చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇది చదవాల్సిన చరిత్ర!

ముఖ్య అతిధి ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Mar 7, 2025 at 7:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇది చదవాల్సిన చరిత్ర!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు
  • ప్రపంచ పోకడలను తెలుగులో అందివ్వడం అద్భుతం
  • నా తోడల్లుడు దగ్గుబాటి మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి
  • సమాజానికి మంచి పుస్తకాన్ని ఇచ్చినందుకు అభినందనలు
  • వెంకయ్యలో పవర్‌, పంచ్‌లు ఏమాత్రం తగ్గలేదు..
  • సీతారామన్‌ ఆర్థిక విధానాలకు ప్రజలనుంచి ప్రశంసలు
  • ఆమె ప్రయాణం మహిళలకు స్ఫూర్తి దాయకం..
  • భారత్‌ను బలమైన శక్తిగా మార్చడంలో ఆమె కృషి అమోఘం
  • తెలుగుజాతి అగ్రపథాన ఉండాలన్నదే నా ఆశయం..
  • లక్ష్యాలను సాధించి రాష్ట్ర భవిష్యత్‌ను మార్చాలన్నది నా కల
  • ముఖ్య అతిధి ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖపట్నం (చైతన్య రథం): కొన్నివేల సంవత్సరాల మానవ పరిణామక్రమాన్ని, ప్రపంచ చరిత్రను పుస్తక రూపంలో తెలుగులో రచించడం అద్భుత ప్రయత్నం. చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకం రాస్తారని నేను అనుకోలేదు. స్వతహాగా రచయిత కానటువంటి రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎవరూరాయని విధంగా పుస్తకాన్ని రాశారు. ప్రతి ఇల్లు, ప్రతి లైబ్రరీలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఉండాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీమంత్రి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసిన పుస్తకాన్ని సమయం కుదుర్చుకుని పూర్తిగా చదువుతానని ప్రకటించిన సీఎం చంద్రబాబు, ‘ప్రపంచ చరిత్ర’నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు.

కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాటి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయంవంటి అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. లోతుకువెళ్లి, సాధించాలనే తపన ఉంటేనే పుస్తకం రాయడం సాధ్యమవుతుంది. యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మతపెద్దల పెత్తనాలు, ఖండాల విభజన, బానిస వ్యవస్థ, అభివృద్ది.. ఇలా ఏ విషయాన్నీ వదిలిపెట్టకుండా పుస్తకంలో వెంకటేశ్వరావు ప్రస్తావించారు. భాష కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, భూస్వామ్య వ్యవస్థ, రాజులతోపాటు ఏపీలో ప్రజాపాలన గురించీ వివరించారు. అచ్చుయంత్రం, సాంకేతిక విప్లవం, భవిష్యత్తులో ఏంజరుగుతోందో కూడా ముందుగానే ఊహించి తెలిపారు. ఇలాంటి మంచి పుస్తకం రాసిన వెంకటేశ్వరావును అభినందిస్తున్నాను. పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనంగా ఉంది. మా కుటుంబం నుంచి మంచి రచయిత అధ్యయనం చేసి పుస్తకాన్ని సమాజానికి అందించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
నా తోడల్లుడు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి
దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాకు తోడల్లుడు. మా కుటుంబంలో ఒక విశిష్టమైన వ్యక్తి. ప్రతి అంశాన్నీ లోతుగా ఆలోచిస్తారు. మేమిద్దరం ఒక స్ఫూర్తినిచ్చే ఎన్టీఆర్‌ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాం. ఎన్టీఆర్‌ మాకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించేవారం. వెంకటేశ్వరరావు డాక్టరు… డాక్టరు చేశాక ప్రాక్టీస్‌ చేయాలి. కానీ మంత్రిగా ఉండి (నవ్వుతూ) డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేశారు. అందరం ఏదోకచోట తిరగాలని అనుకుంటాంగానీ.. పుస్తకం రాయాలని అనుకోం. మా కుటుంబంలో వెంకటేశ్వరరావు రిలాక్స్‌గా, జోవియల్‌గా ఉంటారు. ఇటీవల నన్ను కలిసినప్పుడు ఆయన్ను చూసి కొన్ని అనుమానాలను గురించి ప్రస్తావించాను. ఏవిధంగా సమయం గడిపి సంతోషంగా ఉంటున్నారని ప్రశ్నించాను.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

అరాచక ప్రవర్తనే వారి నైజం

దానికి వెంకటేశ్వరరావు సమధానం చెప్తూ…. ఉదయం బ్యాడ్మింటన్‌ ఆడుతాను. పిల్లలతో కాసేపు ఆడుకోవడం, స్నేహితులతో మాట్లాడటం, సాయంత్రం ఇంట్లో పిల్లలకు కథలు చెప్పి నిద్రపోతానని చెప్పారు. పేకాట కూడా ఆడతానని (నవ్వులు చిందిస్తూ) చెప్పారు. ఇప్పటికి వెంకటేశ్వరావు ఐదు పుస్తకాలు రాశారు. మొదటి పుస్తకం ఒక చరిత్రలో కొన్ని నిజాలు అని రాశారు. తర్వాత తెలుగువారి చరిత్ర-వేర్పాటువాదం, ప్రపంచతత్వం- నాయకత్వం, ప్రపంచ దేశాలు- పాలనా వ్యవస్థల అనే పుస్తకాలు రచించారు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర పుస్తకం రాశారు. అగ్రదేశాలన్నీ యువరక్తం లేక బాధపడుతున్నాయి. టెక్నాలజీ ఉంది. కానీ ఆపరేట్‌ చేసే మనుషులు లేని పరిస్థితి తలెత్తింది. కానీ భారతదేశం అదృష్టదేశం. మన దేశానికి కావాల్సినంత యువశక్తి ఉంది. చరిత్రను సృష్టించే అదృష్టం భారతదేశానికి వచ్చింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

వెంకయ్యనాయుడులో పవర్‌, పంచ్‌లు తగ్గలేదు
‘1978లో నేను, వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచాం. అప్పటికీ ఇప్పటికీ ఆయన పవర్‌ తగ్గలేదు. పంచులు పెరుగుతున్నాయి. ఎప్పుడూ అచ్చతెలుగులో మాట్లాడుతుంటారు. చిన్నకుంటుంబలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి అయ్యారు. గీతం యూనివర్సిటీని గతంలో కూల్చాలని చూశారు. ఎంవీవీస్‌ మూర్తి ఒక చరిత్ర సృష్టించారు. గీతం యూనివర్సిటీని ఎందుకు నెలకొల్పాల్సి వచ్చిందని ఒకసారి అడిగాను. మా రెండో అబ్బాయికి కాలేజీలో సీటు ఇవ్వలేదు. అందుకే మంచి వ్యవస్థను పెడతానని ఛాలెంచ్‌ చేసి గీతం యూనివర్సిటీని పెట్టానని ఆయన నాకు చెప్పారు’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

ఆత్మస్థయిర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను
ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. గతంలో అమెరికా బెస్ట్‌ అనేవారు. ఇప్పుడు ఇండియన్స్‌ బెస్ట్‌ అంటున్నారు. అందులో తెలుగువారు అగ్రభాగాన ఉన్నారు. అశ్రద్ధ లేకుండా కష్టపడితే వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర విజన్‌ సాకారమవుతుంది. నాలోని ఆత్మస్థయిర్యాన్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాలో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ మాత్రమే కాదు… బలమైన నమ్మకముంది. దేశాన్ని మోదీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకున్నప్పుడు నా తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నది నా ఆశయం’ అని సీఎం ఉద్ఘాటించారు.

ఇంకొంత ట్రీట్మెంట్‌ అవసరం
మగవారికంటే మహిళలు బాగా పని చేస్తారు. నిర్మలా సీతారామన్‌ ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. బీజేపీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు. 2014లో మొదటిసారి రాజ్యసభకు ఎంపీగా ఏపీనుంచి ఎంపికై కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నరేంద్రమోదీ ఆశయాల కోసం నిరంతరం పని చేస్తున్నారు. ప్రజలు మెచ్చుకునే ఆర్థిక మంత్రిగా కార్యక్రమాలు చేపట్టారు. వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014నాటికి 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో 3వ స్థానానికి వస్తుంది. దీనికి మనమంతా అభినందించుకోవాల్సి ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మందులతో వెంటిలేటర్‌పై నుంచి బయటపడగలిగాం. పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత చికిత్స అవసరం. రాష్ట్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహకరిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Previous Post

దొరస్వామి నాయుడు మృతి విద్యారంగానికి తీరనిలోటు

Next Post

దొరైస్వామినాయుడు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026

కార్యకర్త
@ February 12, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం
ఆంధ్రప్రదేశ్

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026

కార్యకర్త
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..
ఆంధ్రప్రదేశ్

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026

కార్యకర్త
@ February 10, 2026
బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి
ఆంధ్రప్రదేశ్

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

చైతన్యరధం
@ February 10, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026

హిందూ సమాజానికి జగన్ రెడ్డి ద్రోహం

చైతన్యరధం
@ February 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist