- గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి
- బాధిత కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్
- ధైర్యంగా ఉండాలని, జీవితాంతం అండగా ఉంటానని భరోసా
మంగళగిరి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు, ఏ ఆపద వచ్చినా అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. గతేడాది కర్నూలు జిల్లా నన్నూరువద్ద విద్యుత్ షాక్ తగిలి మునగాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎమ్.అర్జున్ మృతిచెందాడు. అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రి పిలిపించారు. దివంగత అర్జున్ తల్లిదండ్రులు మస్టిక్ మద్దిలేటి, రాణితోపాటు సోదరి కోమలితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్జున్ మరణం బాధించిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అర్జున్ సోదరి కోమలి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, జీవితాంతం అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. తమ కుటుంబానికి అండగా నిలవడంపట్ల మంత్రి నారా లోకేష్‌కు అర్జున్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.















