2019 ఎన్నికలకు ముందు నవరత్నాలంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేసిన జగన్‌రెడ్డి.. ఎన్నికల తరువాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి ఐదేళ్ల పాలనలో 85శాతం హామీలను తుంగలో తొక్కాడు. రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాడు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్‌లో కమీషన్ల రూపంలో దోచుకున్న సొమ్ములతో నేడు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు పుట్టినరోజు పోస్టర్ వేయడం సైకోతనానికి నిదర్శనం. వైసీపీ హయాంలో ఆర్ధికంగా, సామాజికంగా ఏపీ దెబ్బతింది. వందకు పైగా బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు రద్దయ్యాయి. సబ్ ప్లాన్ నిధులు రూ.80వేల కోట్లకు పైగా దారి మళ్లాయి. రాష్ట్రాన్ని నవ మోసాలతో అధోగతికి చేర్చిన సైకో పోయాడు. రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోన్న నవ నిర్మాత చంద్రబాబు గద్దెనెక్కారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్‌లోని హామీలను 90శాతం అమలు చేసి.. సూపర్ సిక్స్ కొట్టారు. సైకో రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించి.. ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యమని ప్రకటించుకున్నారు.
నవరత్నాల పేరిట సైకో జగన్ చేసిన నవ మోసాలు
మద్యపాన నిషేధ హామీ మోసం: మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్.. విషపూరిత (జే బ్రాండ్) మద్యంపోసి.. 30వేలమంది ప్రాణాలు, 35లక్షలమంది ఆరోగ్యాన్ని నాశనం చేసిన సైకో జగన్. విషపూరిత మద్యంతో రూ.3500 కోట్లకు పైగా జగన్ ముఠా దోపిడీకి పాల్పడిరది. కూటమి అధికారంలోకి రావడంతోనే నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టి.. నాణమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
25 లక్షల ఇళ్లు మోసం: 2014-19 టీడీపీ పాలనలో మంజూరు చేసిన 3 లక్షలకు పైగా ఇళ్లను రద్దు చేసి… వాటిని తమ పార్టీ కార్యకర్తలకు, అస్మదీయులకు కట్టబెట్టిన సైకో జగన్. ఊరికి దూరంగా, నివాస యోగ్యంకాని స్థలాలను పేదలకు కట్టబెట్టి, పేదలకు సరైన స్థలపత్రాలు కూడా అందించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా… బలహీలన వర్గాలను మోసం చేశాడు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 3లక్షల ఇళ్లు పంపిణీ చేయడంతోపాటు.. ఉగాదినాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. పేదలకు గృహాలు పంపిణీ చేసి.. వారి గుండెల్లో కొలువుదీరారు చంద్రబాబు.
సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం చేసిన జగన్: సైకో ఐదేళ్ల పాలనలో ఒకటంటే ఒక్క నీటి ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పుకోలేని దుస్థితి. కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ పేరిట ప్రాజెక్టుల భవితనే ప్రశ్నార్ధకం చేశాడు జగన్. టీడీపీ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పనులుచేస్తే, సైకో పాలనలో కేవలం 3శాతం పనులు మాత్రమే జరిగాయి. నేడు కూటమి ప్రభుత్వంలో కేవలం 18 నెలల్లో 12 శాతం పనులు పూర్తి చేసి.. పూర్తిచేసిన పనుల శాతాన్ని 88కి చేర్చింది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసేలా శరవేగంగా పనులు సాగిస్తోన్న అపర భగీరథుడు నారా చంద్రబుబు నాయుడు. ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాంను గల్లంతు చేసి వరదల్లో 42మంది ఉసురు తీసిన సైకో జగన్. కూటమి ప్రభుత్వంలో హాంద్రీ-నీవాకు రూ.3,830 కోట్లు ఖర్చు చేసి కృష్ణా జలాలను 738 కి.మీలో దూరంలోవున్న కుప్పానికి తీసుకెళ్లిన సాధకుడు చంద్రబాబు నాయుడు. రాయలసీమలో నేడు ప్రతి చెరువు జలకళతో తొణికిసలాడుతోంది. వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు 2026 జూన్‌నాటికి సాగునీరు అందించేలా పనులు జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టులకు 18నెలల్లోనే రూ.6,613 కోట్లు ఖర్చు చేసింది కూటమి సర్కారు. సైకో జగన్ ఐదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.2వేల కోట్లు.
రైతులను మోసం చేసిన జగన్: ఏడాదికి రూ.13,500 చొప్పున రైతులకు ఇస్తానని హామీ ఇచ్చిన సైకో జగన్.. రాష్ట్ర నిధులనుంచి రైతు భరోసా కింద కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి రైతులను నిలువునా మోసం చేశాడు. ఐదేళ్లలో ఒక్కోక్క రైతుకు రూ.30 వేలు ఎగనామం పెట్టారు. కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద (పీఎం కిసాన్‌తో కలిపి) రెండు విడతల్లో మొత్తం రూ.6,309.44 కోట్లు జమ చేసి.. రైతులకు అండగా నిలిచారు చంద్రబాబు.
ప్రతి విద్యార్థికి రూ.15వేలు మోసం: తాను అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి అమలు చేస్తానని హామీనిచ్చిన జగన్.. గద్దెనెక్కగానే ఇంట్లో ఒక్కరికేనని యూటార్న్ తీసుకున్నాడు. అమ్మఒడి కుదింపు, నాన్న బుడ్డీ వసూళ్లతో ఈ రత్నం పక్కకిపోయింది. చివరి ఏడాదిలూ పూర్తిగా ఎగనామం పెట్టాడు. కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంకింద 67.27 లక్షలమంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున.. రూ.10,091 కోట్లు జమ చేసింది.
ఉచిత వైద్యం మోసం: పేదల ఆరోగ్య వర ప్రదాయిని ఆరోగ్య శ్రీ పథకాన్ని సైకో జగన్ నిర్వీర్యం చేశాడు. దాదాపు 11 నెలలు ఒక్క పైసా కూడా చెల్లించని పరిస్థితి. భారీగా పేరుకున్న బిల్లుల్ని ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు నెట్ వర్క్ ఆస్పత్రులు నిరాకరించాయి. రూ.1,800 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు. ఆ బకాయిల్ని కూడా కూటమి ప్రభుత్వం తీరుస్తుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షలు వరకూ ఉచిత వైద్య చికిత్స కవరేజీ అందిస్తోంది.
ఆసరాకు టోకరా పెట్టిన జగన్: ఈ పథకం ద్వారా మొండి బకాయిలు పెట్టేవారికి మాత్రమే ఎక్కువ ప్రయోజనం కలిగింది. ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించే బీసీ, ఎస్సీ, ఎస్టీ గ్రూపులకు ప్రయోజనం తక్కువైంది. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు రూ.3 లక్షల రుణం వరకూ సున్నా వడ్డీ రుణాలు అందించగా.. రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక లక్షకు కుదించారు.
అవ్వ- తాతలను మోసం చేసిన జగన్: తాను అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.3000 చేస్తానని చెప్పి ప్రజలను నమ్మించి.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి.. ఏడాదికి రూ.250 పెంచుకుంటూ వెళ్లాడు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలనుంచే పింఛన్‌ను రూ.1000 పెంచి రూ.4వేలు ఇవ్వడం జరుగుతోంది.
విద్యార్థులను మోసం చేసిన సైకో జగన్: యూజీనుంచి పీజీ దాక పేదల చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక పేదలకు చదువు దూరం చేశారు. టీడీపీ హయాంలో 16 లక్షల మందికి అందే ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రస్తుతం 10 లక్షలలోపుకు కుదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1788 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
జగన్ హయాంలో ప్రజలకు ఎదురైనవి ‘‘నవమోసాలు’’. పేదల కళ్లలో మట్టి కొట్టి, హామీలు గాలికొదిలి.. మద్యం మాఫియా, ఇళ్ల మోసాలు, రైతులపై నిర్లక్ష్యం, విద్యార్థుల కలలను చెరిపివేతతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు. కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే ప్రజల ఆశల్ని నెరవేర్చుతూ ముందుకు సాగుతోంది. సూపర్ సిక్స్ పథకాలు పారదర్శక పాలనకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
మంగినపల్లి ఎలీషా, అనలిస్ట్















