- మరో 2998 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియ
- ఆలస్యమైనా..తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహణ
- ఇప్పటివరకు 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు
- గత ప్రభుత్వంలో రూ.660 కోట్ల ప్రజాధనం వథా
- శాసనసభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): శాసనసభలో గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు రీ సర్వేపై అడిగిన ప్రశ్నకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చా రు. గత ప్రభుత్వంలో తొందరపాటు కారణంగా తప్పుల తడక గా రీ సర్వే సాగిందని అన్నారు. రీ సర్వే 1.0పై గ్రామ సభలు నిర్వహిస్తే 2.79 లక్షల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వీటిల్లో విస్తీర్ణం తేడాలకు సంబంధించి ఇప్పటికే 98 శాతం సమస్యల ను పరిష్కరించామని చెప్పారు. దాదాపు 7.5 లక్షల జాయింట్ జాయింట్ ఎల్పీఎమ్‌ల సమస్యలు వచ్చాయని, వాటిల్లో 2.98 లక్షలు పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని మార్చి నెలాఖరు లోపు పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రీసర్వే 1.0 లో ప్రభుత్వ భూముల రీసర్వేకు మాత్రమే రోవర్స్‌ను ఉపయోగిం చిందని, ప్రైవేట్ భూముల రీసర్వేలో రోవర్లను ఉపయోగించ కుండా కేవలం డ్రోన్ల ద్వారా తీసిన డిజిటల్ ఇమేజస్ (ఓఆరఐ) ల ఆధారంగా మాత్రమే రీ సర్వే చేసిందని, దీంతో చాలా చోట్ల ప్రయివేట్ భూముల విస్తీర్ణంలో తేడాలు వచ్చాయని తెలిపారు.
దీనికి తోడు రీసర్వేలో భాగంగా గ్రౌండ్ త్రూటింగ్(భూమిపై సర్వే) నిర్వహించే ముందు, నిర్వహించిన తర్వాత భూ యజమా నులకు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. రీసర్వే కాలం మొత్తాన్ని కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేశారని, దీంతో సరైన ప్రమాణాలు పాటించకుండా హడావిడిగా రీసర్వే చేశారని తెలిపారు. రీసర్వే చేసే సమయంలో భూ యజమానులు లేకపోవడం, వారి భూమి హద్దులు స్పష్టంగా చెప్పేవారు లేక పోవడంతో అధిక సంఖ్యలో జాయింట్ ఎల్పీఎం లు ఏర్పడ్డాయన్నారు. రీసర్వే పూర్తయిన ప్పటికీ జాయింట్ ఎల్పీఎం కారణంగా రైతులు ప్రభుత్వం నుంచి పొందాల్సిన రుణాలు, రాయితీలను పొందలేకపోయారు. దీంతో రీసర్వే 1.0 పట్ల రైతులు ఆందోళన చెందిన విషయాన్ని గుర్తుచేశారు.
జగన్‌రెడ్డి ప్రచార పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం
తన ప్రచార పిచ్చి కోసం జగన్‌రెడ్డి రీసర్వేలో భూముల సరిహద్దు రాళ్లపై తన పేరు, బొమ్మను ముద్రించుకున్నారని, దీనివల్ల రూ.660 కోట్ల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశారని మండిపడ్డారు. దాదాపు 77,98,516 సర్వే రాళ్లను సేకరించి ఒక్కొరాయికి దాదాపు 846 రూపాయలు ఖర్చు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రీ సర్వే 2.0ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపణీ చేశామని, రీ సర్వే పూర్తయిన వరకు మరో 14 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉం దన్నారు. కొత్త పాస్ పుస్తకంపై రాజముద్రతో పాటు డైనమిక్ క్యూర్ కోడ్‌ను ముద్రించినట్లు చెప్పారు. మొత్తం 15 రకాల రక్షణ అంశాలను పాస్ పుస్తకాల్లో చేర్చినట్లు చెప్పారు. రీ సర్వే చేసిన గ్రామాల్లో తప్పులు సరిదిద్దేందుకు, రీ సర్వే చేయబోయే గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.














