- దర్శించుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- పర్వదినం ఆదివారం రావడం అదృష్టమని వ్యాఖ్య
- ప్రభుత్వం తరపున సూర్య భగవానుడిని పట్టువస్త్రాలు
- పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్, హోంమంత్రి అనిత
- హాజరైన సంగీత దర్శకుడు తమన్. హీరో ఆది
- భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
శ్రీకాకుళం (చైతన్యరథం): అరసవల్లిలో కొలువు తీరిన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడిని ఆదివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపు న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారితో పాటు స్వామి వారిని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, సినీ హీరో అది దర్శించుకున్నారు. అరసవల్లిలో రెండురోజులుగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. అరసవల్లి సూర్యనారా యణ స్వామి జయంతి ఉత్సవాలకు వారు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భక్తులతో పూజలందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి.. రెండురోజులుగా రథ సప్తమి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతు న్నాయి.. నభూతోన భవిష్యత్ అన్న విధంగా రథసప్తమి శోభాయా త్ర జరిగిందని ప్రశంసించారు. రథసప్తమిని రాష్ట్ర పండగ చేయా లని కోరిన వెంటనే సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిం చారు. ఆ వెంటనే ఈ పండగను రాష్ట్ర పండగగా సీఎం చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. రథసప్తమి కోసం అరసవల్లిలో గత నెలరోజులుగా అద్భుత ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆదివారం రథసప్తమి రావడం అదృష్టమని అభివర్ణించారు. స్వామివారి దర్శనం కోసం 2 లక్షల మంది పైనే భక్తులు వస్తారని అంచనా వేశాం. ప్రత్యేక దర్శనం కంటే.. సాధారణ భక్తులే త్వర గా దర్శనం చేసుకుంటారని వివరించారు. దేవాలయం వరకు వృద్ధుల కోసం ఉచిత బస్సులు ఏర్పాట్లు చేశామని వివరించారు. అలాగే మజ్జిగ.. మంచినీటిని అందించే సౌకర్యాన్ని భక్తులకు కల్పించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నట్టు తెలిపారు. సామాన్యమైన భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించడమే తమ లక్ష్య మని వెల్లడించారు.
నిజరూప దర్శనంలో స్వామి వారు
మరో వైపు రథసప్తమి సందర్భంగా అరసవల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే భక్తులతో క్యూ కాంప్లెక్స్లు అన్ని కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు స్వామి వారి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు.















