చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కక్షసాధింపులుండవు..తప్పుచేసిన వాళ్లను చట్టప్రకారం శిక్షిస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టీకరణ

చైతన్యరధం by చైతన్యరధం
June 12, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నాడు అలా.. నేడు ఎలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమవుతుంది
  • ప్రతి అడుగు ప్రజల కోసమే
  • ఘనవిజయంతో విర్రవీగొద్దు
  • అధికారాన్ని బాధ్యతగా తీసుకుందాం
  • పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీళ్లు
  • పవన్‌ మద్దతును ఎప్పటికీ మర్చిపోను
  • ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదాం….తెలుగు జాతిని నెంబర్‌-1 చేద్దాం
  • ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా
  • ఎన్డీఏ శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
  • ముఖ్యమంత్రిగా నేడే ప్రమాణ స్వీకారం

అమరావతి(చైతన్యరథం): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన దార్శనికతతో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కించారు. విజన్‌ 2020 పేరిట చంద్రబాబు దూరదృష్టితో రూపుదిద్దుకున్న ప్రణాళిక..హైదరాబాద్‌లో అంతర్భాగంగా సైబరాబాద్‌ అనే నూతన అత్యాధునిక, సంపన్న నగరాన్ని సృష్టించింది. నేడు హైదరాబాద్‌ విశ్వనగరంగా భాసిల్లుతోందంటే చంద్రబాబు వేసిన నాలెడ్జ్‌ ఎకానమీ అనే పునాదులే కారణం. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు తన అనుభవంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. అనేకానేక కొత్త పరిశ్రమల రాక ఒకవైపు, శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్‌ మరోవైపు, అన్నింటినీ మించి అన్ని అడ్డంకులూ తొలగిపోయి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంటున్న వేళ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి రాష్ట్రానికి శరాఘాతంలా తగిలింది. గత ఐదేళ్లుగా జగన్‌రెడ్డి విధ్వంస పాలనలో అన్ని రంగాల్లోనూ సర్వనాశనమైన రాష్ట్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ప్రజలు మరోసారి తప్పు చేయబోమంటూ అభివృద్ధి సాధకుడు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ సారి ఎన్నికల్లో అఖండ విజయం అందించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో కూటమి శాసనసభా పక్షనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరచగా, కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ క్రమంలో గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద చంద్రబాబు బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మెగాస్టార్‌ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.

అధికారాన్ని బాధ్యతగా భావించాలి
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుంచి ప్రజాపాలన సాగుతుందని….ప్రతి నిర్ణయం…ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజావేదికలా కూల్చివేతలు, మూడు రాజధానుల పేరుతో ఆటలు ప్రజా ప్రభుత్వంలో ఉండవని ఉద్ఘాటించారు. బాధ్యతాయుతమైన, ఒక పాజిటివ్‌ గవర్నమెంట్‌ ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రజలు తమకు ఇచ్చింది అధికారం కాదని…అత్యున్నతమైన బాధ్యత అని పేర్కొన్నారు. అశాంతికి తావు లేకుండా రాష్ట్రంలో పాలన ఉంటుందన్నారు. తాను చాలా ఎన్నికలు చూశానని, ఈ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంది. కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా. ప్రమాదంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలి అనేది మన లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచారు…రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక, విధ్వంసకర పాలనను ఐదేళ్లు ప్రజలు భరించారు. మూడు పార్టీలు అత్యున్నత ఆశయాలతో పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నోసార్లు కలయిక జరిగినప్పటికీ ఇప్పటి పొత్తును నూటికి నూరు శాతం కార్యకర్తలు, నేతలు స్వాగతించి సమష్టిగా పని చేశారు. కూటమి విజయానికి కష్టపడ్డ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు.

ప్రజలు పెట్టుకున్న నమ్మకంతోనే ఇంతటి విజయం
1994లో జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా జరిగినప్పటికీ ఇన్ని ఓట్లు, సీట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయింది కేవలం 11 సీట్లలో మాత్రమే. 93 శాతం స్ట్రైక్‌ రేట్‌ తో 57 శాతం ఓట్లను కూటమి సాధించింది. ఇది గెలుపు మాత్రమే కాదు…మనపై ఉన్న బాధ్యత. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, నంద్యాల పార్లమెంట్‌ స్థానాల పరిధిలో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. జనసేన 21 సీట్లలో పోటీ చేసి 21 స్థానాలనూ గెలించింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 చోట్ల విజయం సాధించింది. ప్రజలు మనల్ని ఆశీర్వదించి గెలిపించారు. మనకు ఇలాంటి విజయం…ఇంతటి సంతోషం ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మనపై పెట్టుకన్న నమ్మకం. 95 వేల ఓట్ల మెజార్టీతో గాజువాకలో టీడీపీని గెలిపించారు. ఫలితాలతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగింది. ఏ స్థానాన్ని ఏ అభ్యర్థికి కేటాయించాలో నిర్ణయించి గెలుపే ధ్యేయంగా సీట్లు కేటాయించామని చంద్రబాబు వివరించారు.

కష్టకాలంలో పవన్‌ కళ్యాణ్‌ మద్దతు ఎప్పుడూ మర్చిపోలేను
అక్రమ కేసులతో నన్ను జైల్లో పెట్టినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన మద్దతును ఎప్పుడూ మరిచిపోను. నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గతంలో చెప్పినప్పటికీ జైల్లో నన్ను కలిసిన అనంతరం పొత్తు ప్రకటించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు చొరవ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ధర్మవరంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వైసీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంతో పాటు ఏపీకి ఏం అవసరమో చెప్పారు. దీంతో ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. కూటమిపై నమ్మకం పెరిగింది. చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట సభలతో పాటు విజయవాడ రోడ్‌ షోలో మోదీ పాల్గొన్నారు. ఈ సభలు, రోడ్‌ షో లకు ప్రజల నుండి విశేషమైన స్పందన వచ్చింది. కూటమి నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో కష్టపడ్డ విధానం ఎప్పుడూ చూడలేదు…ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పని చేశారు. మీ సహకారంతోనే 4వ సారి సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నా. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. మళ్లీ ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరం…ఈ మేరకు కేంద్రం కూడా హామీ ఇచ్చింది. మోదీ, అమిత్‌, నడ్డాతో పాటు కేంద్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

నాకు తెలిసింది ప్రజాహితం..ప్రజల కోసం కష్టపడటమే
45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో రాగద్వేషాలకు అతీతంగా పని చేశాను. ప్రజల కోసం కష్టపడటం, ప్రజాహితమే నాకు తెలుసు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. నా ప్రతి ఆలోచన, తపనంతా ప్రజల కోసమే. ఎన్నో విజయాలు చూశాను…సంక్షోభాలు చూశాను. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నాం. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పేదల జీవితాలు మార్చడానికి నిత్యం పని చేసి మన నిజాయితీని ప్రజలకు తెలియజేద్దాం. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. వైసీపీ పాలనలో దెబ్బతినని వర్గమంటూ లేదు. పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. విదేశాల్లో ఉన్నవారు లక్షల ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ఓటర్లు బాధ్యతగా నిర్వర్తించిన ప్రవర్తన తెలుగుజాతి చరిత్రలో నిలిచిపోతుంది. ఏ అహంకారంతో పాలకులు విర్రవీగారో అది పూర్తిగా అనిగిపోయింది. పదవుల్లో ఉన్నామని విర్రవీగితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇవన్నీ కేస్‌ స్టడీగా మీరు తీసుకోవాలి. ప్రజలు.. బూతులు మాట్లాడిన నేతలు, అరాచక శక్తులు, అవినీతి పరుల్ని చూశారు. పాలకులు అంటే ఎలా ఉండాలో చూశారు…పాలకుడికి ఎలాంటి అర్హత ఉండాలో కూడా ఈ తీర్పు ఒక సూచికం. జగన్‌ ప్రవర్తన చూశాక ఇలాంటి వ్యక్తి పాలనకు పనికి రాడని ప్రజలు నిర్ణయించుకుని తీర్పునిచ్చారు. పాలన ఎలా ఉండకూడదో..గత పాలన ఒక నిదర్శనమని చంద్రబాబు వివరించారు.

గౌరవసభగా శాసనసభను నడుపుదాం
కక్ష తీర్చుకోవాలని ముందకెళ్తే సమస్యలే వస్తాయి. అలాగని తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలేస్తే మళ్లీ అదే దారికి వస్తారు. చట్ట పరంగా శిక్షించడంతో పాటు విధ్వంసం, కక్ష రాజకీయాలు చేయకుండా సరైన దారిన పెట్టాలి. కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టి వేధించారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం కాపాడుకున్నాం. నడి వీధుల్లో ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తించారు. మెడపై కత్తి ఉన్నా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన ఘటన నా కళ్ల ముందు ఇప్పటికీ తిరుగుతోంది. నాకు కూడా అసెంబ్లీలో అవమానం జరిగింది…దాన్ని భరించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చాను. అసెంబ్లీని గౌరవ సభగా మార్చుతానని చెప్పాను. మనం శాసనసభను గౌరవ సభగా మార్చి ప్రజా సమస్యలు పరిస్కరించేందుకు వేదికగా మార్చుకుందాం.’’ అని చంద్రబాబు అన్నారు.

నిర్మాణాత్మక రాజకీయాలు చేద్దాం
రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలీదు…ఎక్కడ నుండి తెచ్చారో తెలీదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయింది. వ్యవసాయం రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి నిర్మించిన ప్రజావేదికను కూల్చి దుర్మార్గంగా వ్యవహరించారు. కక్ష పూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజయాలు పాటిద్దాం. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు ఢల్లీి వెళ్లాను. పోలవరం ముంపు మండలాలు 7 తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాల్లో పునరావాసానికి ఒప్పుకుంటేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాను. మొదటి కేబినెట్‌ సమావేశంలోనే 7 మండలాలు ఏపీలో కలుపుతూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సహకారంతో పోలవరంలో 72 శాతం పనులు పూర్తి చేస్తే.. నేడు మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. మళ్లీ కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానంతో చేసి ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags: ఎన్డీఏ నేతలుఘనవిజయంచంద్రబాబు ప్రమాణస్వీకారంజగన్‌ కుట్ర రాజకీయాలుటీడీపీ ఘనవిజయంప్రధాని మోదీ
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 11-06-2024

Next Post

అమరావతే రాజధాని…ఆర్థిక రాజధానిగా విశాఖ

Next Post
అమరావతే రాజధాని…ఆర్థిక రాజధానిగా విశాఖ

అమరావతే రాజధాని...ఆర్థిక రాజధానిగా విశాఖ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.