చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

చైతన్యరధం by చైతన్యరధం
August 23, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దేశంలోనే మొదటిసారిగా భారీస్థాయిలో నిర్వహణ
  • రూ.4,500 కోట్ల ఉపాధి నిధులతో పనులకు తీర్మానాలు
  • 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన
  • గ్రామాల ఆదాయం పెంచేలా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు
  • పంచాయతీల్లో స్వయంపాలన, పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం
  • గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్‌ తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం
  • ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు..పర్యాటకులను ప్రోత్సహిస్తాం
  • సోషల్‌ ఆడిట్‌ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం
  • పరిశ్రమల్లో కాలుష్యం, రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెడతా
  • ఈ నెలాఖరులో విశాఖపట్నంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం
  • మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

మంగళగిరి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారద ర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం.. దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తు న్నామని ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్‌కళ్యాణ్‌ తెలిపారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఉపా ధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చించేందుకు మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నిర్వహించనున్న గ్రామసభలపై గురువారం మంగళగిరిలోని ఆయన ప్రైవేట్‌ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరా లు వెల్లడిరచారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నట్టు వివరిం చారు. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో గ్రామాల్లో 87 రకాల పనులను చేయనున్నట్టు వివరించారు. దీనిద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణా ళిక అమలు చేస్తామని పేర్కొన్నారు.

పంచాయతీల నలుదిశలా విప్లవం
పంచాయతీ వ్యవస్థను మొదలుపెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌..73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటిం ది. రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశలా విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలుపెడుతున్నామని వివరించారు. గత మూడు దశాబ్దాలుగా పంచాయ తీలకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్‌ పంచాయతీలకు రూ.100, మేజర్‌ పంచాయతీలకు రూ.250 ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా మైనర్‌ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్‌ పంచాయతీలకు రూ.25 వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందాం
పంచాయతీ సంస్కరణల కొనసాగింపులో భాగంగా శుక్రవారం గ్రామసభలు నిర్వ హిస్తున్నామని తెలిపారు. గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచా యతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తామని చెప్పారు. మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుందని తెలిపారు. భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాని మోదీ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పంచాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. పంచాయతీలకు ఉండే అధికారాలను గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా చేసి పూర్తిస్థాయిలో గ్రామాల ముఖచిత్రం మార్చుకునేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వంలో పంచాయతీల నిర్వీర్యం
ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో 2019-2023 సంవత్సరం వరకు రూ.40,579 కోట్లు నిధులు వచ్చాయి. ఈ పనుల పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని, కరోనా సమయంలో ఈ నిధులను ఇష్టానికి వాడు కున్నారన్నారు. దీంతోపాటు గత ప్రభుత్వ విధానాల కారణంగా పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. 2014-19 వరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రూ.240 కోట్లు ఉంటే, 2019-23 సంవత్సరాల్లో ఆ ఆదా యం కేవలం రూ.170 కోట్లే వచ్చిందని వివరించారు. కూటమి ప్రభుత్వం పంచా యతీలకు స్వయం పాలన, స్వేచ్ఛ తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తోందన్నారు. పంచాయతీలు వాటి కాళ్ల మీద అవే నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నామని వివరించారు. పంచాయతీలకు సంబంధించిన విద్యుత్‌ ను అవే ఉత్పత్తి చేసుకునేలా, వాటి ఆదాయం అవే సంపాదించుకునేలా తయారు చేస్తాం.. రాష్ట్రాభివృద్ధిలోనే కాకుండా దేశాభివృద్ధిలోనూ రాష్ట్ర పంచాయతీలు కీలకంగా వ్యవహరించేలా తయారుచేస్తామని తెలిపారు.

పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి ఆదాయం సృష్టిస్తాం
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కళలు, ఆహార పదార్థాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి వాటికి మన గ్రామాలు ప్రత్యేకం. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణా జిల్లాలో చిలకలపూడి, కొండపల్లి హస్తకళలకు ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలను గ్రామసభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమో ట్‌ చేయాలని భావిస్తున్నాం. తయారుచేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. గ్రామసభలకు యువత, మహిళలు విరివిగా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

సామాజిక అడవుల విభాగంలో కలప పెంపకం
పంచాయతీల్లో చాలా భూమి నిరుపయోగంగా ఉంటుందని, దాన్ని క్రమపద్ధతిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ భారత్‌ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓ ప్రణాళిక ప్రకారం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్‌, గ్రీన్‌ గ్రామాలు గా తయారు చేసేలా దృష్టిపెడుతున్నామని వివరించారు. డెన్మార్క్‌ అనే చిన్న దేశం నుంచి మన దేశం రూ.6 వేల కోట్ల విలువైన కలపను ఏటా అధికంగా దిగుమతి చేసుకుం టున్నాం. ఇంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేవలం కలప కోసమే వెచ్చిస్తున్నాం. గ్రామ పంచాయతీలకు సంబంధించి వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవుల విభా గంలో కలపను పెంచాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీనిద్వారా పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంద ని, మూగజీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయో గిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తు న్నామని వివరించారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ బలహీనం చేశారు
గత ప్రభుత్వంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు, ఉపాధి పనుల్లో చాలా అవకతవకలు జరిగాయని తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం పనులకు పైపులైన్లు వేసి వదిలేశారు.. వాటికి కనెక్షన్‌ ఇవ్వలదన్నారు. మరోపక్క పైపులైన్ల కోసం తవ్విన పనులు ఉపాధి హామీ పథకంలో చేశారు. అసలు ఏ పనులు దేనికి చేశారో గ్రామ సర్పంచులకు తెలియదు. పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయలేదని ఆ విభాగానికి పోలీసు అధికారిని హెడ్‌గా పెట్టాలని ఆలోచి స్తున్నామని తెలిపారు. దీనిపై అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ విభాగం బాధ్యుడిని తప్పించామని, రకరకాల అభియోగా లు వచ్చిన అధికారులను పక్కన పెట్టామని తెలిపారు. నిఘా విభాగంపై నిఘా పెట్టాల్సి వచ్చిందన్నారు. పంచాయతీల్లో సిటిజన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు ఉండాలి..దాన్ని ప్రతి పంచా యతీల్లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వంలో పెండిరగ్‌లో ఉండిపోయిన రూ.2 వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వంలో విడుదల చేసినట్టు తెలిపారు. మెటీరియల్‌ కంపోనెంట్‌ గ్రాంట్‌ను త్వరలోనే ఇస్తామని చెప్పారు.

పంచాయతీల్లో నీటి పరిస్థితిపై సర్వే
నీటి కోసం గ్రామాల్లో నిబంధనలు ఉల్లంఘించి బోర్లు వేస్తున్నారు. దీనివల్ల ఫ్లోరైడ్‌ ఎక్కువగా పడుతోంది. భూమి పొరలను దాటి నీటి కోసం లోతులకు వెళుతున్న కొద్దీ ఫ్లోరైడ్‌ వస్తోంది. నీటి పునర్వినియోగంపై దృష్టి సారించినప్పుడే భూగర్భ జలాలు పెరిగి తక్కువ దూరంలోనే నీళ్లు లభిస్తాన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పల్స్‌ సర్వే చేస్తున్నామని, పంచా యతీల్లో నీటి పరిస్థితిపై 16 అంశాలతో సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 22 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయిందని, ఇది రాష్ట్రం మొత్తం మీద పూర్తయితే అన్ని పంచాయతీల్లో ఉన్న వాటర్‌ సోర్సు మీద ఓ స్పష్టత వస్తుందని తెలిపారు. అప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం నీటి సమస్యను తీర్చేందుకు ముందుకువెళతామని వివరించారు.

విశాఖలో పరిశ్రమల కాలుష్యంపై నిఘా
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్ర మల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎసెన్షియా ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆ పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానుల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫ్యాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్‌ చేయడం మీద దృష్టి పెడతాం. సేఫ్టీ ఆడిట్‌ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతామని తెలిపారు. పరిశ్రమల్లో రక్షణ అంశంపై తానే ప్రత్యేక దృష్టి పెడతానని వివరించారు. ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యేకంగా దీనిపై సమా వేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలో రోజురోజుకూ కాలుష్యం పెరుగు తోందని, దీనిని నివారించేందుకు దృష్టి పెడతామని తెలిపారు. పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా, ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని వివరించారు.

Tags: గ్రామసభలుపంచాయితీలుపవన్‌ కళ్యాణ్‌
Previous Post

తప్పు జరిగుంటే శిక్ష : సీఎం చంద్రబాబు నాయుడు

Next Post

పిన్నెల్లి అనుచరులు భూమి కబ్జా చేశారు

Next Post
పిన్నెల్లి అనుచరులు భూమి కబ్జా చేశారు

పిన్నెల్లి అనుచరులు భూమి కబ్జా చేశారు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.