- కొత్త ప్రతిపాదనతో జగన్‌రెడ్డి కామెడీ పీస్‌గా మారారు
- అమరావతిపై కడుపుమంటతోనే కొత్త నాటకం
- ఆయన నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో ప్రభుత్వం లేదు
- బిల్లు, తీర్మానం వ్యత్యాసం భజన బృందానికి తెలియదా
- సీఆర్డీఏ మ్యాప్ చూస్తే బాబు విజన్ అర్థమవుతుంది
- 2015లోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి
- సీఆర్డీఏ ద్వారా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాం
- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
మంగళగిరి(చైతన్యరథం): ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అభివృద్ధికి 2015లో 11 సంవత్సరాల క్రితమే సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. 2015 సెప్టెంబర్ 22వ తేదీన జీవో నెం.207 ద్వారా సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) రూపకల్పన చేసి ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు బీజం వేశారని పేర్కొన్నారు. ఏపీ సీఆర్డీఏ పరిధి మ్యాప్ చూస్తే.. జగన్‌రెడ్డికి చంద్రబాబు విజన్ ఏమిటో అర్థమవు తుందని హితవుపలికారు. ఆయన దగ్గర అభివృద్ధి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్‌రెడ్డికి నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆనాడే ప్రణాళికలు
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత అన్ని ప్రాంతాల అభివృద్ధికి అప్పుడే చంద్రబాబు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం తోనే అమరావతి రాజధానిగా ప్రతిపాదించాం. 2015లోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రధాన నగరాల అభివృద్ధికి చంద్రబాబు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. “2015 సెప్టెంబర్ 22న జీవో నెం.207 ద్వారా సీఆర్డీఏ యాక్ట్ రూపొందించాం. సీఆర్డీఏ పరిధి ని మచిలీపట్నం దగ్గర ఉండే మోపిదేవి, ఘంటశాల, చల్లపల్లి నుండి మొదలుకుని పామర్రు, గుడివాడ నూజివీడు, మైలవరం, కొండపల్లి అటు జగ్గయపేట వరకు..ఇటు గుంటూరు దాటి యడ్లపాడు, ఫిరంగిపురం వరకు నిర్ధారించడం జరిగింది. ఆ విధంగా దాదాపు 8,350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మచిలీ పట్నం వద్ద గల మోపిదేవి నుంచి ఇటు గుంటూరు దాడి యడ్లపాడు వరకు సీఆర్డీఏ పరిధి ఉంది. ఇది తెలుసుకోకుండా పిచ్చి తుగ్లక్‌లా జగన్‌రెడ్డి మావిగన్ పేరు ప్రతిపాదనతో కొత్త నాటకానికి తెరలేపారు. ఏపీ సీఆర్డీఏ మ్యాప్ చూస్తే.. గౌరవ జ.మో.రెకి చంద్రబాబు విజన్ ఏమిటో తెలుస్తుందని హితవు పలికారు. సీఆర్డీఏ అంటే అమరావతి రాజధాని నగరం మాత్రమే కాదు. దాని బయట ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి వంటి ఆరు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలతో కూడిన కోర్ రీజియన్ (్పుశీతీవ =వస్త్రఱశీఅ) మరియు ఉయ్యూరు, నూజివీడు, పొన్నూరు వంటి మరొక ఆరు మున్సిపాలిటీలతో కూడిన ఎక్స్ టెండెడ్ రీజియన్..అంతేకాకుండా జగ్గయ్యపేట మున్సిపాలిటీ, రూరల్ మండలాలతో కూడిన పెరిఫెరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ వంటి జోన్లతో కూడి ఉంటుంది. ఆ విధంగా సీఆర్డీఏ కేవలం అమరావతి రాజధాని అభివృద్ధి కోసమే కాకుండా దాని వెలుపల ఉన్న అనేక ప్రాంతాల అభివృద్ధికి దోహద పడుతుందని స్పష్టం చేశారు.
సీఆర్డీఏను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు చేశారు?
“మావిగన్ ప్రతిపాదనపై నేడు అంత ప్రేమ ఒలకబోస్తున్న జగన్.. దాదాపు అంతే పరిధితో ఉన్న ఏపీ సీఆర్డీఏ 2020లో ఏపీ సీఆర్డీఏ యాక్ట్‌ను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ప్రాంత అభివృద్ధి. అప్పుడు గుర్తుకు రాలేదా ఈ గ్రోత్ కారిడర్. దీనిపై జగన్ మరియు ఆయన భజన బృందం సమాధానం చెప్పాలి. ఆనాడు హైకోర్టు మొట్టికాయలు వేయడం తోనే కదా మూడు రాజధానుల అంశంపై జగన్ వెనక్కి తగ్గి సీఆర్డీఏ రద్దు విరమించుకున్నాడు. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో.. నేడు అమరావతి రాజధాని చుట్టూ సీఆర్డీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో అమరావతి రాజధానితో పాటు సీఆర్డీఏ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ను సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. “ఏపీ ఛీఫ్ జాబ్ క్రియే టర” నారా లోకేష్ కృషితో ఉత్తరాంధ్రకు ఆర్సెలాల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, వంటి అనేక ఐటీ కంపెనీలు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. రాయ లసీమ ప్రాంతాన్ని రెన్యూబుల్ ఎనార్జీ, ఆటో మొబైల్ తదితర రంగాల్లో అభివృద్ధి పరుస్తూ మరియు ఉద్యానవన హబ్‌గా తీర్చి దిద్దడానికి అడుగులు ముందుకుపడుతున్నాయి. కర్నూలులో అతి త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుంది. నిజమైన రాయల సీమ బిడ్డగా రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తు న్నారని తెలిపారు.
బిల్లుకు, తీర్మానానికి వ్యత్యాసం తెలియదా?
“తీర్మానం అనేది కేవలం ఒక అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికే మాత్రమే.. కానీ బిల్లు అనేది చట్టాలకు రూపొందించడానికి అనేది గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రాజధాని విషయంగా అసెంబ్లీలో చేసింది తీర్మానం మాత్రమే..అది బిల్లు కాదని తెలిపారు. ఒక తీర్మానం పంపడానికి ఉభయ సభలను సమావేశపరచాల్సిన అవసరం లేదని.. కేవలం చట్టాలు రూపొందించడానికి బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే ఉభయసభలు ఏర్పాటు చేసి వాటి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అందువల్లే మన అసెంబ్లీలో అమరావతి రాజధాని తీర్మానం చేసి పంపగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ చట్ట సవరణ చేసి లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదించడం జరిగింది. బిల్లుకు, తీర్మానానికి మధ్య వ్యత్యాసం ప్రజలు గ్రహిం చాలని సూచించారు. అసెంబ్లీలో చేసింది తీర్మానమని చెప్పారు. బిల్లుకు, తీర్మానానికి వ్యత్యాసం తెలియని జగన్.. ఆయన భజన బృందం ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బిల్లు చట్ట రూపం దాల్చే సమయంలో రాష్ట్రాలలో కానీ, కేంద్రంలో కానీ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని, ఉభయ సభలు ఆమోదిస్తేనే అది చట్టం అవుతుందని వివరించారు. మనం ఇక్కడ శాసనసభలో చేసింది తీర్మానం మాత్రమే.. అది కూడా కేంద్రం సలహాపై ఆ తీర్మానం చేసినట్లు తెలిపారు. అమ రావతి చట్టబద్దంగా రాజధాని కావడానికి కావలసిన ఆం< óŠప్రరదేశ్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్మెంట్) బిల్లు ఉభయ సభలు లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారని తెలిపారు. ఉభయసభ ల్లోనూ ఆ బిల్లు ఆమోదం పొందినట్లు చెప్పారు. బిల్లుకు, తీర్మానానికి మధ్య వ్యత్యాసం ప్రజలు తెలుసుకోవాలని కోరారు. మన రాష్ట్ర అసెంబ్లీలో చేసింది తీర్మానం మాత్రమే అని చెప్పారు.
మావిగన్ ప్రతిపాదనతో కామెడీ పీస్‌గా మారారు
“మావిగన్ పేరు ప్రతిపాదనతో జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారు. రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్‌కు నవ్వులాటలాగా ఉంది. దేశంలోని అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధతకు అను కూలంగా ఉంటే జగన్ ఒక్కరే వ్యతిరేకంగా నిలిచారు. ఉభయ సభల్లో వైసీపీ వాకౌట్ చేయడంతో అమరావతిపై ఆ పార్టీ వైఖరి ఏంటో స్పష్టంగా అర్ధమైంది. అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. రాజధానిలో అభివద్ధి వేగం పుంజు కుని అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తాడేపల్లి ప్యాలెస్‌లో గోడలు బద్దలు అవుతాయి. అమరావతిపై కడుపు మంటతోనే జగన్ వెటకారంగా మావిగన్ పేరు ప్రతిపాదన తెచ్చారని పట్టాభిరామ్ మండిపడ్డారు. తాము వస్తే ఆ బిల్లు మరలా రద్దు చేస్తామని అంటున్న జగన్.. పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వా లు రద్దు చేయలేవనే ఇంగిత జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. అమరావతి అన్‌స్టాప్‌బుల్.. ఇకపై ప్రతీనెలా అమరావతిపై సమీక్షలు జరిపి అమరావతి పనులు పరుగులు పెట్టిస్తానని సమీక్షలో సీఎం వివరించారు. అతి త్వరలోనే ప్రపంచస్థాయి రాజధాని మన అమరావతి నిలుస్తుందని చెప్పడం రాష్ట్ర ప్రజలకు మరింత ఆనంద కలిగించిందని వ్యాఖ్యానించారు.

















