- పింఛన్లు పెంచుతామని మడమతిప్పారు
- నేడు నీలి మీడియాలో దిగజారుడు రాతలు
- రూ.6 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే
- 18 నెలల్లోనే రూ.50 వేల కోట్ల ఖర్చు చేశారు
- మంత్రి దోలా బాలవీరాంజనేయస్వామి
అమరావతి (చైతన్యరథం): దివ్యాంగుల పింఛన్లపై నీలి మీడియా దిగజారుడు రాతలు సిగ్గుచేటని దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి దోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగిం చిందని జగన్ అండ్ కో బ్లూ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కర పింఛను తొలగించలేదు. సదరం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే. పింఛన్ల కోసం జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే రూ.50 వేల కోట్ల ఖర్చు చేసింది. దివ్యాంగులకు సీఎం చంద్రబాబు 7 వరాలు ప్రక టించడంతో వారంతా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పాలాభిషేకాలు చేస్తూ చిత్రపటాలకు సంబరాలు జరుపుకుంటున్నారు. అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారు. పింఛన్ల పెంపుపై నాడు మాట తప్పి దివ్యాంగులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ రెడ్డి వైసీపీ హయాం లో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము దిగ మింగారు, తప్పుడు రాతలు, అసత్య ప్రచారాలతో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నీలి మీడియాని ప్రజలు చీత్కరిస్తున్నారని మండిపడ్డారు.
















