చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లకు స్వేచ్ఛ

పల్నాడు టీడీపీ నేతల ధ్వజం

చైతన్యరధం by చైతన్యరధం
June 29, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లకు స్వేచ్ఛ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న జనం
  • పిన్నెల్లి సోదరుల అరాచకాలకు లెక్కలేదు
  • పాపం పండటంతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జైలుకు
  • సోదరుడిని కూడా అరెస్ట్‌ చేయాలి

అమరావతి(చైతన్యరథం): మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయి జైలుకు వెళ్లటంతో పల్నాడు జిల్లా మాచర్ల ఊపిరి పీల్చుకుంటోందని టీడీపీ నేతలు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంతో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

మాచర్లకు స్వేచ్ఛ: కొమ్మాలపాటి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్లటంతో ప్రస్తుతం ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద కేసు పెడతారో, ఎలాంటి అరాచకాలు జరుగుతాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. కూటమి విజయంతో పల్నాడు జిల్లా ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మాచర్ల ప్రజలకి నేడు స్వాతంత్రం వచ్చింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. పిన్నెల్లి అరెస్టు ఆనందదాయకం. పిన్నెల్లిని అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నాయకులు చెప్పడం అభూత కల్పన మాత్రమే. పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అక్రమ మైనింగ్‌ తో కోట్లు గడిరచారు. పిన్నెల్లి చేసిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు అన్నింటినీ బయటపెడతాం.

ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఒక నియంతలా వ్యవహరించారు. ప్రభుత్వాదాయానికి గండి కొట్టి అక్రమంగా లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే రౌడీలతో దౌర్జన్యాలు చేయించారు. పిన్నెల్లి అరెస్టు సందర్భంగా టీడీపీ యువ నాయకుడు ముందుకొస్తే అతనిపైన కూడా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా ప్రజలు విశ్వసనీయతకు మారుపేరు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టారు. గత ఐదేళ్లు వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ధర్మమే నిలుస్తుంది. అందుకు నిదర్శనం టీడీపీ గెలవడమే. ఇకమీదట వైసీపీ నాయకుల ఆటలు సాగవు. వైసీపీ అధ్యాయం ముగిసింది. ఇక వైసీపీ నాయకులు తోకముడవాల్సిందేనని కొమ్మాలపాటి స్పష్టం చేశారు.

ఎంతో మంది ప్రాణాలు తీశారు: చదలవాడ
అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలకు వైసీపీ నాయకులు చిరునామాగా ఉండేవారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ ఐదేళ్లు పల్నాడు గడ్డమీద గుట్కా, గంజాయి, డ్రగ్స్‌ మాఫియా రాజ్యమేలింది. వైసీపీ ఎమ్మెల్యేలు, వారి మంత్రులు దీనికి నాయకులుగా ఉన్నారు.జగన్‌, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రయత్నించలేదు. పల్నాడు జిల్లాలో ఈ ఐదేళ్లుగా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. చంద్రయ్య, పెద్దకోటయ్య, జల్లయ్య ఇలా ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. అనేకమంది పై హత్యా ప్రయత్నాలు జరిగాయి. వైసీపీ నాయకులకు భయపడి పల్నాడు జిల్లాను వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి, చెడుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ వారి ఇళ్ళపైకి వైసీపీ మూకలను కిరాయి గుండాలను పంపించి దాడులు చేయించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని పరిపాలన సాగించారు. వీటన్నింటిపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం కారణంగానే మాచర్లలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చింది. ఎన్నికలప్పుడు రెంటచింతల మండలం పాల్వాయి లో ఏవీఎం ధ్వసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్‌పై దాడికి దిగారు. తరువాత ఒక మహిళపై దాడి చేశారు. కారంపూడిలో సీఐ నారాయణస్వామి పై హత్యాయత్నం చేశారు. ఈ కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు నీతి, నిజాయితీతో ఉండి ప్రజలకు అండగా నిలవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అందుకు కలిసికట్టుగా కలిసి పనిచేయాలని చదలవాడ అన్నారు.

అధికారం అండగా దోపిడీ: జీవీ
కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్లాడని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గత ఐదు సంవత్సరాలు ప్రజలిచ్చిన అధికారాన్ని దోపిడీకి ఉపయోగించుకున్నారు. అనేకమంది తెలుగుదేశం కార్యకర్తలను హత్య చేయడమే కాకుండా చనిపోయిన వాళ్ళ బంధువులను కూడా కేసుల్లో ఇరికించి మరిన్ని పాపాలు చేశారు. అనేకచోట్ల భూములు కబ్జాలు చేశారు. లిక్కర్‌ మాఫియాగా ఏర్పడి యథేచ్ఛగా దోచుకున్నారు. పిన్నెల్లి సోదరులు చేయని నేరాలు, ఘోరాలు దోపిడీలు లేవు. వారిని పల్నాడు ప్రజలు నరరూప రాక్షసులుగా చూశారు. చేసిన పాపాలు పండటంతో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిరచి గుణపాఠం చెప్పారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసుల చేత చట్టాన్ని తుంగలో తొక్కించారు. అనేక తప్పులు చేయించారు. టీడీపీ నాయకుల పైన దాడులు చేయించారు. విధ్వంసాలు సృష్టించారు. దోపిడీ, దౌర్జన్యాలు చేశారు. ప్రజల్ని హింసించారు.

ఈ దుర్మార్గులకు ప్రజా కోర్టులో శిక్ష పడిరది. వీరు చేసిన నేరాలన్నింటినీ వెలికి తీసి వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులను వదలకూడదు. వీరందరూ జైళ్ళల్లో ఉండాలి. సహకరించిన అధికారులను కూడా వదలకూడదు. విచారణ జరిపించి తప్పు చేసిన అధికారులను చట్ట ప్రకారం శిక్షించాలి. పిన్నెల్లి తో పాటు అనేక అక్రమాలు చేసిన అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డిని కూడా వెంటనే అరెస్టు చేయాలని జీవీ డిమాండ్‌ చేశారు.

Previous Post

ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

Next Post

పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

Next Post
పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.