చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నిశ్శబ్ద విప్లవం బహిరంగ తిరుగుబాటుగా మారుతోంది: యనమల

ఉద్యమపథంలో అంగన్వాడీలు, ఆశాలు, మున్సిపల్‌ ఉద్యోగులు, వాలంటీర్లు

చైతన్యరధం by చైతన్యరధం
December 27, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నిశ్శబ్ద విప్లవం బహిరంగ తిరుగుబాటుగా మారుతోంది: యనమల
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ అరాచక, అసమర్థ పాలనపై జనం తిరగబడుతున్నారు
  • ఇన్నాళ్లూ భరించారు.. ఇక సహనం నశించి రోడ్డెక్కుతున్నారు
  • ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ జగన్‌ మోసగించారు
  • ఉద్యమపథంలో అంగన్వాడీలు, ఆశాలు, మున్సిపల్‌ ఉద్యోగులు, వాలంటీర్లు

అమరావతి: జగన్‌ రెడ్డి దోపిడీ, మితిమీరిన అహంకారంతో ప్రజల తిరుగుబాటు బహిరంగమవుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌రెడ్డి అరాచక పాలనపై రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని భావించినప్పటికీ ఇప్పుడు అది బహిరంగ తిరుగుబాటుగా మారిందని మంగళవారం ఒక ప్రకటనలో యనమల పేర్కొన్నారు. తొలుత జగన్‌ రెడ్డి చేతకాని పాలనపై సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు బయటపడ్డారు. తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. పంచాయతీల్లోని సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు గళం విప్పి నిలదీశారు. అభ్యర్ధుల మార్పు నిర్ణయాలతో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరోవైపు నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ అరాచకాలు, ధరల బాడుడు, పన్నుల మోత, ఇసుక, మద్యం వంటి అంశాలపై నిశ్శబ్దంగా ఉన్న సామాన్యులు నేడు గేరు మార్చి స్వరం విప్పుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకు అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు, మున్సిపల్‌ ఉద్యోగులు రోడ్డెక్కి సమరశంఖం పూరించారని యనమల విమర్శించారు. మొత్తం 15 అంశాలపై జనం బహిరంగంగానే జగన్‌రెడ్డిపై తిరగబడుతున్నారన్నారు.
1. తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను రూ.4200 నుండి రూ.10,500 చేస్తే అంగన్వాడీలకు అండగా ఉంటానని, తెలంగాణ కంటే వెయ్యి అదనంగా ఇస్తానని జగన్‌ మాయమాటలు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో రూ.13,500 ఇస్తుంటే ఇక్కడ అంతకంటే రెండు వేలు తక్కువగా రూ.11,500 మాత్రమే ఇస్తూ మోసం చేస్తుండడంపై అంగన్వాడీలు రోడ్డెక్కారు.
2. అధికారంలోకి వస్తే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాక రూ.5వేల వేతనాల వాలంటీర్‌ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాలనే నయవంచనపై వాలంటీర్లు ఇప్పటికే సమ్మె నోటీసులిచ్చారు. వారి తిరుగుబాటే యువగళం విజయవంతానికి నాంది.
3. పనికితగ్గ వేతనం ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలు రూ.26 వేలకు పెంచాలంటూ మున్సిపల్‌ ఉద్యోగులు సమ్మె సైరన్‌ మోగించారు.
4. కనీస వేతనం, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలి, పనిభారం తగ్గించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా సెలవులు ఇవ్వాలనే డిమాండ్లతో ఆశ వర్కర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
5. అమరావతే రాజధాని అనే మాటపై మడమ తిప్పి మూడు రాజధానులంటూ జగన్‌రెడ్డి దగా చేసినందుకు అమరావతి రైతులు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు.
6. పార్టీ పెట్టిన రోజు నుండి జగన్‌రెడ్డి వెంటే ఉన్న నాయకుల్ని నమ్మించి మోసం చేసినందుకు వెంట నడిచి తప్పు చేశామంటూ వారంతా రోడ్డెక్కి నినదిస్తున్నారు. జగన్‌ రెడ్డి మేలు కోసం సొంత నియోజకవర్గంలోని రాజధానిపై కేసులతో నిందలేసి, అభివృద్ధిని అడ్డుకుని తప్పు చేశానంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశాడు.
7. వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ప్రజల ముందు తలదించుకోవాల్సి వచ్చేదంటూ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బహిరంగంగా ప్రకటించి జగన్‌ రెడ్డి చేతకాని పాలనను, దుర్మార్గాలను బట్టబయలు చేశారు.
8. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన దాదాపు రూ.1.14 లక్షల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులు జగన్‌ రెడ్డి దారి మళ్లించారు. 120కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వందల మందిని హత్య చేశారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. తప్పుడు కేసులతో వేధించడంపై ఆయా వర్గాలన్నీ రోడ్డెక్కుతున్నాయి.
9. మద్యాన్ని నిషేధించిన తర్వాతే తిరిగి ఓట్లు అడుగుతానని ఎన్నికలకు ముందు మహిళలకు మాటిచ్చిన జగన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల కోట్ల విలువైన కల్తీ మద్యం అమ్మి, లక్ష కోట్లు దిగమింగాడు. వేలాది మంది ప్రాణాలు తీయడంపై మద్య నిషేధం ఎక్కడంటూ మహిళలు రోడ్డెక్కుతున్నారు.
10. ప్రతిపక్ష నాయకుడిగా బాదుడే బాదుడు అంటూ విద్యుత్‌ ఛార్జీల గురించి అరిచి గీపెట్టిన జగన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చాక దాదాపు 8 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి రూ.58 వేల కోట్ల భారం వేశాడు. ట్రూ అప్‌ ఛార్జీలు, సర్‌ ఛార్జీల పేరుతో బిల్లుల బాదుడుపై జనం తిరగబడుతున్నారు.
11. చెత్తపై పన్ను, మరుగుదొడ్లపై పన్నులు వేయడంపై ప్రజలు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు.
12. జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. పోలవరం ఎత్తు తగ్గించి పనులు ఆపేశాడు. అన్నమయ్య డ్యాం గేట్లు మరమ్మతులు చేయక కొట్టుకుపోయింది. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేయడంపై సీమ ప్రజలంతా ఉద్యమిస్తున్నారు.
13. మెరుగైన ఇసుక పాలసీ పేరుతో ఇసుక మాఫియాగా మారి జగన్‌ రెడ్డి వేల కోట్లు దోచేశాడు. ఇసుక దొరకక దాదాపు 132 వృత్తులు, వ్యాపారాలను దెబ్బతీయడంతో నిర్మాణదారులు బహిరంగంగానే గళమెత్తి జగన్‌ రెడ్డి దోపిడీపై మండిపడుతున్నారు.
14. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ హామీపై జగన్‌ రెడ్డి మడమ తిప్పాడు. రూ.3వేల పెన్షన్‌ హామీని తుంగలో తొక్కాడు. పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ దూరం చేశాడు. కౌలు రైతులకు రైతు భరోసా రద్దు చేశాడు. ఇలా మేనిఫెస్టో హామీలపై చేసిన మోసాలపై ప్రజలు నిలదీస్తున్నారు.
15. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీని గాలికొదిలి, పరిశ్రమలు తరిమేసి, పెట్టుబడులు రద్దు చేసిన విధానాలపై యువత గళమెత్తి ప్రశ్నిస్తోంది.

Tags: అంగన్వాడీలుఅసమర్థ పాలనఆశాలుఉద్యమపథంజగన్‌ అరాచకనిశ్శబ్ద విప్లవంబహిరంగ తిరుగుబాటుమున్సిపల్‌ ఉద్యోగులుయనమలవాలంటీర్లుహామీలు అమలు
Previous Post

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది-…నారా లోకేష్

Next Post

హద్దుల్లేని జగన్‌ నమ్మక ద్రోహం: ఆనంద్‌ బాబు

Next Post
హద్దుల్లేని జగన్‌ నమ్మక ద్రోహం: ఆనంద్‌ బాబు

హద్దుల్లేని జగన్‌ నమ్మక ద్రోహం: ఆనంద్‌ బాబు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.