- శాసనసభ చర్చలకు రాకపోవడం ప్రజలిచ్చిన అధికారాన్ని అవమానించినట్టే
- 151 నుంచి 11కి పడిపోవడమే వైసీపీ పాలనకు ప్రజల ఇచ్చిన తీర్పు
- 22(ఎ)ను ఆయుధంగా మార్చి రైతులను ఇబ్బంది పెట్టింది
- ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు
‘అసెంబ్లీలో చర్చించడానికి బదులు అరాచక ప్రవర్తనకు అలవాటుపడ్డారు వాళ్లు… చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలిచ్చిన అధికారా న్ని అవమానించినట్లే… శాసన వ్యవస్థను గౌరవించ దం, సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం, రాష్ట్ర అభివృద్ధిపై జరిగే చర్చల్లో పాల్గొనడం, చట్టా ల రూపకల్పనలో సలహాలు, సూచనలు ఇవ్వడం.. ఇవన్నీ ఒక శాసనసభ్యుడికి ఉన్న ప్రాథమిక బాధ్య తలు. కానీ వైసీపీ శాసనసభా పక్షం గత నాలుగు సమావేశాలకు డుమ్మా కొట్టడం ద్వారా ఆ బాధ్యత లను పూర్తిగావిస్మరించింది. 16వ శాసనసభ ఐదవ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, శాసన సభ సభ్యుల విధులు, బాధ్యతలు గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం’ అన్నారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘గవర్నర్ ప్రసంగం రోజున మొక్కుబడిగా రావ డం, పేపర్లు చించేయడం,విసిరికొట్టడం, సభ నుంచి వెళ్లిపోవడం… ఇదే వైసీపీ శాసనసభ్యుల తీరు. వేలాదిమంది ఆశలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనిఇదేనా అని వైసీపీ ఎమ్మెల్యేలను, శాసనసభా పక్షనాయకుడు జగన్మోహన్రెడ్డిని ప్రశ్ని స్తున్నాం… 19నెలలుగా చట్టసభ సభ్యులుగా మీ ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించారా? చేయకపోతే శాసనసభ సభ్యులుగా కొనసాగేందుకు మీకు నైతిక అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ సమస్యలపై నోరు మెదపని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ఏనాడూ సభలో ప్రస్తావించని వారు, చట్టాల రూపకల్పనపై ఒక్కసారి కూడా నిర్మాణాత్మక చర్చ వేయని వారు శాసనసభసభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికమో వైసీపీ నేతలు ఆలోచించాలి. శాసనసభ పట్ల గౌర వం ఉంటే, శాసనవ్యవస్థపై నమ్మకం ఉంటే కనీసం ఇప్పుడైనా సభకు వచ్చి చర్చల్లో పాల్గొనాలన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వేదిక సిద్ధంగా ఉంది
చంద్రబాబునాయుడు నాయకత్వంలో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చించడానికి, ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడా నికి సిద్ధంగా ఉంది. సహేతుకమైన విమర్శలు, నిర్మాణాత్మక ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పేం దుకు ప్రభుత్వం వెనుకాడదు. కానీ సభకు రాకుం డా సంతకాలు పెట్టివెళ్లిపోవడం, శాసనసభను అవ మానించడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు.
ప్రజలు ఎందుకు 151 నుంచి 11కి పరిమితం చేశారు?
ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన, విధ్వంసకర విధానాలు, వ్యవస్థల భ్రష్టుపట్టింపు, రాష్ట్ర అభివృద్ధి నాశనంచేశారు.. ఇవన్నీ చూసిన ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచి కూటమికి 164 సీట్లు ఇచ్చారు. 151 నుంచి 11కి పడిపోయిన వైసీపీ ఇప్పటికైనా తన ఘోర పరాజ యానికి కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
బడ్జెట్ సమావేశాలకు దూరం- ప్రజా హక్కులను కాలదన్నడమే
బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. శాఖల కేటాయింపులపై నచ్చకపోతే కట్ మోషన్లు పెట్టే అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తే మహత్తరమైన అవకాశం ఉంటుం ది. కానీ ఈ అవకాశాలన్నింటినీ కాలదన్నుకుంటూ, నిరంకుశ ఆలోచనలతో సభకు రాకుండా ఉండ టం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది..
భూవివాదాల రాజకీయం- 22 (ఎ)ను ఆయుధంగా వాడిన వైసీపీ
వైసీపీ పాలనలో భూ వివాదాలు విపరీతంగా పెరిగాయి. నచ్చితే ఫ్రీ హోల్డ్, నచ్చకపోతే 22 (ఎ)…ఇదే వైసీపీ విధానం. తాడేపల్లి, ఉండవల్లిలో స్వయానా జగన్ తన హెలిప్యాడ్ కోసం ఒక రైతు కు చెందిన 10 ఎకరాల భూమిని 22 (ఎ)లో చేర్చి ఇబ్బంది పెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపో లేదు. ఐదేళ్లలో 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 5.74లక్షల ఎకరాల్లో అవకత వకలు జరిగాయని, 8,462 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ శాఖ తేల్చింది.
భయంతోనే సభకు రాకుండా వైసీపీ నాయకులు
భూములను వివాదాస్పదం చేసి, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించి, అవినీతిమయమైన పాలన సాగించిన కారణంగానే జగన్మోహన్రెడ్డి శాసనసభలో మాట్లాడేందుకు భయపడుతున్నారు. అందుకే సభకు ముఖం చాటేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, అవమానం. శాసన వ్యవస్థకు తీవ్ర
శాసనసభ హుందాతనం కాపాడాలి
ఇప్పటికే 19నెలలు గడిచాయి. 16వ శాసనసభఐదవ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు బుద్ధి మార్చుకుని శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. చట్టాల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. శాసనసభ హుందాతనాన్ని పెంచే విధంగా వ్యవప రించాలి. బుధవారం జరిగే శాసనసభ సమావేశా ల్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులందరూ పాల్గొనాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.













