- కష్టపడ్డ వారికి గుర్తింపు తెలుగుదేశం సిద్ధాంతం
- మీ పనితీరే ఇక్కడి వరకు రావడానికి కారణం
- ‘మై టీడీపీ యాప్’ టాప్ పెర్ఫార్మర్స్కు లోకేష్ కితాబు
- పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం
- ఉత్తమ కార్యకర్తలకు ఘనంగా సత్కారం
మంగళగిరి(చైతన్యరథం): కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మై టీడీపీ యాప’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 పెర్ఫార్మర్స్‌తో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యా యంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడ వరకు రాగలిగారు. రేపు పార్టీ అధినేత చంద్రబాబు పక్కన కూర్చొనే అవకాశం వస్తుంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమా లను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా..కార్యకర్తే అధినేత. గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్చార్జ్ పొలిట్‌బ్యూరో వరకు రాగలగాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ సిద్ధాంతాలను వివరిం చేందుకు 365 రోజులూ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. 2019-24 మధ్య జగన్‌రెడ్డి ఎమ్మెల్యేలనే కలవలేదు. మనం కార్యకర్తలను కలుస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. వారానికోరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నాం. పార్టీ కోసం ప్రాణాలర్పిం చిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కోసం చట్ట సవరణ చేశాం. మీరందరూ క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ పిలుపు నిచ్చిన కార్యక్రమాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరినీ ఘనంగా సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. పార్టీ కార్యాలయంలో లోకేష్‌తో ఆత్మీయ భేటీపై ‘మై టీడీపీ యాప’ ఉత్తమ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీని తాము జీవితాంతం మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.













