- కిలో కేక్ కటింగ్కు తల్వార్లు, వేటకత్తులా?
- గర్భిణిపై దాడి చేసిన వాడు మీ పార్టీ వాడు కాదా?
- ఆమె భర్త ఫిర్యాదు చేసేదాకా ఎందుకు స్పందించలేదు
- వెపన్స్ యాక్ట్ గురించి పొన్నవోలుకు తెలుసా?
- ఉన్మాది జగన్కుటా కార్యకర్తలు దూరంగా ఉండాలి
- మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
మంగళగిరి(చైతన్యరథం): వేట కత్తులతో జగన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు చేస్తూ వైసీపీ సైకోలు రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించా రు. ఎవరైనా పుట్టినరోజు వేడుకలు రక్తదానాలు లేదా సేవా కార్య క్రమాలతో నిర్వహిస్తారు.. కానీ వేట కత్తులు, తల్వార్లతో వైసీపీ సైకోలు చేస్తున్నారు. కత్తులు, తల్వార్లతో పుట్టిన రోజులేంటి? సైకో జగన్ పుట్టినరోజు నాడు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం చేశారు. ఐసీస్ ఉగ్రవాదుల మనస్థత్వం జగన్ అభిమానులకు ఉంది. నాలుగు, ఐదు అడుగుల కత్తులతో కేకులు కట్ చేయడం ఏంటి. సమాజాన్ని ఏం చేయాలని వైసీపీ సైకోలు కత్తులతో వేడు కలు నిర్వహిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ సైకోలు వ్యవహరిస్తున్నారు. మాజీ ఏఐజీ పొన్నవోలు సుధా కర్ మీడియా ముందుకొచ్చి గావు కేకలు పెడుతున్నారు. వెపన్స్ యాక్ట్ గురించి అసలు పొన్నవోలుకు తెలుసా? ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వైసీపీ సైకోలపై కేసు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కిలో కేక్ కటింగ్కు నాలుగు అడుగుల కత్తులా?
జగన్ పుట్టినరోజు వేడుకల్లా కాకుండా అల్లర్లు ప్రేరేపించేలా వైసీపీ సైకోలు వేట కత్తులు, తల్వార్లతో వీరంగం సృష్టిస్తున్నారు. ఆ రోజు అమరావతి ఉద్యమంలో మహిళలపై దాడి చేశారు. నేడు టపాసులు కాల్చవద్దని చెబితే గర్భవతి అని కూడా చూడకుండా వైసీపీ సైకో అజయ్ దాడి చేశాడు. పోలీసులు వాడికి బుద్ధి చెబితే.. వాడు మా పార్టీకి చెందినవాడు కాదని వైసీపీ అంటోంది. మరీ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. మీ పార్టీ వాడు కాకపోతే జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వాడెందుకు పాల్గొన్నా డు. ఆమె భర్త కంప్లైంట్ చేసేదాకా వైసీపీ ఎందుకు స్పందిం చలేదో సమాధానం చెప్పాలి. గొర్రెను చంపి ఆ రక్తంతో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు. దీన్ని ఎవరు ఖండించడం లేదు? వైసీపీలో ఉన్న వాళ్లంతా ఉన్మాదులు. అరాచ కాలు చేయడం.. మేం చేయలేదని చెప్పడం వైసీపీకే చెల్లింది. వివేకా హత్య కేసును చంద్రబాబుపై అభియోగం మోపావ్. జగన్రెడ్డి తాను చేసి ఇతరులపై నెట్టడం ఆయనకే చెల్లింది. ఐసీసీ మాదిరి ఉన్మాదుల్లా జగన్రెడ్డి సైకోలు వ్యవహరిస్తున్నారు. జగన్ ఏమైనా ఊరి దేవతా బలివ్వడానికి? జనాన్ని భయపెట్టాడు కాబట్టే జగన్రెడ్డికి ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హెూదా కూడా ఇవ్వ కుండా బుద్ధి చెప్పారు. ప్రజలు భయపడేలా వైసీపీ సైకోలు రూడ్లపై ఉన్మాదం చేస్తున్నారని మండిపడ్డారు.
11 సీట్లు దేవుడు రాసిన స్క్రిప్ట్
జగన్ చేసిన అవినీతికి దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం 11 సీట్లకు పరిమితం చేశారు. అమరావతిలో మహిళపై దాడి చేయిం చావ్.. నేడు గర్భిణిపై దాడి చేయించావ్, తల్లి, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వాడికి స్త్రీ విలువ ఏం తెలుస్తుంది? రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన దుర్మార్గుడు జగన్. మనుషులను చంపించ డంలో ఉన్మాది. అందుకే ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. చంద్రబాబు ఏనుగు అయితే జగన్ చిట్టెలుక. అర్ధరాత్రి ఒంటి గంటకు టాపాసులు కాల్చుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉన్మాదులు వైసీపీ సైకోలు. జగన్ అధికారంలో ఉండగా ఇలాంటి జన్మదిన వేడుకలు నిర్వహించలేదు. పదవి పోయిందని క్రూరత్వంలో ఇలాంటి జన్మది న వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే వైసీపీ కార్యకర్తలు బయటికి కూడా రాలేరు. కానీ ప్రభుత్వం ఆ పని చేయదు. జగన్ ఎలుకతో సమానం.. తొక్కితే పాతాళానికి పోతాడు. ఆయన, ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ క్యాడర్ వెంట్రుకలు కూడా పీకలేరని హితవుపలికారు.
చంద్రబాబు కేసుల్లో ఆధారాలు లేవని హైకోర్టే చెప్పింది
చంద్రబాబుపై కావాలనే తప్పుడు కేసులు పెట్టావ్. హైకోర్టే స్పష్టంగా ఆధారాలు లేవంటూ చెప్పింది. ఐదేళ్లు సీఎంగా ఉండి హూ కిల్డ్ బాబాయ్ వివేకా అంటే సమాధానం చెప్పలేదు.. వివేకా హత్య ఎలా జరిగింది… ఎవరు చేశారో జగన్కు తెలుసు. విశాఖలో కోడికత్తి డ్రామా ఆడి హైదరాబాద్కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించు కున్నావ్. అదే పోలీసులపై దౌర్జన్య పూరితంగా మాట్లా డుతున్నావ్.. 2029లో నువ్వు వచ్చేది లేదు.. సచ్చేది లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశావ్. రాష్ట్రానికి అనేక సమస్యలు సృష్టించి వెళ్లావు. నీలాంటి ఉన్మాది కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. పెట్టుబడులు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో చంద్రబాబు, లోకేష్లు పనిచేస్తున్నారు. జగన్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్మాదులను కట్టడి చేయాలి. పోలీసులు కూడా ముందస్తుగానే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి. జగన్ వద్ద రూ.43 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ కాకపోతే బెంగళూరు, ఇంగ్లాండు వెళ్లిపోతాడు. కానీ కార్యకర్తలు ఇక్కడే ఉండాలి.. వారి














