- ఇప్పటివరకు 2.5 లక్షల పేదల్లో వెలుగులు
- అండగా నిలిచిన మార్గదర్శులకు అవార్డులు
- వసుదైక కుటుంబం నినాదంతో విస్తృత ప్రచారం
- ఏడాది పూర్తి సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాలి
- 30న తిరుపతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమం జరపాలి
- సమీక్షలో సీఎం చంద్రబాబునాయుడు
అమరావతి(చైతన్యరథం): ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4ను కార్యక్రమంలా కాకుండా ఉద్యమస్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమం త్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పేదలకు చేయూత ఇచ్చేలా చేపట్టిన ఈ విశిష్ట కార్యక్రమానికి మార్చి 30 నాటికి ఏడాది పూర్తి కావొస్తుండటంతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచిం చారు. తొలి ఏడాదిలో ఇప్పటివరకూ 2.5 లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపామని, బంగారు కుటుంబాలకు చేయూ తను ఇవ్వటంలో ఆదర్శంగా నిలిచిన మార్గదర్శులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో దీనిపై ప్రణాళికా విభాగం అధికారులతో ముఖ్య మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి లో మార్చి 30 తేదీన పీ4 పై ఆయా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 30వ తేదీన తిరుపతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రస్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహ కార మార్గదర్శి పేరిట అవార్డులు ఇవ్వనున్నారు.
జిల్లా స్థాయిలో విశిష్ఠ మార్గదర్శి పేరిట ఒక అవార్డు, మరో ముగ్గురి కి ప్రశంసా పత్రాలు ఇవ్వనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు మార్గద ర్శులకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. జిల్లా స్థాయిలో జరిగే పీ4 తొలి ఏడాది కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తొలగించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో మిగతా వారికి స్ఫూర్తిని నింపేలా బంగారు కుటుం బాలు, వారికి చేయూత ఇచ్చిన మార్గదర్శులకు సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. వసుదైక కుటుంబం అనే థీమ్తో గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే నినాదంతో విస్తృత ప్రచారం జరగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికీ మెరుగైన జీవన ప్రమాణాలు, భవిష్యత్తును అందించేలా చేపడుతున్న విశిష్ట ఉద్యమంగా పీ4 నిలిచిపోవా లని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.















