చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగనాసుర పాలిట పశుపతినే

కొత్తపేట ప్రజాగళంలో చంద్రబాబు నిప్పులు

by చైతన్యరధం
Apr 4, 2024 at 7:41am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగనాసుర పాలిట పశుపతినే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలకోసం ఎన్ని అవమానాలకైనా సిద్ధం
  • మానవాళి కోసం గరళాన్ని మింగినవాడినే..
  • రాక్షస చెరనుంచి రక్షించడమే నా లక్ష్యం
  • మత్తు పదార్థాలతో జాతిని నాశనం చేస్తున్నాడు
  • అప్పుడు కోడికత్తి.. ఇప్పుడు పింఛనుపై డ్రామాలు
  • కోనసీమలో కుల రాద్ధాంతాలు సృష్టించారు..
  • జనంతో ఆటాడుతున్న జగన్‌ను తరిమికొడదాం
  • కొత్తపేట ప్రజాగళంలో చంద్రబాబు నిప్పులు

రావులపాలెం (చైతన్యరథం): మానవాళి సంక్షేమా నికి పరమశివుడు గరళాన్ని మింగినట్టే.. ప్రజలను కాపాడుకోడానికి తానూ ఎన్ని అవమానాలు, అవహేళ నలు, దాడులనైనా ఎదుర్కొంటానని చంద్ర బాబు తీవ్ర స్వరంతో ఉద్ఘాటించారు. జగనాసుర చెరనుంచి ప్రజల ను రక్షించడానికే కంకణం కట్టుకున్నానని, అందుకు జగన్‌ పాలిట పశుపతినేనని చంద్రబాబు తీవ్రస్వరంగా అన్నారు. వైసీపీ ఎన్నికల సభలో ‘పశుపతి’ అంటూ జగన్‌ వ్యాఖ్యానించడపై చంద్రబాబు తీవ్రంగా స్పందిం చారు. మలివిడత ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా రావుల పాలెంలో గురువారం నిర్వహించిన సభలో వైసీపీ పాలనా వైఫల్యంపై చంద్రబాబు విరుచు కుపడ్డారు.జగన్‌ వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. ‘నాపై ఎన్నో రకాల దాడులు చేశారు. అవహేళనలు చేశారు. అటు పవన్‌ కల్యాణ్‌పైనా నిందలేశారు. మేము అన్ని రకాల అవమానాలను భరించాం. ఒకే నిబద్దత, ఒకే ఆలోచన తో నిలబడ్డాం.

తెలుగుజాతిని కాపాడు కోవాలనే లక్ష్యంతో అన్ని రకాల దాడుల్ని ఎదుర్కొన్నాం. దాడులు ఎదుర్కోవడమే కాదు, బుల్లెట్‌ మాదిరిగా దూసుకెళ్తున్నాం’ అని పరోక్షంగా జగన్‌కు అల్టిమేటం ఇచ్చారు. రాయలసీమ.. కోనసీమ.. ఇలా ఎక్కడ చూసినా ప్రజాగళానికి స్పందన చూస్తుంటే, గెలుపు మనదేన న్న ధీమా కళ్లముందు కనిపిస్తోంద న్నారు. ‘నూటికి నూరుశాతం అధికారంలోకి వస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రావులపాలెం అంటే గేట్‌ వే ఆఫ్‌ కోనసీమ. ఆకలితోఉన్న సింహం వేటకోసం ఎదురు చూసినట్లు, రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం చూస్తు న్నారు. రెండు బటన్లు నొక్కి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచి బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని కరతాళ ధ్వనులమధ్య చంద్రబాబు ప్రకటించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

కోనసీమను భ్రష్టుపట్టించారు
ప్రశాంతతకు మారుపేరైన కోనసీమను వైసీపీ గ్యాంగులు భ్రష్ణుపట్టించాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనిది దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, అక్రమకేసులు, వసూళ్లు, కుల రాజ కీయాలు, మాఫియా, గంజాయి, డ్రగ్స్‌ దారుణాలు కోనసీమకు వచ్చాయని, ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతికి.. అక్కడ జగన్‌రెడ్డి అవినీతికి అంతు లేకుండా పోయిం దన్నారు. ‘జగన్‌ గ్యాంగ్‌ మహా దోపిడీకి రాష్ట్రం బలై పోయింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది ప్రజల కోసమే. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మొదటి నుంచీ ఒకే మాటపై ఉన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నాం. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. పూర్వ వైభవం కల్పించాలన్నదే తెలుగుదేశం ఏకైక లక్ష్యం’ అని చంద్రబాబు ఉద్వేగం గా ప్రకటించారు.

శవ రాజకీయాలకు పేటెంట్‌ జగన్‌
గత ఎన్నికల సమయంలో బాబాయిని గొడ్డలితో నరికి చంపి సానుభూతితో గెలిచాడు. ఆ విషయాన్ని జగన్‌ రెడ్డి చెల్లెలే బయటపెట్టింది. షర్మిలను ఎంపీగా నిలబెట్టమన్నందుకే హత్య చేశాడని చెప్పింది. సొంత బాబాయిని చంపే వారు మనకు అవసరమా? కోడికత్తి డ్రామాలాడే వ్యక్తులు మనకు అవసరమా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. వద్దు వద్దు అంటూ ప్రజల నుంచి సమాధానం రాబట్టారు. కొత్తగా పింఛన్‌ వ్యవస్థ పై రాజకీయం మొదలు పెట్టాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ రూ.30తో పెన్షన్‌ మొదలు పెడితే.. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక రూ.2000కు పెంచాను. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు వేలు ఇస్తానని ఆశపెట్టి, దిగిపోయే సమయానికి రూ.3000కు తీసుకొచ్చాడు. అదే నేను అధికారంలోక వచ్చి ఉంటే.. తొలి రోజున రూ.3000 అందించే వాడిని. ఇప్పుడు మాటిస్తున్నా.. రేపు అధికారంలోకి రాగానే రూ.4000 ఇస్తా అని చంద్రబాబు హర్ష ధ్వానాల మధ్య హామీ ఇచ్చారు.

పింఛను పంపిణీ విషయంలో వైసీపీ దిగజారుడు రాజకీయానికి తెగ బడిరదని విమర్శించారు.వాలంటీర్లు రాజకీయం చేయ డానికి వ్యతిరేకం తప్ప, వాలంటీర్ల వ్యవస్థకు కాదని, రాజకీయాలకు తటస్థంగా ఉండాలని సూచించారు. ‘అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని చెప్పాను. బాగా చదువుకున్న వారు కూడా రూ.5 వేల వాలం టీర్లుగా ఉండిపోయారు. అలాంటి వారికి ఉన్నత జీవితం కల్పిస్తానన్నాను. దీంతో వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా వాడుకోవడానికి ప్రయత్నించారు. వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని, ప్రభుత్వ ఉద్యోగులే చెల్లించాలని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. గ్రామ సచివాలయాల్లో 1.30లక్షల ఉద్యో గులున్నారు. ఒక్కొక్కరు సగటున 40 మందికి ఇస్తే ఒకట్రెండు రోజుల్లో పూర్తైపోతుంది. కానీ, కోడి కత్తి డ్రామా కమల్‌ హాసన్‌ ఏం చేశాడో చూస్తున్నాం. బాబా యిని చంపి సానుభూతితో ఓట్లు అడిగాడు. కోడికత్తితో మరికొంత సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధు ల్ని చంపేసి.. మనవల్ల చనిపోయారని డ్రామాలాడేం దుకు కోడికత్తి కమల్‌ హాసన్‌ ప్రయత్నిస్తున్నాడు’ అని జగన్‌పై విరుచుకుపడ్డారు.

టీడీపీ కడుపు నింపితే.. జగన్‌ కడుపు కొడుతున్నాడు
అధికారులు, చీఫ్‌ సెక్రటరీ ఈ డ్రామాలకు సహక రించడం సిగ్గుచేటు. ఒక్క నెల ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వలేరా? ప్రతిపక్షాలపై బురదజల్లడం కోసం పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు అన్న క్యాంటీన్లతో పేదలందరికీ రూ.5కే కడుపు నిండా అన్నం పెట్టాం. మూడు పూటలా భోజనం చేస్తే అయ్యే ఖర్చు నెలకు రూ.450. అంటే ఇంకా రూ.1550 మిగిలేది. కానీ నేడు అన్న క్యాంటీన్లు ఎత్తే శాడు. పైగా వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. శవ రాజకీయాలు, తప్పుడు రాజకీయాలను ఎండ గట్టాలి. ఫేక్‌ ప్రచారాలు, తప్పుడు హామీలతో రాజకీయ లబ్దిపొంది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రభుత్వ ఖజానా మొత్తాన్ని ఖాళీ చేశాడు. ఈరోజు 3వ తేదీ. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చావా?పెన్షన్లు ఇచ్చావా? ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయా? నాటకా లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోను. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు వులకు ప్రజలంతా అండగా నిలవండి. పెన్షన్లు అందుకునే వరకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

కోనసీమలో కులం పేరుతో రాద్దాంతం సిగ్గుచేటు
జగన్‌రెడ్డి సైకో మనస్తత్వంతో ఏ ఒక్కరూ కంటి నిండా నిద్రపోయింది లేదు. పోలీసుల్ని గోడలు దూకించి.. ఏమీ లేని చోట కూడా కేసులు పెట్టి అవస్థలపాలు చేశాడని దుయ్యబట్టారు. నాకు నచ్చిన ప్రాంతం కోనసీమ. ప్రశాంతకు మారుపేరుగా ఉండే ప్రాంతమిది. అలాంటి కోనసీమలో చిచ్చు పెట్టారు. కులం పేరుతో రాద్దాంతం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన జగన్‌కు రైతు, రైతు కూలీ ఓటేస్తారా? అని నిలదీశారు. సబ్సిడీలు లేవు? నీళ్లు రావు, గిట్టుబాటు ధరలు అందవు. రూ.12500 ఇస్తానని చెప్పిన ఈ దొంగ కేంద్రమిచ్చే రూ.6000ను తన ఖాతాలో వేసుకున్నాడు. మనం కట్టిన ఇళ్లకు రంగులేసుకుని రిబ్బన్లు కట్‌ చేసుకున్నాడు అని విమర్శించారు. దేశంలోనే అత్యధిక అప్పులుగల రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రతి రోజూ సగటున మూడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎక్కడి నుండో వచ్చిన కాటన్‌ దొర ధవళేశ్వరం బ్యారేజీ కట్టినందుకు దేవుడిలా కొలుస్తు న్నారు.

అలాంటి ప్రాంతంలో క్రాప్‌ హాలిడే ప్రకటించిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని చంద్రబాబు నిప్పులు చెరి గారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం కట్టే బాధ్యత మనకి వచ్చిందని, ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. 2020 టార్గెట్‌ పెట్టుకుని పనులు చేప ట్టామని వివరిస్తూ, తాను అధికారంలోవుండి ప్రాజెక్టు పూర్తైవుంటే గోదావరి జిల్లాల్లో మూడు పంటలు పండే వన్నారు. కానీ, జగన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుని నిర్వీ ర్యం చేశాడని, ధాన్యం సేకరణకు సంచులు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన స్థితిలో జగన్‌రెడ్డి ఉన్నాడని ధ్వజ మెత్తారు. ధాన్యం అమ్ముకోవాలంటే కూడా ఎదురులం చాలివ్వాల్సిన దుస్థితి కల్పించాడన్నారు. క్వార్టర్‌ బాటిల్‌ ఇచ్చి, కులం, మతం ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టి చలికాచుకోవాలని జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. రావుల పాలెంలో రెడ్లు ఎక్కువ. జగ్గిరెడ్డికి తప్ప ఏ రెడ్డికైనా న్యాయం జరిగిందా?కాంట్రాక్టర్లు,ఫైనాన్షియర్లు, వ్యాపా రస్తులు అంతా నాశనమైపోయారు. తాను బాగుంటే చాలు అనేలా జగన్‌ వ్యవహరిస్తున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

ఆక్వాను ఆదుకునే బాధ్యత నాది
కోనసీమలో 2లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దేశంలోనే ఆక్వా ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. జగన్‌రెడ్డి వచ్చాక ఖర్చు మూడు రెట్లు పెరిగిం ది. మద్దతు ధర రావడం లేదు. సీడ్‌, మందులు, సెస్‌ అన్నీ పెంచేశాడు. రూ.300వచ్చే కరెంటు బిల్లు రూ.1500 అయింది. ఆక్వా రంగం కుదేలైంది. రూ.1.50కి యూనిట్‌ ఇస్తానని జోన్‌, నాన్‌ జోన్‌ అంటూ నిబంధనలు పెట్టి మోసం చేశాడని విమర్శిం చారు. నేను హామీ ఇస్తున్నా. ఆక్వరంగాన్ని కాపాడుతా. రూ.1.50కే యూనిట్‌ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఆర్టీసీ, పెట్రోల్‌ డీజిల్‌, లిక్కర్‌ సహా అన్ని ధరలూ పెరిగాయి. కానీ ప్రజల ఆదాయ పెరగలేదు. ఇలాంటి దుర్మార్గుడు ఉంటే, మన బతుకులు చితికిపోతాయి. జాగ్రత్తపడాలని చంద్రబాబు హితవు పలికారు.

బడుగు వర్గాల సంక్షేమం నా బాధ్యత
నా బీసీలు అంటూనే 30 సంక్షేమ పథకాలు రద్దు చేశాడని, నా ఎస్సీ అంటూనే ఇదే కోనసీమలో అంబేద్కర్‌ని అవమానించాడని, జగన్‌ చూపించే ప్రమ అదేనని వివరించారు. దారుణాన్ని అడ్డుకున్న యువకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టాడంటూనే, ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్‌ డెలివరీ ఇచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. దళితులకు ఎవరికైనా పైసా ప్రయోజనం కలిగిందా? అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోందా? సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారు. కేంద్ర పథకాలు జగన్‌రెడ్డి దూరం చేశాడని దుయ్యబట్టారు. దళితులకు సబ్‌ ప్లాన్‌ పక్కాగా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. గోదావరి జిల్లాలో భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇచ్చి తీరుతా. శెట్టి బలిజలకు ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో అవకాశం కల్పించాం. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.

పేదరికం లేని సమాజమే నా లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ‘మైనార్టీలకు ఇచ్చే రంజాన్‌ తోఫా, దుల్హన్‌ లాంటి పథకాలు ఎత్తేసి నా మైనార్టీ అంటాడు. కాపులకు జగన్‌ రెడ్డి ఏం న్యాయం చేశాడో చెప్పగలరా? రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాని చెప్పిన జగన్‌రెడ్డి కాపులకు పైసా ఖర్చు చేయలేదు. ఇలాంటి రాజకీయాలు చేసే వారి మాటలు ఇంకా వింటామా? కాపులకు ఎవరేం చేశారో.. ప్రజలకు చెప్పే ధైర్యం ఈ వైసీపీ నేతలకు ఉందా?’ అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట. కాపుల్లో కూడా పేదలు ఉన్నారనే లక్ష్యంతో కాపులకు న్యాయం చేశాం. అప్పులు చేసి పంచడం కాదు.. సంపద సృష్టించి, ఆదాయం పెంచి పేదలందరికీ పంచుతాను. ఇచ్చిన ప్రతి రూపాయిని రెట్టింపు చేసుకునేలా మార్గాలు చూపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

11సార్లు డీఎస్సీ వేసింది టీడీపీ. మరి నువ్వు?
డ్వాక్రా సంఘాలు తెచ్చి ప్రతి మహిళకు ఆర్దిక స్వాతంత్య్రం కల్పించింది తెలుగుదేశం. ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్‌. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ తెచ్చింది ఎన్టీఆర్‌. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టి చదువుకునేలా ప్రోత్సహించింది తెలుగుదేశం. వంట గ్యాస్‌ ఇచ్చింది టీడీపీ. మరుగుదొడ్లు కట్టించి తోడుగా నిలిచింది తెలుగుదేశం. కొత్త బిచ్చగాళ్లు వచ్చి అంతా నేనే చేశానంటున్నాడు. నేనేం చేశానని సైకో అడుగుతున్నాడు. 8సార్లు డీఎస్సీ ఇచ్చాను. ఎన్టీఆర్‌ 3 డీఎస్సీలు పెట్టారు. ఇప్పుడున్న టీచర్లలో 75శాతం నేను నియమించిన వాళ్లే. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ రెడ్డి ఒక్కటంటే ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. ఒక్క డీఎస్సీ పెట్టలేని, ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మ నా గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ప్రజా జీవితాలు మార్చేలా సూపర్‌ సిక్స్‌
‘ఆడబిడ్డ నిధితో ప్రతి ఆడ బిడ్డకూ నెలకు రూ.1500 చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తాను. ఆదాయం పెంచడానికి మార్గాలు చూపిస్తాను. గతంలో రూపాయి రూపాయి పొదుపు చేయమన్నాను. రివాల్వింగ్‌ ఫండ్‌ ఇచ్చా. ఇప్పుడు ఆ సొమ్ము వేల కోట్లుగా చేరింది. తల్లికి వందనంతో బడికి వెళ్లే ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు ఇస్తాను. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందించే బాధ్యత తీసుకుంటాను. ప్రతి మహిళకూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాను. మా చంద్రన్న ఇచ్చిన రైట్‌ ప్రకారం బస్సు ఎక్కుతున్నట్లు చెప్పి ధైర్యంగా బస్సు ఎక్కండి’ అంటూ చంద్రబాబు తాను అమలు చేయబోయే సూపర్‌ సిక్స్‌ను వివరించారు.

యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగికీ రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని హామీ ఇస్తున్నా. జాబు రావాలంటే బాబు రావాలనేది మా నినాదం. 40 రోజులు ప్రతి యువకుడూ పార్టీ కోసం పని చేయాలి. సైకిల్‌ ఎక్కి కదలండి. 175 అసెంబ్లీ అభ్యర్ధులూ రాష్ట్రాన్ని రక్షించుకునే సైనికులు. 175 అసెంబ్లీ సీట్లు గెలవాలి అని బాబు పిలుపునిచ్చారు. అన్నదాతకు ఏటా రూ.20 వేలు అందించి రైతే రాజు అనేలా తీర్చిదిద్దుతా. ఇంటింటికీ మంచినీరు అందిస్తా. పేదరికం లేని సమాజ నిర్మాణానికి పని చేస్తా. పేదరికం లేకుండా చేస్తా. పన్నుల బాదుడు ఉండదు. కరెంటు ఛార్జీలు పెంచం. నాణ్యమైన కరెంటు ఇస్తానని ప్రామిస్‌ చేశారు.

Previous Post

మా నాన్నకు చంపిందెవరో అందరికీ తెలుసు

Next Post

మానవత్వం లేని జగన్‌రెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist