- పాతాళభైరవి 75 ఏళ్ల వేడుకలు
విజయవాడ (చైతన్యరథం): తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామ కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో విగ్రహానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మె ల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలను ఈ సందర్భం గా ఎంపీ శివనాధ్ తో పాటుగా ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొనియాడారు. నటుడిగానే కాకుం డా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, నాయకులు కోనేరు కిషోర్, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనగా నందమూరి రామకృష్ణను ఈ సందర్భం గా ఎంపీ శివనాద్ తదితరులు ఘనంగా సత్కరించారు. పాతాళ భైరవి సినిమా విడుదల అయ్యి 75 సంవత్సరాల పూర్తయిన సంద ర్భంగా ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి నాయకుల సంబరాల నడుమ కేక్ కోశారు.














