- గ్రామ పెద్దలూ పాఠశాల అవసరాలు తీర్చాలి
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
- ఉప్పుమాగులూరు జెడ్పీ విద్యార్థులకు 208 సైకిళ్లు
అద్దంకి(చైతన్యరథం): నియోజకవర్గ పరిధిలోని బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 208 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయాణ భారంతో ఎవరూ పాఠశాలలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గ పరిధిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ముందుగా 8,9 తరగతుల విద్యార్థులకు మాత్రమే అనుకున్నా., చిన్నారుల కోరిక మేరకు 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ సైకిళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకూ దాతల సహాయం తో ఉచిత సైకిళ్లను అందించామన్నారు. ఒక్కొక్కరికీ రూ.6 వేల విలువైన సైకిల్‌ను అందించినట్లు చెప్పారు. మొత్తం 11,400 వరకు సైకిళ్లు అవసరం అవుతాయని, ఇప్పటికే 7 వేల మందికి పైగా అందించామన్నారు. త్వరలోనే మిగిలిన విద్యార్థులకు కూడా సైకిళ్లు ఇస్తామన్నారు. కిషోర్ గ్రానైట్స్ కంపెనీ ద్వారా వెయ్యి సైకిళ్లు, అసిస్ట్ అనే స్వచ్ఛంధ సంస్థ వెయ్యి సైకిళ్లు, సెయిల్ సంస్థ రెండు వేల సైకిళ్లు అందించిందని చెప్పారు.
కొన్ని కంపెనీల సీఎసఆర్ నిధులు, దాతలు అందించిన డబ్బుతో విద్యార్థులకు సహాయం చేశామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, మంచి యూనిఫాం, షూలు, బ్యాగులు అందించామని వెల్లడించారు. విద్యార్థులు కూడా మంచిగా చదివి పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించా రు. అదేవిధంగా ఉళ్లో ఉండే గ్రామ పెద్దలు పాఠశాలలను పట్టిం చుకోవాలని సూచించారు. చిన్న చిన్న అవసరాలను తీర్చి, స్కూళ్ల కు సహాయం చేయడానికి గ్రామ పెద్దలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఉప్పుమాగులూరు గ్రామంలో పెద్ద పెద్ద వ్యాపా రులు, డబ్బులు ఉన్నవారు కూడా ఎక్కువగానే ఉన్నారని చమత్క రించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.















