- విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం
బెంగళూరు (చైతన్య రథం): బెంగళూరు సర్జాపూర్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలోని గ్రీనఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ (గ్రేడ్-12) గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలోని స్పోర్ట్ కాంప్లెక్స్, ఆర్ట్ గ్యాలరీ, తరగతి గదులను మంత్రి సందర్శించారు. గ్రాడ్యుయేట్స్‌తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాడ్యుయేషన్ డే వేడుకలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలియజేసి సర్టిఫికెట్లు, ప్రత్యేక జ్ఞాపికలను ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌ను స్కూల్ ఛైర్మన్ బిజయ్ అగర్వాల్, ట్రస్టీస్ నీరు అగర్వాల్, మెహ్రోత్ర ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సత్వ గ్రూప్ ఎండీ, గ్రీనఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్ బిజయ్ అగర్వాల్, ప్రిన్సిపల్ షీలా అలెగ్జాండర్, వైస్ ప్రిన్సిపల్ నిషాంత్ నగవర్, మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నీరు అగర్వాల్, ట్రస్టీ ఎన్.మెహ్రోత్ర, ఐబీడీపీ కోఆర్డినేటర్ ఎస్.కావ్య తదితరులు పాల్గొన్నారు.














