చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బిగ్‌బాస్‌ కుటుంబం కటకటాల్లోకే..

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

by చైతన్యరధం
Apr 27, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అక్రమ కేసులతో జగన్‌ క్షుద్ర రాజకీయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లిక్కర్‌ స్కామ్‌ లోకల్‌ కాదు..ఇంటర్నేషనల్‌
  • అధికారిక సేల్‌ తగ్గించి వేల కోట్లు దోచారు
  • రూ.10 వేల కోట్లకు పైనే కుంభకోణం
  • నాసిరకం మద్యంతో ప్రాణాలు తీశారు
  • ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలి
  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

మంగళగిరి(చైతన్యరథం): లిక్కర్‌ స్కామ్‌ లోకల్‌ కాదు..ఇంటర్నేషనల్‌ అని, కమీ షన్ల రూపంలో వేల కోట్లు దోచేయడంతో పాటు అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న వారిపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యా లయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్కామ్‌ టోటల్‌ లోటస్‌ పాండ్‌లోనే జరిగింది..లిక్కర్‌ స్కామ్‌ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదు.. రూ.10 వేల కోట్లకు పైనే జరిగిందని ఆరోపించారు. అధికారిక సేల్‌ తగ్గించి అక్రమం గా అమ్మేసి వేల కోట్లు దోచేశారని పేర్కొన్నారు. ఆ మద్యంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని ప్రఖ్యాత ఎస్‌జీఎస్‌ ల్యాబ్‌ ఎప్పుడో చెప్పినా కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచేయడంతో పాటు అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారని ధ్వజమెత్తారు. కారకు లైన వారిపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. దురాశతో ప్రజల ప్రాణాల ను పణంగా పెట్టి అంతిమ లబ్ధిపొందిన బిగ్‌బాస్‌ కుటుంబం కటకటాలు లెక్కపెట్టాల్సిం దేనని స్పష్టం చేశారు. రూ.100 కోట్ల స్కామ్‌కే ఢల్లీిలో సీఎం, డిప్యూటీ సీఎం, నాలుగు రాష్ట్రాల ప్రముఖులు జైలుకెళ్లారు..రూ.10 వేల కోట్ల కుంభకోణంలో ఎంతమంది వెళ్లాలో అర్థం చేసుకోవాలన్నారు. రూ.60 కోట్ల బోఫోర్స్‌ కుంభకోణంతో రాజీవ్‌ గాంధీ రాజకీయ పతనం ప్రారంభమైతే 2జీ స్కామ్‌తో మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి తెచ్చుకుందని వ్యాఖ్యానించారు.

రూ.1.30 లక్షల కోట్ల లావాదేవీలు
వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్‌ స్థాయిలో లిక్కర్‌ స్కామ్‌ జరిగింది రూ.1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూశామా? అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్‌ పేమెంట్లను అనుమతించలేదు. ఓ వైపు ప్రధానమంత్రి మోదీ డిజిటల్‌ ఇండియా అంటుంటే..జగన్‌రెడ్డి మాత్రం క్యాష్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. ప్రస్తుతం విచారణ సాగిస్తున్న సిట్‌ మరింత లోతుగా వెళ్లాల్సి న అవసరం ఉంది. రూ.3200 కోట్ల కుంభకోణం అంటున్నారు…అనధికారిక అమ్మకా లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వేల కోట్ల అక్రమాలు, మనీ లాండరింగ్‌ జరిగితే ఈడీ, సీబీఐ ఎందుకు రంగంలో దిగడం లేదు. రూ.1.30 లక్షల కోట్ల క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదు. 1989లో రూ.60 కోట్ల విలువైన బోఫోర్స్‌ కుంభకోణం రాజీవ్‌ గాంధీ కుంపముంచింది. 2014లో 2జీ స్కాం మన్మోహన్‌ సింగ్‌ను దెబ్బకొట్టింది.ఈ రెండు స్కాములు కాంగ్రెస్‌ పార్టీకి జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి తెచ్చాయని గుర్తుచేశారు. ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌ ఆషామాషీ కేసు కాదు. కరోనా సమయంలో 2020 మార్చి 23న లాక్‌ డౌన్‌ విధించారు. మే 4న మద్యం దుకాణాలను రీ ఓపెనింగ్‌ చేశారు..ఆ 42 రోజులు మాత్రమే మద్యం విక్రయాలు ఆగాయి. కానీ లక్షల కోట్ల మద్యం విక్రయాలు తగ్గిపోయి నట్లు లెక్క చూపారు. జగన్‌రెడ్డి పర్యవేక్షణలో నడిచిన కసిరెడ్డి అండ్‌ టీం ఎక్సైజ్‌ డిపార్టు మెంటులోని మద్యం డిపోలకు వెళ్లకుండా, స్కానింగ్‌ కాకుండా డిస్టలరీల నుంచి నేరుగా దుకాణాలకు స్టాక్‌ తరలించి అక్రమంగా అమ్మేసుకున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

రూ.10 వేల కోట్లకు పైనే కుంభకోణం
రూ.3200 కోట్ల కుంభకోణం అంటున్నారు…అనధికారిక అమ్మకాలను పరిగణన లోకి తీసుకోవడం లేదు. రూ.10 వేల కోట్ల పైనే కుంభకోణం జరిగింది. ఎస్పీవై ఇండస్ట్రీ మిథున్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయిందని సజ్జల శ్రీధర్‌రెడ్డి నాకు అప్పుడే చెప్పారు. మాగుం ట శ్రీనివాసులురెడ్డి కుటుంబానికి చెందిన మెక్‌డోల్‌ డిస్టలరీ మూసుకు నే పరిస్థితి వచ్చింది. అడిగినంత కమీషన్లు ఇవ్వలేదని నేషనల్‌, ఇంటర్నేషనల్‌ బ్రాండ్ల డిస్టలరీలను అడ్డంగా మూసేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిల్స్‌ తీసుకునే వెసులు బాటును కూడా తొక్కేశారు. తామిచ్చిన మద్యమే తాగాలని నియంతలా వ్యవహరించారు.. జగన్‌రెడ్డి అండ్‌ బ్యాచ్‌కు డబ్బుపై ఉన్న వ్యామోహంతోనే ఇది జరిగింది. ఐఎస్‌ఐ గుర్తిం పు పొందిన చెన్నైలోని ప్రముఖ ఎస్‌జీఎస్‌ లేబోరేటరీ సంచలన విషయాలు వెల్లడిరచిం ది. వైసీపీ ప్రత్యేకంగా ప్రోత్సహించిన ఆంధ్రా గోల్డ్‌, 9సీ హార్సెస్‌, సిల్వర్‌ స్ట్రైప్‌ విస్కీలలో ప్రమాదకరమైన పైరోగలాల్‌, ఐసోపులరిక్‌ యాసిడ్‌, డై ఇథనాల్‌ టాలెట్‌ ఉన్నాయని తేల్చింది. ఇవి తాగితే శరీరంలోని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పో తారని స్పష్టం గా నివేదిక ఇచ్చారు. అప్పట్లో నేను మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి మద్యం విక్రయాల్లో భారీ స్కామ్‌ జరుగుతోందని చెప్పాను. కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం మా మాటలు పట్టించుకోలేదు. తమకు డబ్బుంటే చాలనే లెక్కలో ముందుకెళ్లారు. అసలు మనుషుల ప్రాణాలు తీసే హక్కు వీళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే ప్రపంచమంతా చలించిపోతోంది. ఏపీలో కల్తీ మద్యం తాగి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది మంచాన పడ్డారు. నెల్లూరు పొగతోట హాస్పిటళ్లకు కేంద్రం. ఆ ప్రాంతంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ అనేక మంది ప్రాణాలు విడిచారు. చీప్‌ లిక్కర్‌ తాగి లివర్‌ దెబ్బతిని అనేక మంది చనిపోతున్నారని వైద్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఓట్లతో సీఎంగా ఎన్నికైన వ్యక్తి వారి జేబుల్లోని డబ్బును లాక్కోవడమే గాక వారి ప్రాణాల ను తీసేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

వేలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారు
ఢల్లీిలో రూ.100 కోట్ల ఆరోపణలకు సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన ప్రముఖులను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఏపీలో రూ.10 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. ఇక్కడ రెండు రకాలుగా విచారణ జరగాల్సి ఉంది..అది సిట్‌ లెవల్‌లోనే తేలిపోతుందా..లేక ఈడీ, సీబీఐ ఎంటరవుతాయో చూడాలి. కమీషన్లతో వేల కోట్లు దోచుకోవడంతో పాటు అనధికారిక సేల్స్‌ ఒకటైతే, నాసిరకమైన మందు ఇచ్చి ప్రజలు ప్రాణాలను తీసుకోవడం రెండో నేరం. ఆవేశంలో కత్తి, రాయో తగిలి ప్రాణాలు ఒక మనిషి కోల్పోతే నిందితుడిపై హత్య కేసు బనాయించి జీవితఖైదు విధి స్తారు. ఇక్కడ నాసిరకం మద్యం పోసి వేలాది మంది ప్రాణాలు బలితీసుకున్న వారికి ఎలాంటి శిక్ష వేస్తారు. ఈ లిక్కర్‌ స్కామ్‌తో తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధం లేదు..టోటల్‌ లోటస్‌ పాండ్‌. కసిరెడ్డి అండ్‌ బ్యాచ్‌ మద్యం వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. డిస్టలరీలను తమ గుప్పెట్లో పెట్టుకుని నాసిరకమైన మద్యం తయారు చేయించింది. బ్రాండ్‌ను బట్టి క్రేట్‌(48 బాటిల్స్‌)కు రూ.150 నుంచి రూ.600 చొప్పున కమీషన్‌ వసూలు చేశారు. అనఫిషియల్‌ సేల్‌తో ఒక్కో క్రేట్‌కు రూ.10 వేల వరకు ఆర్జించారు. ఈ కేసులో ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలి.. వేల కోట్లు ఏ కుటుంబం చేతుల్లోకి వెళ్లా యి.. ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల్లోని అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది.. ఏ కుటుంబం దురాశ కారణంగా అమాయకులు మంచాలపాలయ్యారో తేలాల్సిన అవసరం ఉంది.

బిగ్‌బాస్‌ కుటుంబం కటకటాలు లెక్కపెట్టాలి
బాధితుల ఆర్తనాదాలు నేను స్వయంగా విన్నాను..వారి బాధలు ప్రత్యక్షంగా చూశాను. మనుబోలు మండలం మద్దమూడిలో భర్తలు చనిపోయి 17 మంది వితంత వులుగా మారారు. వారి గోడు వింటే గుండె తరుక్కుపోతుంది. నడిబజారులో జరిగిన ఈ స్కామ్‌ ప్రత్యక్షంగా కనిపిస్తోంది..కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈడీ, సీబీఐలను రంగంలోకి దించాలి. దురాశతో అంతిమ ప్రయోజనం పొందిన బిగ్‌బాస్‌ కుటుంబం కటకటాలు లెక్కపెట్టాలి. రూ.1000 లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని ఏసీబీ అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతుంది..వేల కోట్లు దోచేసి ప్రజల ప్రాణాలు తీసేసిన వారికి ఏ శిక్ష వేయాలి. ఇంత బహిరంగంగా జరిగిన దోపిడీ చరిత్రలో ఎక్కడా వినలేదు..చూడలేదు. క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ కరెక్ట్‌ అని, ఈ మందు తాగినందున ఎవరూ చనిపోలేదు అని వైసీపీలోని పెద్ద నాయకులు, జగన్‌రెడ్డి ఎవరైనా చెప్పగలరా. అప్పు డేమో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు దోచేశాడు.. మొన్నేమో పేదల ప్రాణాలను పణంగా పెట్టి దోపిడీ సాగించాడు. వైసీపీ పాలనలో జరిగినన్ని పాపాలు, నేరాలు, ఘోరాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ధ్వజమెత్తారు. మరోవైపు కసిరెడ్డి తనకు తెలియకుండా అదనంగా రూ.2 వేల కోట్లు ఎత్తేశాడని యలహంక ప్యాలెస్‌లో కూర్చుని జగన్‌రెడ్డి బాధపడిపోతున్నాడట అని వ్యాఖ్యానించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2025

Next Post

మేడే వేడుకల పోస్టర్‌ ఆవిష్కరణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-04-2026

కార్యకర్త
@ April 6, 2026
అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

చైతన్యరధం
@ April 6, 2026
సంస్కరణవాది జగ్జీవన్‌రామ్
ఆంధ్రప్రదేశ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది
ఆంధ్రప్రదేశ్

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..
ఆంధ్రప్రదేశ్

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు
ఆంధ్రప్రదేశ్

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

చైతన్యరధం
@ April 6, 2026
తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

తుగ్లక్ పేరు చదివాం..ఇప్పుడు చూస్తున్నాం

చైతన్యరధం
@ April 6, 2026
మిషన్ ‘సేవ్ వాటర్’
ఆంధ్రప్రదేశ్

మిషన్ ‘సేవ్ వాటర్’

చైతన్యరధం
@ April 6, 2026
Load More

ముఖ్య వార్తలు

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

జగన్‌ది విధ్వంసం…చంద్రబాబుది విజయం!

చైతన్యరధం
@ April 5, 2026
లక్ష్యాల మేరకు రాజధాని పనులు

లక్ష్యాల మేరకు రాజధాని పనులు

చైతన్యరధం
@ April 5, 2026
కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

కన్నడ సంస్కతీ సంప్రదాయం గొప్పది

చైతన్యరధం
@ April 5, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

అభివృద్ధి నిరోధక శక్తి జగన్‌రెడ్డి

చైతన్యరధం
@ April 6, 2026
సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

చైతన్యరధం
@ April 6, 2026
మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

మూడు ముక్కలాట పోయింది..మావిగన్ మొదలైంది

చైతన్యరధం
@ April 6, 2026
ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

ఏడు వాగులు దాటి..ప్రాణాలు కాపాడి..

చైతన్యరధం
@ April 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist