చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కనిగిరి బహిరంగ సభలో నారా లోకేష్.

by చైతన్యరధం
Jul 21, 2023 at 11:57am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
Nara Lokesh
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కందుకూరు అదిరిపోయింది. కొండపి దద్దరిల్లింది. కనిగిరి ప్రభంజనంగా మారింది. కాటమరాజు పాలించిన బంగారుకొండ కనిగిరి. పోరాటాల గడ్డ కనిగిరి. ఎంతో ఘన చరిత్ర ఉన్న కనిగిరి గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం..మనగళం..ప్రజాబలం. యువగళం అంటే జగన్ కి భయం, ఎందుకో చెబుతా. నన్ను అడ్డుకోమని పోలీసుల్ని పంపాడు…అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని నడిచిన నన్ను అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా? నా మైక్ లాక్కున్నారు… విశ్వ విఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి గొంతు ఆపే సత్తా ఎవడికైనా ఉందా? నా స్టూల్ లాక్కున్నారు…ఇది చంద్రబాబు గారి గుండె…తగ్గుతామా? తగ్గేదేలేదు. అన్ని ట్రై చేసాడు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు. నా యాత్ర కి ఐప్యాక్ టీం ని పంపించాడు. మన వాళ్లు పట్టేసారు. యువగళం మొత్తం లైవ్ లో వస్తుంది సైకో జగన్. ఇక్కడికొచ్చి ఐప్యాక్ ఎం పీకుతుంది? ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలను పిలిచి చితకబాదాడు.

ప్రకాశం జిల్లా లో యువగళం ప్రభంజనంలా సాగుతుంది. అడ్డుకోవడానికి ఎదో ఒకటి చెయ్యి అని చెప్పాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ వైసిపి నేతల్ని, వాలంటీర్లను రంగంలోకి దింపాడు. అర్ధరాత్రి దొంగల్లా ఫ్లెక్సీలు పెట్టారు. మన వాళ్లు పట్టేసారు. వాళ్లకి ఫ్లెక్సీలు వెయ్యడం కూడా రాదు. అందుకే అనేది వైసిపి ఒక చిల్లర పార్టీ. ఫ్లెక్సీలు మేము పెట్టలేమా? మేము పెడితే జగన్ కి గుండెపోటు వస్తుంది. జగన్ ఒక దొంగ..షర్మిలే వైఎస్ నిజమైన వారసురాలు..ఇట్లు షర్మిల ఫ్యాన్స్ అని ఫ్లెక్సీ వేయించమంటావా? అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు కొంటాడా? ఇట్లు విజయలక్ష్మి ఫ్యాన్స్ అని ఫ్లెక్సీ వేయించమంటావా? ఆఖరికి కనిగిరి సభకి ప్రజలు ఆటోల్లో వస్తుంటే ఒక్కో ఆటో కి 20 వేల ఫైన్ వేసారు. ఒక్క రూపాయి కట్టోద్దు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దొంగ చాలాన్లు అన్ని రద్దు చేస్తాం. మమ్మల్ని కెలకొద్దు నీకు నిద్ర లేకుండా చేస్తాం జగన్. నీకు ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర. కానీ ఇప్పుడు స్లోగన్ మార్చా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే వైసిపి కి అంతిమయాత్ర.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

చంచల్ గూడా జైల్ స్టూడెంట్ నంబర్ 6093 ఈ మధ్య జబర్దస్త్‌ కామిడీ చేస్తున్నాడు. మన యూనివర్సిటీలు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తో పోటీపడాలి అంటున్నాడు. అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? అరకులోయ డిగ్రీ కాలేజ్ లో పైకప్పు కూలింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిగెత్తి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పులిరాముడిగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ లో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ ని హత్య చేసారు. స్కూళ్ల‌లో టీచ‌ర్లు లేరు…చాక్ పీసుల‌కి దిక్కులేదు యూనివర్సిటీలను వైసిపి కార్యాలయాలుగా మార్చేసాడు. యూనివర్సిటీలకు చెందిన రూ.150 కోట్ల నిధులు పక్కదారి పట్టించాడు. కొత్తగా ఒక ప్రొఫెసర్ ని నియమించలేదు. టెన్త్ ఫెయిల్ జగన్ నీకు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి భారీ డైలాగులు అవసరమా? జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు. బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.

సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. ఇప్పుడు మీకో క్విజ్ పెడతాను. జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాష్ కి కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి. మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించాడనికి. నాలుగో ఆప్షన్. ఆల్ ది ఎబోవ్. ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. చెల్లిపై నిందలు వేసింది ఎవరు? జగన్. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.

అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.

2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.

యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.

పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. తాడిపత్రి వచ్చినప్పటి నుండి నాన్న కి టెన్షన్స్ పెరిగి ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నం చేసారని పెద్ద కుమార్తె భవ్యశ్రీ చెప్పింది. ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటే మిగిలిన వాళ్లు, సంఘాలు స్పందించలేదు. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు.

మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. వైసిపి నాయకులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చర్చకు రండి. ఎవరి హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందిందో చర్చకు నేను సింగిల్ గా వస్తా. కనిగిరిని అభివృద్ది చేస్తారని మీరు మధుసూదన్ ని భారీ మెజారిటీ తో గెలిపించారు.

మధుసూదన్ పాలనలో కనిగిరి లో అభివృద్ధి నిల్లు..అవినీతి ఫుల్లు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా కి కనిగిరి ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసారు. ఆయన అవినీతి గురించి తెలుసుకున్న తరువాత ఆయనకి మనీసూధన్ అని పేరు పెట్టాను. నియోజకవర్గం లో ఏ పని జరగాలి అన్నా మనీసూధన్ కి 20 శాతం కప్పం కట్టాల్సిందే. మనీసూధన్ సెంటు స్థలాల పేరుతో భారీ స్కాం కి పాల్పడ్డాడు.45 ఎకరాలు, ఎకరం రూ.3 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.15 లక్షలకు అమ్మేసి రూ.6 కోట్లు కొట్టేసాడు. కనిగిరి నియోజకవర్గంలో సెంటు స్థలాలు, మట్టి పనుల పేరుతో మనీసూధన్, ఆయన అనుచరులు రూ.100 కోట్లు లేపేసారు. మనీసూధన్ భూకబ్జాలకు సహకరించలేదని ఎమ్మార్వో సుధాకర్ గారిని సస్పెండ్ చేయించాడు. అవినీతి లో పిహెచ్డి చేసాడు మనీసూధన్. ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్లు వెయ్యకుండానే రూ.5 కోట్లు కొట్టేసాడు. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్రను కొట్టేస్తున్నాడు మనీసూధన్ వెలిగండ్ల మండలం తహసీల్ధార్ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్ 349/2 లో ఉన్న భూమిని మనీసూధన్ అనుచరుడు మురళి కబ్జా చేసి లేఔట్ వేసారు. కనిగిరి నియోజకవర్గంలో వందల ఎకరాల అసైన్డ్ భూములు, ఇసుక, మట్టి కొట్టేస్తున్నారు మనీసూధన్, ఆయన అనుచరులు.

పామూరు మండలం నర్రమారెళ్ల లో 70 ఎకరాల భూమి కొట్టేయడానికి స్కెచ్ వేసారు. బాధితులు కోర్టులో పోరాడుతున్నారు. రేషన్ బియ్యం మాఫియా కి మనీసూధన్ డాన్. పేదల బియ్యాన్ని ఎక్స్ పోర్ట్ చేస్తున్నాడు. కనిగిరి ని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసింది టిడిపి. కనిగిరి కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. వెలిగొండ పూర్తిచేసి సాగు, తాగునీరు అందిస్తాం అని చెప్పాడు. నీళ్లు ఇచ్చాడా? కనిగిరిలో డయాలసిస్ సెంటర్లలో వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చాడు. షార్ట్ సర్క్యూట్ అయితే కనీసం జనరేటర్ పెట్టి నడిపించే దిక్కు లేదు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు? ఒక్క కంపెనీ తెచ్చాడా? కనిగిరి నియోజకవర్గం లో వలసలు ఎక్కువుగా ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలు ఆపేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందిస్తాం. ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు పడుతున్న బాధలు నేను చూసాను. ఫ్లోరైడ్ సమస్య కు శాశ్వత పరిష్కారంగా టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం అన్ని వసతులతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన మేర డాక్టర్లను నియమిస్తాం. నిమ్మ, బత్తాయి, పొగాకు రైతుల కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తాం. కనిగిరి ప్రజల కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి డాక్టర్. ఉగ్ర నరసింహ రెడ్డి గారు. ప్రజలు కష్టాల్లో ఉంటే పలకరించేది మన ఉగ్ర నరసింహ రెడ్డి గారు.. ప్రతిపక్షంలో ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఉగ్ర నరసింహ రెడ్డి గారు. పేషెంట్ కి ఏ మందు వేస్తే జబ్బు తగ్గుతుందో మన డాక్టర్ గారికి బాగా తెలుసు. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎలా పరిష్కారం చెయ్యాలో కూడా ఆయనకే బాగా తెలుసు. వైసిపి నాయకులకు హెచ్చరిక జారీచేస్తున్నా మా ఉగ్ర నరసింహం జోలికి రావొద్దు. ఎవరినీ వదిలిపెట్టడు. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. రెడ్ బుక్ మా వద్ద ఉంది చట్టాలు అతిక్రమించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. పసుపు జెండాని మోస్తున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా. భయం నా బయోడేటా లో లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. జగన్ కి భయం పరిచయం చేసే బాధ్యత నాది.

 

Tags: kanigiri meetingkanigiri public meetingLatest Political NewsNara lokeshnara lokesh yuvagalam padayatraTelugu Desam Partyyuvagalam
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2023

Next Post

LIVE : Day-161: కనిగిరి/మార్కాపురం నియోజకవర్గాల్లో యువగళం సారధి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర.

మరిన్ని వార్తలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
ఆంధ్రప్రదేశ్

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
జూలై మూడో వారంలో తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్

జూలై మూడో వారంలో తల్లికి వందనం

చైతన్యరధం
@ June 17, 2026
అవకాశాలకు వేదిక అమరావతి
ఆంధ్రప్రదేశ్

అవకాశాలకు వేదిక అమరావతి

చైతన్యరధం
@ June 17, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ June 17, 2026
సెమీకండక్టర్ల తయారీకి ఏపీ గమ్యస్థానం
ఆంధ్రప్రదేశ్

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ గమ్యస్థానం

చైతన్యరధం
@ June 17, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist