చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

శాడిస్టు పాలనలో పేట్రేగిపోతున్న న్యూడిస్టులు

by చైతన్యరధం
Aug 9, 2022 at 11:22am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, సంపాదకుని ఎంపిక
శాడిస్టు పాలనలో పేట్రేగిపోతున్న న్యూడిస్టులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  •  గంట, అరగంట, గోరంటలపై చర్యలేవి జగన్‌ రెడ్డీ 
  •    వైసిపి నేతలను చూస్తే హడలిపోతున్న మహిళలు
  •  కామాంధులపై చర్యల్లో జగన్‌ సాచివేత వైఖరి
  • తప్పుడు పనులు కప్పిపుచ్చడానికే కులాల కుంపటి
  • సిఎం వైఖరిపై నేడు విజయవాడలో అఖిలపక్షం
                                                   (చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)

తన పాలనతో దేశం మొత్తం ఏపీ వైపు తిరిగేలా చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున చెప్పిన జగన్మోహన్‌ రెడ్డి మాటల వెనుక అంతర్యమేమిటో తాజాగా వైసిపి లోక్‌ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ చర్యతో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. గత మూడేళ్లుగా విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కినెట్టిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి… కొందరు కామాంధులైన వైసిపి నేతలకు కొమ్ముకాస్తూ వారికి పదోన్నతి కల్పిస్తున్నారు. అంబటి రాంబాబు ఒక మహిళతో గంటవచ్చి తనకు కావాల్సిన చేయాలని అసభ్యంగా మాట్లాడిన ఆడియో వైరల్‌ అయ్యాక ఆయనపై చర్య తీసుకోకపోగా… రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రిగా ప్రమోషన్‌ కల్పించారు. ఒంటిపై నూలుపోగు లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన గోరంట్ల మాధవ్‌ కు కూడా ముఖ్యమంత్రి రేపో,మాపో అదనంగా మరో కీలకపదవి అప్పగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తప్పుడు పనులు కప్పిపుచ్చేందుకు
కులం కార్డు బయటకు తెచ్చిన జగన్‌ రెడ్డి
మూడేళ్లుగా ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మాధవ్‌ వ్యవహారంలో యావత్‌ ప్రపంచం ముఖాన ఉమ్మేస్తుండటంతో.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కులం కార్డు బయటకు తీసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో బాగోతం బయటపడిన వెంటనే చర్యలు తీసుకోకపోగా.. ఆయన ద్వారా ఒక సామాజికవర్గంలో విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేయించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. స్వతహాగా నేరచరితుడైన జగన్మోహన్‌ రెడ్డి తన ప్రభుత్వంలో ఆర్థిక నేరస్థులు, ఖూనీకోర్లు, బ్రోకర్లు, రేపిస్టులకు పెద్దపీట వేస్తున్నారు. జగన్‌ చేతకానితనాన్ని అలుసుగా తీసుకున్న వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలను చెరబడుతూ అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడ్డారు. చివరకు జగన్మోహన్‌ రెడ్డి వద్ద మార్కులు కొట్టేయాలంటే గంట , అరగంట, గోరంట వంటి వారి మాదిరి రెచ్చిపోవాలనే పరిస్థితులు కల్పించారు.
దిగజారుడు నేతలకే వైసీపీలో అందలం
గోరంట్ల మాధవ్‌ పై గతంలో 376,302,506 సెక్షన్ల కింద తీవ్రమైన కేసులున్నాయని తెలిసి కూడా జగన్‌ రెడ్డి ఆయన ఎంపి పదవిని కట్టబెట్టడం చూస్తే ముఖ్యమంత్రి నిజస్వరూపమేమిటో అర్థమవుతోంది. బాద్యతాయుతమైన ప్రజా ప్రతినిధులుగా ఉండి మహిళలతో గంట వస్తావా, అరగంట వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడిన అవంతి శ్రీనివాసరావు, అంబటి రాంబాబులపై చర్యలు తీసుకోకపోగా మంత్రి పదవులు కట్టబెట్టారు. గుంటూరు జిల్లాలో 13 ఏళ్ల దళిత బాలికపై 80 మంది మానవమృగాలు అత్యాచారం చేసి నరకం చూపించారు. ఈ కేసులో వైసీపీ నేత భూ శంకర్‌ , ఆప్కాబ్‌ చైర్మన్‌ అనిల్‌ బాబు నిందితులైనా చర్యల్లేవు. అరెస్టయిన భూ శంకర్‌ వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రైట్‌ హ్యాండ్‌ కావడం, బాబు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు అనిల్‌ బాబు ప్రధాన అనుచరుడు కావడంతో కేసును పోలీసులు అటకెక్కించారు. మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధించిన జోగి రమేష్‌ ని కనీసం మందలించకపోగా మంత్రి పదవి కట్టబెట్టారు. చిత్తూరు జిల్లా మదన పల్లె ఎమ్మెల్యే నవాజ్‌ భాషా నాడు – నేడు ఫోటో ఎగ్జిబిషన్‌ లో బహిరంగంగా ఓ మహిళా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆరుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై దాడులకు పాల్పడ్డ కేసులు, మరో ఏడుగురిపై కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. మహిళా ఉద్యోగులను వేధించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వంటి వైసీపీ నాయకులపైనా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం జగన్‌ రెడ్డి అంతర్యాన్ని తెలియజేస్తోంది.
అన్న ఎన్టీఆర్‌ కూతురిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యంగా మాట్లాడి యావత్‌ మహిళా జాతిని అవమానించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలపై కనీసం చర్యలు తీసుకోకపోగా వాళ్ల బూతులు వింటూ జగన్‌ రెడ్డి రాక్షసానందం పొందారు. శాడిస్టు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పార్టీ ఆర్దిక నేరగాళ్ల నుంచి ఆకు రౌడీల వరకు అందరికీ పునారావాస కేంద్రంలా మారింది. వైసిపిలోని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 86 మంది పై (57 శాతం) క్రిమినల్‌ కేసులు ఉండగా, వీరిలో 50 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయని ఏడీఆర్‌ (అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ ) నివేదిక స్పష్టం చేసింది.
డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలతో రెచ్చిపోతున్న మృగాళ్లు
మద్యపాన నిషేదంపై మాట తప్పిన జగన్‌ రెడ్డి యువతను డ్రగ్స్‌, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేయడంతో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చంద్రబాబు హయాంలో కట్టదిట్టంగా శాంతిభద్రతలు అమలు చేయడంతో నేరాలు అదుపులోకి వచ్చాయి. ప్రభుత్వం శిక్షిస్తుందనే భయంతో గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసినవారు చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో రేపిస్టులు, న్యూడిస్టులు సిగ్గు,లజ్జాలేకుండా కాలరెగరేసుకొని రోడ్లపై తిరగే పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి శాసనసభ్యులను ఇళ్ల వెంట పంపుతోంది. మాధవ్‌ ఘటన చూశాక వైసిపి ప్రజాప్రతినిధుల తమ ఇళ్లవద్దకు వస్తున్నారంటే మహిళలు భయకంపితులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వీరితో ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని కొందరు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతుండగా… మరికొందరు వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.
మహిళలపై 21శాతం పెరిగిన నేరాలు
ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అధీనంలోని పోలీస్‌ శాఖ ఇచ్చిన క్రైమ్‌ రిపోర్ట్‌ ప్రకారం 2020-21లో మహిళలపై అత్యాచారాలు, దాడులు, లైగింక వేధింపులు తదితర మహిళలపై నేరాలకు సంబంధించి 17,736 కేసులు నమోదయ్యాయి. 2019-20లో 14,603 నేరాలు నమోదుకాగా (14%)… ఏడాదిలో ఏకంగా 21 శాతానికి పెరిగడంలో రాష్ట్రంలో పెరిగిపోయిన విచ్చలవిడి తనానికి, జగన్‌ రెడ్డి సర్కారు చేతగాని తనానికి నిలువెత్తు నిదర్శనం. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి. విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలైన ఒక యువతిపై కామాంధులు 30గంటలపాటు కన్నవారి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డారు.
అయ్యా తమ బిడ్డకు న్యాయం చేయండని ఆ అభాగ్యురాలి కుటుంబసభ్యులు పోలీసులకు వద్దకు వెళ్తే కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి ఖాకీలు నిరాకరించారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవడం చేతగాని ప్రభుత్వం ప్రతిపక్షనేతలపై వేధింపులకు దిగింది. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుతోసహా పలువురు టిడిపి ముఖ్యనేతలకు మహిళాకమిషన్‌ చైర్పపర్సన్‌ నోటీసులివ్వడంతో యావత్‌ రాష్ట్రప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
గన్నూ లేదు-జగనూ రాడు
ఆడబిడ్డకు కష్టమొస్తే గన్‌ కంటే ముందు వస్తాడన్న జగన్‌ ఎక్కడ? మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లను గన్నుతో కాల్చేందుకు జగన్‌ ఎందుకు రావడంలేదు? ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో అరాచకపర్వం కొనసాగుతుంటే ఒక్క నిందితుణ్ణీ ఎందుకు శిక్షించలేకపోయారు? అసలు ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా ఉందా? దిశా పేరుతో ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రచారార్భాటంగానే మిగిలిపోయాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అఘాయిత్యం జరిగితేనే తట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి మనసుకు…సొంత రాష్ట్రంలో ఆడబిడ్డల ఆక్రందనలు ఎందుకు వినిపించడంలేదు?
మీ చేతకాని పాలనతో ఇంకెందమంది దిశలను బలితీసుకుంటారు? దిశ చట్టం అమల్లోకి వచ్చాక ముగ్గురికి ఉరిశిక్ష, ఇరవైమందికి జీవతఖైదు విధించామన్న తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారు జగన్‌ రెడ్డీ? నిర్భయ నిధి కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ కు రూ. 112 కోట్లు కేటాయించగా వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందంటే మహిళా భద్రతపై ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

సొంత బాబాయ్‌ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం?

యువతిపై హత్యపై చంద్రబాబు సీరియస్‌

 

Tags: 13 ఏళ్ల దళిత బాలిక80 మంది మానవమృగాలుఅత్యాచారంఅనిల్‌ బాబుఅంబటి రాంబాబుఅవంతి శ్రీనివాసరావుఆప్కాబ్‌ చైర్మన్‌ఆర్థిక నేరస్థులుకామాంధులుకులం కార్డుకొడాలి నానిఖూనీకోర్లుగుంటూరు జిల్లాగోరంట్ల మాధవ్‌జగన్మోహన్ రెడ్డిజోగి రమేష్‌ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డినేరచరితుడున్యూడ్‌ వీడియోప్రమాణ స్వీకారంబూతులుబ్రోకర్లురేపిస్టులువల్లభనేని వంశీ
Previous Post

తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపిన వైసీపీ

Next Post

మాధవ్‌ వికృత చేష్టలపై అఖిలపక్ష సమావేశం

మరిన్ని వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా
ఆంధ్రప్రదేశ్

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం
ఆంధ్రప్రదేశ్

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు
ఆంధ్రప్రదేశ్

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!
ఆంధ్రప్రదేశ్

విశాఖ కాదు..ఇక ఏఐ పట్నం!

చైతన్యరధం
@ April 29, 2026
Load More

ముఖ్య వార్తలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

మీ త్యాగాలతో ఈ స్థాయికి వచ్చా

చైతన్యరధం
@ April 30, 2026
అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist