌ ల వారీగా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. పోలింగ్‌ వేళ అనుసరించాల్సిన విధివిధానాలను అధికారులు సిబ్బందికి వివరించారు. ఇప్పటికే వారికి ఆయా అంశాలపై శిక్షణ ఇచ్చారు.

నాగబాబు ఆరోపణలపై సీఈఓ వివరణ
చెరగని సిరా విషయంలో జనసేన నేత నాగబాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోపై సీఈవో కార్యాలయం వివరణ ఇచ్చింది. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఓటర్లను ఎన్నికలకు దూరం చేసేందుకు అధికార వైసీపీ డబ్బుతో వారిని ప్రలోభపెట్టి ముందుగానే చేతికి సిరా గుర్తు అంటిస్తోందంటూ నాగబాబు వీడియో విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా కార్యాలయం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించింది. భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులకు మాత్రమే చెరగని సిరాను వాడే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో నాగబాబు వీడియో స్క్రీన్‌ షాట్‌ ను జత చేసి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.

Tags: ఓటుమే13సీఈసీ
Previous Post

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

Next Post

దొంగే.. దొంగ, దొంగ అన్నట్లుగా సజ్జల వ్యాఖ్యలు

Next Post
ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వాలి

దొంగే.. దొంగ, దొంగ అన్నట్లుగా సజ్జల వ్యాఖ్యలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.