చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రూ.5,244 కోట్లు నష్టం..తక్షణం సాయం చేయండి

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలు పంపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

by చైతన్యరధం
Nov 1, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రూ.5,244 కోట్లు నష్టం..తక్షణం సాయం చేయండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మొంథా తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
  • తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలు పంపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి (చైతన్యరథం) : మొంథా తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పంపారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ప్రస్తుతం ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని, పూర్తి స్థాయిలో వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడిరచింది. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రాథమిక నివేదికలో అంశాలవారీగా ఏయే శాఖలు, ఏయే రంగాల వారీగా ఎంతమేర నష్టం వాటిల్లిందన్న సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చింది. అలాగే, తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలను వివరించింది. ఆర్టీజీఎస్‌ నుంచి తుఫాన్‌ ప్రభావాన్ని గమనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుందో తెలియజేసింది. 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించినట్టు తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడిరచింది. రాష్ట్రంలోని 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్‌ ప్రభావం పడిరది. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది. తుఫాన్‌ వల్ల సంభవించిన నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు తుఫాన్‌ తీవ్రతను అద్దం పట్టేలా ఫోటోలను నివేదికతో జతపరిచి… తుఫాన్‌ నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కోరింది.

దెబ్బతిన్న 4,794 కి.మీ. ఆర్‌ అండ్‌ బీ రహదారులు
అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం… అత్యధికంగా రహదారులు, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో నష్టం సంభవించినట్టు పేర్కొన్నారు. తుఫాన్‌ వల్ల ముగ్గురు మరణించినట్టు వెల్లడిరచారు. 4,794 కి.మీ. మేర ఆర్‌ అండ్‌ బీ రహదారులు, 311 కల్వర్టులు-బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం రూ.2,774 కోట్ల మేర ఉందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీ రాజ్‌ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఈ శాఖకు రూ.454 కోట్ల నష్టం జరిగింది. 48 పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు విధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు వ్యయం కానుందని నివేదికలో చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం
వ్యవసాయ రంగానికి సంబంధించి 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని… దీంతో రూ.829 కోట్ల వరకు రైతులు నష్టపోయినట్టు నివేదిక చెబుతోంది. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుఫాన్‌ ప్రభావం చూపించింది. 12,215 హెక్టార్లలోని రూ.40 కోట్ల విలువైన ఉద్యానపంటలు దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగింది. ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. మరోవైపు 2,261 పశు సంపదను నష్టపోయారు.

విరిగిపడ్డ 2,817 విద్యుత్‌ స్తంభాలు
రాష్ట్రంలోని 2,817 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగ్గా, 26,575 డీటీఆర్‌లు ధ్వంసమయ్యాయి. 429 కి.మీ. మేర విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీని వల్ల విద్యుత్‌ శాఖకు రూ.19 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇక నీటిపారుదల శాఖకు రూ.234 కోట్ల మేర నష్టం కలిగింది. అలాగే, 23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమైనట్టు ప్రాథమిక నివేదికలో గుర్తించారు. అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి రూ.122 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు, 1,464 చోట్ల రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేయగా 1,36,907 మందికి పునరావాసం కల్పించారు. సహాయక చర్యల కోసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.32 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

Previous Post

కుంచనపల్లిలో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం

Next Post

శాస్త్రీయ విధానంలో పంట రక్షణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
విశాఖ.. ఇక సాంకేతిక పతాక!
ఆంధ్రప్రదేశ్

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక
ఆంధ్రప్రదేశ్

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
ఆంధ్రప్రదేశ్

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గింపునకు ప్రణాళికలు

చైతన్యరధం
@ April 28, 2026
వెల్కమ్ గూగుల్!
ఆంధ్రప్రదేశ్

వెల్కమ్ గూగుల్!

చైతన్యరధం
@ April 28, 2026
ఏయూ ఇనిస్టిట్యూషన్ కాదు.. ఎమోషన్!
ఆంధ్రప్రదేశ్

ఏయూ ఇనిస్టిట్యూషన్ కాదు.. ఎమోషన్!

చైతన్యరధం
@ April 28, 2026
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

విశాఖ.. ఇక సాంకేతిక పతాక!

చైతన్యరధం
@ April 28, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

చైతన్యరధం
@ April 28, 2026
మొక్కజొన్నను ఆదుకోండి

మొక్కజొన్నను ఆదుకోండి

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist