చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా

by చైతన్యరధం
Nov 30, 2023 at 10:41am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 11 లక్షల తెదేపా దరఖాస్తులపై తగు చర్యల్లేవు
  • 8 జిల్లాల కలెక్టర్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు
  • 17 నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని కోరిన తెదేపా
  • కొందరు తహశీల్దార్లు ఆగడాలు మితామీరుతున్నాయి
  • తక్షణం స్పందించకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

విజయవాడ: రాష్ట్రప్రభుత్వ వైఖరి, ముఖ్యమంత్రి తీరు దొంగే దొంగ అని అరిచినతీరుగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శిం చారు.ఓటర్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్ప డుతున్నారు. దొంగఓట్లు చేరుస్తూ అర్హుల ఓట్లు తీసేస్తు న్నారు. ఈవ్యవహారాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి తామువస్తున్నామని తెలిసి,అంతకు ముందే హడావుడిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని వైసీపీ నేతలు.. మంత్రులు కలిసి, తెదేపాపై ఫిర్యాదు చేశారు. తప్పు చేస్తున్నది జగన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ నేత లు.. ప్రభుత్వం.కానీ నిందలేమో తెదేపాపై వేస్తున్నారని అచ్చెనాయుడు మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తెదేపా బృందం బుధ వారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను కలిసింది. ఓట్ల నమోదు విషయంలో అక్రమా లు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు, ఇతర తెదేపా నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. భారీ సం ఖ్యలో దొంగ ఓట్లు నమోదుచేస్తూ, అదే సమయంలో అర్హులైనవారి ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశా రు. గతంలో తాము చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్య లు తీసుకున్నారని అడిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారిని కలిసినవారిలో తెదేపా నేతలు వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్‌, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌బాబు, గద్దె రామ్మోహన్‌రావు, పరుచూరి అశోక్‌ బాబు, పులివర్తి నాని,సుధారెడ్డి, కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, నసీర్‌ అహ్మద్‌, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, పిల్లి మాణిక్యరావు తదితరులు ఉన్నారు. అనంత రం సచివాలయంలో అచ్చెన్నాయుడు, బొండా ఉమా మహేశ్వరరావు, పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లా డారు. అచ్చెనాయుడు మాట్లాడుతూ ఓటమి ఖాయమని తెలిసే జగన్‌రెడ్డి, వైసీపీ నేతలు బరితెగించి ఓట్ల అక్ర మాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ కార్యకర్తల్లా 8 జిల్లాల కలెక్టర్లు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌రెడ్డి, అతని పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని వారి కి అర్థమైంది. అందుకే బరితెగించి మరీ రాష్ట్రవ్యాప్తం గా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లతోపాటు, అర్హుల ఓట్లు కూడా తొలగిస్తున్నారు. ప్రభుత్వ కుట్ర లకు కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. 8 జిల్లాల కలెక్టర్లయితే వైసీపీ కార్యకర్తలకంటే దారు ణంగా పనిచేస్తూ, పాలకుల కుట్రలు.. కుయుక్తులకు సహకరిస్తున్నారు. వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పూర్తిగా అధికార పార్టీకి సరెండర్‌ అయ్యారు. వారి పనితీరుపైనా,జరుగుతున్న పరిణమాలపైనా రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. కిందిస్థాయి అధికారులు.. కొందరు కలెక్టర్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారని తెలియచేశాం.ఫామ్‌-6, ఫామ్‌-7, ఫామ్‌-8 సహా, నకిలీ ఓట్ల తొలగింపు, ఇతర తెదేపా దరఖాస్తులపై ఎలాంటి చర్యలు లేవు.అవన్నీ కలిపి దాదాపు రాష్ట్రంలో 11లక్షల వరకు ఉన్నాయి. వాటన్నింటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరామని అచ్చెన్నాయుడు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో సహా తెలియచేశాం
రాప్తాడు నియోజకవర్గంలో 20 వేల బోగస్‌ ఓట్లు ఉన్నాయని, తక్షణమే వాటిని తొలగించాలని మా పార్టీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన ఫిర్యాదును అనంతపురం జిల్లా కలెక్టర్‌ పట్టించుకోవడం లేదు. ఫామ్‌-7 దరఖాస్తులు పెట్టుకోండి.. విచారణ జరిపించి తీసేస్తామని కలెక్టర్‌ చెబుతున్నారు. అదే అధికారులు వైసీపీ నేతలు చెప్పిన వెంటనే టీడీపీవారి ఓట్లతో పాటు..ఇతరుల ఓట్లు కూడా తొలగిస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జ్‌ చెప్పిన వెంటనే అదే కలెక్టర్‌ హుటాహుటిన 10వేల టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి సిద్ధమయ్యాడు. అనంతపురం కలెక్టర్‌.. రాప్తాడులో ఒకరకంగా, ఉరవకొండలో మరోరకంగా వ్యవహరించడం ముమ్మాటికీ అధికార పార్టీకి ఊడిగం చేయడమే. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 20వేల ఓట్లు తొలగించారు. అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నాని.. ఆయన సతీమణి ఎందరు అధికారులకు ఫిర్యాదు చేసినా స్థానిక యంత్రాంగం స్పందించలేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నియోజకవర్గమైన చంద్రగిరి లో 79 కొత్త పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, 59 పోలింగ్‌ స్టేషన్ల మార్పిడిని ఇష్టానుసారం చేసేశారు. పోలింగ్‌ స్టేషన్ల మార్పు..కొత్తవి ఏర్పాటు చేయడమనేది ఎన్నికల నిబంధనల ప్రకారమే జరగాలి. రాజకీయ పార్టీల్ని సంప్రదించాలి. కానీ అక్కడ అలా జరగలేదు. ఈ అంశంపై గతంలోనే ఫిర్యాదు చేశాం. పర్చూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తే గంపగుత్తగా ఫామ్‌-7లు అప్‌ లోడ్‌ చేస్తున్నాడు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు, విజయవాడ సెంట్రల్‌, రాప్తాడు, కాకినాడ సిటీ, గుంటూరు వెస్ట్‌, మచిలీపట్నం, గురజాల, మాచర్ల, విశాఖపట్నం దక్షిణం, తిరుపతి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ప్రధానంగా ఈ 17 నియోజకవర్గాల పై దృష్టి పెట్టి, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని అచ్చెన్నాయుడు చెప్పారు.
న్యాయపోరాటం చేసైనా సరే తప్పుడు అధికారుల్ని శిక్షించే తీరుతాం : బొండా
ఓటర్ల జాబితా అక్రమాలపై గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ ఫిర్యాదు చేసిందని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. దానికి సంబంధించి వచ్చేనెల 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి, మేము చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టనుంది. 8 మంది కలెక్టర్లపై కూడా కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తాడేపల్లి ఆదేశాలతో పనిచేసే కలెక్టర్లు, ఇతర అధికారులు, బీఎల్‌ వోలు ఎవరూ చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరు. మరో మూడునెలల్లో జగన్‌ రెడ్డి రాష్ట్రం విడిచిపోవడం, అతని ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయం. ఈ విషయం గ్రహించి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 8 జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు వారి పనితీరు మార్చుకుంటే మంచిది. వారిపై చర్యలు తీసుకునేవరకు టీడీపీ వదిలిపెట్టదు. అవసరమైతే న్యాయపోరాటం చేసైనా సరే తప్పుడు అధికారుల్ని శిక్షించే తీరుతామని బొండా ఉమా హెచ్చరించారు.
అనంతపురం ఓట్ల అక్రమాలు తెలుసుకుని నివ్వెరపోయారు : పయ్యావుల కేశవ్‌
అనంతపురం జిల్లా కలెక్టర్‌ నియోజకవర్గానికో విధంగా నిబంధనలు మారుస్తున్నారని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల అక్రమాల గురించి చెప్పగానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా నివ్వెరపోయారు. ఎన్నికల సంఘం పకడ్బందీగా రూపొందించిన విధానాలను కొందరు అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా మార్చేస్తున్నారు. కొత్తగా ఓటు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునే ఫామ్‌-6 ను రెండు రకాలుగా ప్రాసెస్‌ చేయవచ్చు. బీ.ఎల్‌.వో లకు నేరుగా ఇవ్వడం.. ఆన్‌లైన్లో దరఖాస్తు చేయడం. కానీ వైసీపీ నేతలు ఉరవకొండ నియోజకవర్గంలో భారీస్థాయిలో ఫామ్‌-6 దరఖాస్తులు ఆన్‌ లైన్లో నమోదు చేయించారు. వాటిని ఏ.ఈ.ఆర్‌.వోలు పరిశీలించి స్థానిక బీ.ఎల్‌.వోలకు పంపించాలి. అప్పుడు బీ.ఎల్‌.వోలు ఇంటింటికీ తిరిగి దరఖాస్తుల్లోని నిజానిజాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని తిరిగి ఏ.ఈ.ఆర్‌.వోలకు పంపిస్తే, వారు వాస్తవాలు తెలుసుకొని ఆ దరఖాస్తుల్ని తిరిగి ఈ.ర్‌.వోలకు పంపిస్తారు. ఈ.ఆర్‌.వోలు ఓకే అంటే ఓటర్‌ లిస్టులో కొత్త ఓటర్ల వివరాలు నమోదు అవుతాయి.
కానీ ఉరవకొండలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వైసీపీ నేతలు ఆన్‌ లైన్లో ఫామ్‌-6 దరఖాస్తులు అప్‌ లోడ్‌ చేసి, వాటి వివరాల్ని నేరుగా తహశీల్దార్లకు తెలియచేస్తారు. వైసీపీ నేతలు ఆన్‌ లైన్లో అప్‌లోడ్‌ చేయగానే.. తహశీల్దార్లు నేరుగా ఈ.ఆర్‌.వోకు పంపిస్తున్నారు. దాంతో ఈ.ఆర్‌.వో నేరుగా ఓటర్‌ జాబితాలో వివరాలు అప్‌ లోడ్‌ చేస్తున్నారు. కింద బీ.ఎల్‌.వోల వెరిఫికేషన్‌ లేకుండానే ఇదంతా జరిగిపోతోంది. వైసీపీ నేతల ఆదేశాలతో పగలు పనిచేయని తహసీల్దార్లు దొంగఓట్లు నమోదు చేయడానికి మూడురోజులు ఏకబిగిన రాత్రిళ్లు పనిచేశారు. ఇదంతా ఎన్నికల ప్రధాన అధికారికి చెబితే, ఆయన కూడా అవాక్కయ్యారు. ఎమ్మార్వో కార్యాలయాల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది. వారిద్వారానే చాలా తతంగం నడుస్తోంది. కానీ దొంగలు దొరక్కుండా తప్పించుకోలేరు. అసలు దరఖాస్తు ఎవరికి ఎన్ని గంటలకు వచ్చింది.. ఎవరి నుంచి ఏ సమయానికి ఇతరులకు వెళ్లిందనేది తెలుస్తుంది. డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్‌ లో వారు చేసే తప్పులన్నీ కనిపిస్తాయి. ఉరవకొండలో ఇలా జరిగిన ఓట్ల అక్రమాలు ఎన్ని అనేది ఇంకా తెలియదు. ఓటర్ల జాబితాలోని తప్పులపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే ఆ వ్యవహారం అంతా రహస్యమన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఇంటింటి సర్వే జరుగుతుండగానే వారంలోనే రాజకీయ పార్టీలు.. బీ.ఎల్‌.ఏలకు చెప్పకుండానే నేరుగా పై అధికారులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక అధికారు లకు 5 లేఖలు రాసినా ఆయన నుంచి స్పందనలేదు. ఇంటింటి సర్వే ముగియగానే నేరుగా వివరాలను ఎన్నికల సంఘానికి పంపించారని కేశవ్‌ చెప్పారు.
స్పష్టమైన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం. ఇదలా ఉంటే.. మరోపక్క రహస్య సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలపై కూడా ఎన్నికల కమిషనర్‌ కు ఫిర్యాదు చేశాం. ఉరవకొండలో మొదటిసారి 6,604 ఓట్లు తొలగించారని మేము చేసిన ఫిర్యాదుపై ఇద్దరు ఈ.ఆర్‌.వోలను సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ చేసి 5 నెలలు అవుతున్నా.. జిల్లా కలెక్టర్‌ సదరు అధికారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ విషయంపై కూడా ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశాం. అధికారులపై చర్యలు తీసుకోనివారు కూడా బాధ్యులు అవుతారని ఆయన చెప్పారు. అవసరమైతే తానే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మా విజ్ఞప్తులపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి గట్టిగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం. తప్పులుచేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసేవారికి కచ్చితంగా మెమోలు ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికిప్పుడు కాకున్నా ఎప్పుడో ఒకరోజు తప్పులు చేసే వారికి శిక్ష తప్పదు. రాజకీయ నేతలమైన మేం ప్రజలపక్షాన పోరాడాలా..లేక ఓటర్ల జాబితా లో జరుగుతున్న అవకతవకలపై పోరాడాలా అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రశ్నించాం. ఆయన స్పష్టమైన హామీ ఇచ్చాకే బయటకు వచ్చామని పయ్యావుల కేశవ్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

అస్తమించిన అక్షర సూరీడు

దర్జాగా.. దందా

నిబద్ధత కలిగిన నాయకుడు లోకేష్‌

Tags: అక్రమాలుఅచ్చెన్నాయుడుఓటర్ల జాబితాతెదేపాపిర్యాదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా
Previous Post

చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌

Next Post

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist