- 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి
- రూ.3,125 కోట్ల జమచేయనున్న ప్రభుత్వం
అమరావతి(చైతన్యరథం): అన్నదాత సుఖీభవ – పీఎం కిసా న్ రెండో విడత నిధులు శుక్రవారం విడుదలకానున్నాయి. ఈ మేరకు ఏపీ క్యాబినెట్లో నిధుల విడుదలకు నిర్ణయం తీసుకు న్నారు. రబీ రైతుల కోసం అనుకున్న సమయానికంటే ముందు గా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణ యించింది. పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సందర్భం గా శుక్రవారమే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత కింద అక్టోబరు 30న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడు దల చేయనుంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం అంద నుంది. అన్నదాత సుఖీభవ 2026-27 సంవత్సరానికి 2వ విడతలో ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 సాయం అందిం చనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా వాటాగా రూ.2,000 ఇవ్వనున్నారు.
ఈ విడత విడుదల మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.782.55 కోట్లు రైతుల కుటుంబాలకు అందజేయనున్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14,000, కేంద్ర ప్రభుత్వం రూ.6,000 వాటాగా చెల్లిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతను 20 జూన్ 2026న విడుదల చేశారు. ఈ ఏడాది మొదటి విడతలో 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల సాయాన్ని అందించారు. గతేడాది ఆగస్ట్ 2న ప్రారంభించిన ఈ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్ర వాటా కలిపి రూ. 8,985.41 కోట్లను రైతులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కింద రేపటి విడత తో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.15,236.35 కోట్లు రైతు కుటుంబాలకు అందజేయగా.. ఇందులో రాష్ట్ర వాటా రూ. 11,246.02 కోట్లు, కేంద్రం వాటాగా రూ.3,990.33 కోట్లు అందజేశారు.


