చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాళ్ల సీమను రతనాల సీమగా చేస్తా

మడకశిర పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
August 2, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
రాళ్ల సీమను రతనాల సీమగా చేస్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అనంతపురంను అగ్రభాగాన నిలబెడతా
  • మళ్లీ బిందు సేద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం
  • రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తాం
  • మడకశిరలో ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం
  • ఆదాయాన్ని పెంచుతాం…పేదలకు పంచుతాం
  • గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది
  • దొంగలను నమ్మి మోసపోవద్దు..జాగ్రత్తగా ఉండాలి
  • వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు శుభపరిణామం
  • ఎవరూ నష్టపోకుండా అందరికీ సామాజిక న్యాయం
  • మడకశిర పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు

మడకశిర(చైతన్యరథం): అసమర్థత, అవినీతితో వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. సీమ రైతులకు కనీసం డ్రిప్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదని, సాక్షి మీడియాకు మాత్రం ప్రకటనల రూపంలో రూ.403 కోట్లు దోచిపెట్టారని, ఇది ఎవరి సొమ్మని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై నిధులు ఖర్చు చేయకుండా సర్వే రాళ్లపై తన బొమ్మలకు జగన్‌ రూ.700 కోట్లు తగలేశారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఆదాయం నిల్‌… అప్పులు మాత్రం ఫుల్‌ అని అన్నారు. ఐదేళ్లలో రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పులకు వడ్డీ రూపంలో ప్రతి ఏటా రూ.72 వేల కోట్లు చెల్లించాల్సి ఉంద న్నారు. రానున్న ఐదేళ్లలో కష్టపడి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు.

సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రామన్న, ఓబుళమ్మ అనే వృద్ధులకు వారి ఇళ్లకెళ్లి స్వయంగా పింఛను డబ్బు అందజేశా రు. అనంతరం రంగనాథ్‌ అనే రైతుకు చెందిన మల్బరీ పంటను పరిశీలించి షెడ్డులో పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించారు. గ్రామాన్ని కలియ తిరిగి ప్రజలను ఆప్యా యంగా పలకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మొదటగా ఎన్నరూ చెన్నాగిదురా అని కన్నడలో పలకరించారు.

ఈ పేదల ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ తనంతో ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం చేసినా మీ అందరికీ చెప్పే చేస్తుంది. చరిత్రలో మొదటిసారి ఒకేరోజున 97 శాతం పింఛన్లు పంపిణీ చేశాం. గత నెల రూ.4,408 కోట్లు, ఈనెల రూ.2,730 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశాం. ఏడాదికి రూ.33,500 కోట్లు పింఛన్లకు ఖర్చు చేయ బోతున్నాం. ఈ గుండుమల గ్రామంలోనే 398 మందికి రూ.16.82 లక్షలు ఇస్తు న్నామంటే అదీ పేదలపై మా ప్రభుత్వానికి ఉన్న ప్రేమ. ఈ ప్రభుత్వం పేదల ప్రభు త్వం..మీకు అండగా ఉంటుంది.

గత పాలకులు విలాసాలకు అలవాటు పడ్డారు
పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లు మీరు చూశారు. పాలన ఎలా ఉండాలో కూటమి ప్రభుత్వం చూపిస్తుంది. గడిచిన ఐదేళ్లలో చరిత్రలో చూడని నష్టాన్ని చూశాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో బంగారం లాంటి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు. ఆదాయం నిల్‌…అప్పులు మాత్రం ఫుల్‌గా ఉన్నాయి. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు కానీ రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ కట్టుకున్నారు. మేము పాలకులం కాదు..సేవకులం. నియంతలు కూడా చేయ నన్ని దుర్మార్గపు పనులు గత పాలకులు చేశారు. దొరికింది దోచుకున్నారు. ఇప్పటికే ఏడు శ్వేత పత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వ అక్రమాలు, తప్పిదాలు మీ కళ్ల ముందు పెట్టాను.

రతనాల సీమ చేసే బాధ్యత మాది
ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కరవు జిల్లా. నీళ్లు లేక కరవుతో అల్లాడు తుంటే పశువుల కోసం ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేశాం. నీళ్లిస్తే బంగారం పండిరచే రైతాంగం ఉమ్మడి అనంత జిల్లాలో ఉంది. నిర్లక్ష్యంతో రాయలసీమను రాళ్ల సీమ చేశారు. ఆ రాళ్ల సీమను మళ్లీ రతనాల సీమ చేసే బాధ్యత మాది. భగవంతుడు ఇక్కడ మంచి వాతావరణం ఇచ్చారు. పట్టు పరిశ్రమ బాగా ఉంది. నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. వరుణ దేవుడు కూడా కరుణిస్తున్నారు. మేము చెప్పేవి విన్నాక మీ ఇంట్లో చర్చించండి…వాటిని అనుసరిస్తే మీ జీవితాలు మారడానికి అవకా శం ఉంటుంది.

సీమ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం
‘‘2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? అని ప్రశ్నించారు. ఈ జిల్లాకు నీరిస్తే అన్ని ప్రాంతాలకంటే అగ్రస్థానంలో ఉంటుంది. ఉదయమే శ్రీశైలం వెళ్లి మల్లన్ను దర్శించు కుని కృష్ణమ్మకు హారతి ఇచ్చాను. 20 ఏళ్లలో ఎప్పుడూ జూలైలో శ్రీశైలం నిండలేదు… కానీ ఈ ఏడాది నిండిరది. అనంత జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. పండ్లు, మల్బరీ, వక్క తోటలను ప్రోత్సహిస్తాం. గిట్టబాటు ధర అందిస్తాం. మళ్లీ బిందు సేద్యాన్ని అందు బాటులోకి తీసుకొస్తాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరవు రాదు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. హంద్రీనీవా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్ల నిర్మాణం
‘‘హంద్రీనీవాలో భాగంగా మడకశిర నియోజకవర్గంలో రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజ ర్వాయర్లు నిర్మిస్తాం. ఈ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తే ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్‌.అనంతపురం వద్ద 1600 ఎకరాల భూమి ఉంది. అందులో ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం. ఇక్కడి వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. త్వరలోనే నైపుణ్య గణన ప్రారంభిస్తాం. యువతలో నైపుణ్యం పెంచి పని చేసే విధానా నికి శ్రీకారం చుడతాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం.

వక్క మార్కెట్‌ ఏర్పాటు చేస్తాం
వక్క రైతుల కోసం వక్క మార్కెట్‌ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మడకశిర పట్టణానికి రింగు రోడ్డును రూ.60 కోట్లతో నిర్మిస్తాం. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా నీళ్లిస్తాం. అగలి మండలంలో గాయత్రి కాలనీలో ప్రభుత్వ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. సప్తదేవత ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. మడకశిరను రెవెన్యూ డివిజన్‌ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం. పుట్టపర్తి నుంచి వచ్చే జాతీయ రహదారి 7ను 44వ జాతీయ రహదారికి అనుసంధానం చేసి పెనుకొండ, గుడిబండ, మడకశిర, అమరావపురంను హైవేతో అనుసంధానం చేస్తాం. హిరియోరికి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పేదలం దరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తాం. కొత్తగా కట్టే ఇళ్లకు రూ.4 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అందిస్తాం.

అన్ని కులాలకు న్యాయం జరగాలి
ఈ రోజే సుప్రీంకోర్టు వర్గీకరణపై తీర్పు ఇచ్చింది. 1996లోనే నేను సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణ విధానం తీసుకొచ్చా. నాడు తీసుకున్న నిర్ణయం సబబేన ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మేము సామాజిక న్యాయం కోసం ముందుకు వెళ్లాం. అన్ని కులాలు, అన్ని మతాలకు న్యాయం జరగాలి. ప్రధాని మోదీ కూడా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపారు…ఇది శుభపరిణామం. ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా ఏబీసీడీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేస్తాం.

సంపద సృష్టించి పేదలకే పంచుతాం
మన భవిష్యత్‌ మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నీరు సంపద సృష్టిస్తుంది…ఆ సంపద ఆదాయాన్ని పెంచుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తే పేదలకు పింఛన్లు, పిల్లలను బాగా చదివించవచ్చు. అప్పులు తెస్తే అప్పుల్లోనే కూరుకుపోతాం. పేదలందరికీ పింఛన్లు, సంక్షేమాలు అందిస్తేనో సమస్య పరిష్కారం కాదు. శాశ్వతంగా పేదరికం పోతే న్యాయం జరుగుతుంది. సంపద సృష్టించి ప్రపంచంలో అగ్రభాగాన ఉంచుతాం.

అనంతపురంను అగ్రభాగాన నిలబెడతా
రైతులను ఆదుకుంటాం. సోలార్‌ ప్రాజెక్టుకు కూడా ముందుకు వస్తే ఏర్పాటు చేస్తాం. మన ఊరిలోనే కరెంట్‌ ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ ఇల్లు, పొలాలకు ఇక్కడి నుండే విద్యుత్‌ ఇవ్వొచ్చు. దొంగలను నమ్మి మోసపోవద్దు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం. పేదవాడికి రూ.5లకే అన్నం పెడతాం. కష్టపడతాం …సంపాదిస్తాం…ఆదాయం పెంచు తాం…పేదలకు ఆదాయాన్ని పంచడం నిరంతరం కొనసాగుతుంది. నా సంకల్పం… పేదరికం లేని దేశం..పేదరికం లేని రాష్ట్రం…పేదరికం లేని గ్రామం. నా సంకల్పానికి మీరంతా అండగా ఉండాలి. ఎం.ఎస్‌.రాజు పోరాట యోధుడు. మడకశిరకు ఏం కావాలో అది చేస్తాం. అనంతపురం జిల్లాను అగ్రభాగాన పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags: మడకశిర పర్యటనరత్నగిరి రిజర్వాయర్లురాళ్లపల్లి
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2024

Next Post

పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

Next Post
పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.