- కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సహించలేక కుట్రలు
- వైసీపీ నేతల వ్యాఖ్యలు చూసి సభ్యసమాజం చీదరించుకుంటోంది
- కల్తీ మద్యంతో ప్రాణాలు తీసిన జోగి..బీసీ కార్డు వాడుకోవడం సిగ్గుచేటు
- పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కిన పేర్ని నీతులు మాట్లాడుతున్నాడు
- చంద్రబాబు, లోకేశ్ గురించి తేడాగా మాట్లాడిన వారిని వదిలేది లేదు
- గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అశాంతి రగల్చేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ భ్రష్టుపట్టిపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి కులం, మతం ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్ల అరాచకం తర్వాత ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారు. పెట్టుబడులు వస్తున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో యువత ఆనందంగా ఉన్నా రు. అందుకే రాష్ట్రంలో అలజడులు సృష్టించడం కోసం దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు.
కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాల తో చెలగాటమాడిన జగన్‌రెడ్డి.. సిగ్గు లేకుండా నారా లోకేశ్ గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. మరోవైపు అంబటి రాంబాబు ఆంబోతులా రోడ్డుపై పడి విర్రవీగుతున్నాడు. వంగవీటి రంగా లాంటి మహనీయులతో పోల్చుకుంటూ రాష్ట్రంలో కులాల మధ్య అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు. పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కేసిన పేర్ని నాని కూడా నీతులు వల్లిస్తున్నాడు. బియ్యం బొక్కేసి డబ్బు కట్టేస్తే నీతి మంతుడిని అయిపోయాను అనేలా వ్యవహరిస్తున్నాడు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జోగి రమేష్ తాను బీసీనని మాట్లా డ్డానికి సిగ్గుపడాలి. ఐదేళ్లు బీసీలపై దాడులు జరిగినపుడు, పీకలు కోసినపుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలు, నోటి దురుసు చూసి వీళ్లేం నాయకులని ప్రజలు చీదరించుకుంటున్నారు. టీడీపీ నాయకులు ఎంతో సంయమనంతో ఉన్నారు. మా కార్యకర్తలలో ఆవేశం కట్టలు తెంచుకుంటే పరిస్థితిని ఊహించడం కూడా కష్టమనే విషయం వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి.
రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. అభివృద్ధి చూసి జగన్‌రెడ్డి కుళ్లుకుంటున్నాడు. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తుంటే చూడలేకపోతున్నారు. కులం, మతం ప్రాంతాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుం టున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లు అమరావతి, పోలవరం నిర్వీర్యం చేయాలనుకున్నాడు. తిరుమల దేవస్థానం ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన నీచుడు జగన్‌రెడ్డి. నెయ్యి కల్తీ గురించి వైసీపీ నేతలు మాట్లాడే ముందు.. నిబంధనలు ఎందుకు మార్చారో ముందు సమాదానం చెప్పాలి. తమ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి జేబులు నింపుకోవడం కోసం నెయ్యి లేని నెయ్యి సరఫరా చేశారు. చుక్క పాలు సేకరించని డెయిరీలకు డెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఇప్పుడు నిజాలు బయటకొస్తుండడంతో.. అరాచకాలకు పూనుకుంటున్నారు. జగన్‌రెడ్డి పాలనలో చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో.. రోజుకో రచ్చ చేస్తున్నాడు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటాం..అరాచకాలు సృష్టిస్తాం. కులాలు మతాలమధ్య చిచ్చు పెడతామని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.















