- జీవ వైవిధ్యం- ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం థీమ్ తో క్యాలెండర్
- పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పయ్యావుల
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆవిష్కరించా రు. సీఎం క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి సీఎం వాల్ కేలెండర్, టేబుల్ కేలెండర్, డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, శాసన పరిషత్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.
జీవ వైవిధ్యం-ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం థీమ్తో కేలండర్
జీవవైవిధ్యం- ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం థీమ్తో క్యాలెండర్ రూపొందించారు. తూర్పు కనుమలు, విశాలమైన గడ్డి మైదానాలు, కోరింగా మడ అడవులు, సుదీర్ఘ బంగాళాఖాత తీరప్రాంతం… ఇలా ఆంధ్రప్రదేశ్లోని విభిన్న ఆవరణ వ్యవస్థలకు చెందిన పన్నెండు వన్యప్రాణుల చిత్రాలతో కేలెండర్ తయారు చేశారు. ప్రకృతి వారసత్వం, కళా సంప్రదాయం, ఆధునికతలను మేళవించారు.
సాంప్రదాయ కలంకారీ శైలిలో అత్యంత సుందరంగా చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ చిత్రాలు రూపొందించేందుకు ఏఐని విని యోగించామని ప్రసన్నకుమార్ వివరించా రు. 2026 సంవత్సర క్యాలెండర్ను చక్కగా డిజైన్ చేశారని సీఎం అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందే
శంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ గురించి క్యాలెండర్ గొప్ప సందేశాన్ని ఇస్తోందని, అలాగే వాతావరణ మార్పుతో కలిగే పరిణామాలనూ వివరి
స్తోందని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మన సమిష్టి బాధ్యతను క్యాలెండర్ గుర్తు చేస్తోందన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఉండటం సంతోషించా ల్సిన విషయమని తెలిపారు. స్పీకర్ మాట్లాడుతూ… పర్యావరణం,
వన్యప్రాణుల సంరక్షణపట్ల శాసనసభకు ఉన్న నిబద్ధత, వన్యప్రాణులు, ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకతపై సమాజాన్ని చైతన్యపరిచేందుకు ప్రజాప్రతినిధుల సభ చేస్తున్న ప్రయత్నంగా 2026
క్యాలెండర్ను రూపొందించినట్టు స్పీకర్ తెలిపారు.














