- చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకే బిల్లు
- ఏ కుటుంబానికీ అన్యాయం జరగకూడదనే నిర్ణయం
- శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
- నియామకాల సవరణ బిల్లుకు ప్రతిపాదన
అమరావతి(చైతన్యరథం): పల్నాడులో బీసీ నాయకుడు తోట చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీనే కాదు..దేశమే చూసింది..వీడియో రికార్డు కూడా ఉంది. అటువంటి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించా లని మేము నిర్ణయించాం..ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లును తెస్తున్నామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపై కేవలం టీడీపీ లోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. క్యాబినెట్‌లో కూడా పవనన్నతో మాట్లాడితే మంచి నిర్ణయమని చెప్పారు. ఫ్యాక్షన్‌లో చనిపోయిన వారి కుటుం బాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే వారి జోలికి రావడానికి ప్రత్యర్థు లు భయపడతారని భావించి క్యాబినెట్‌లో చర్చించి ఈ బిల్లు తీసుకువచ్చాం. క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. శాసనసభ కు తీసుకువచ్చాం. 2025 సెప్టెంబరులో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
బీసీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని మేం కౌన్సిల్ కు బిల్లు పంపిస్తే..అక్కడ కావాలని ముందుకు వెళ్లకుండా అడ్డుకు న్నారు. బిల్లును వారు మండలిలో తిరస్కరించినా నిబంధనలకు లోబడి మేం అసెంబ్లీలో పాస్ చేస్తామని చెప్పాం. కానీ, బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోకుండా అక్కడ తొక్కిపట్టారు. దీంతో ఒక బాధ్యత గా భావించి మళ్లీ ఈ బిల్లు శాసనసభకు తీసుకొచ్చాం..దీనిని ఎవరూ ఆపలేరు. దీనిపై ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉందని తెలిపారు. ఒక్క తోట చంద్రయ్య కుటుంబానికే కాదు, ఏపీలో ఏ కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరగకూడదన్నదే మా లక్ష్యం. ఇది ఒక ఫేవర్, చారిటీ కాదు..ఇది మనందరి బాధ్య త. ఫ్యాక్షన్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.
కుటుంబాలను రోడ్డుపైకి తేవడమే ఫ్యాక్షనిస్టుల లక్ష్యం
ఏ పార్టీకి చెందిన వారైనా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసి పెద్దదిక్కు లేకుండా చేసి యావత్ కుటుంబా లను రోడ్డుపైకి తేవడమే ఫ్యాక్షనిస్టుల ప్రధాన లక్ష్యం. 2019-24 నడుమ కూడా ఫ్యాక్షన్ దాడులు పెద్దఎత్తున కొనసాగాయి. బలహీనవర్గాలకు చెందిన బీసీ నాయకుడు, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న నడివీధి లో మెడపై కత్తితో నరికి దారుణంగా హతమార్చారు. హత్య చేసే సమయంలో వారి నాయకుడికి జై కొడితే వదిలేస్తామని ఒత్తిడి తెస్తే.. నేను చచ్చిపోయినా ఫర్వాలేదు, పసుపుజెండా వదలనని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఆనాడు జై చంద్రబాబు, జై తెలుగు దేశం అన్నందుకు అతి కిరాతకం చంపేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
వైఎస్ హయాం నుంచే ఫ్యాక్షన్
అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యక నేను 1983లో జన్మించా. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను రాజకీయాలను క్లోజ్‌గా గమనిస్తూ వచ్చా. అంతకుముందు ఫ్యాక్టన్ రాజకీయా లకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో ఆనాడు యుద్ధం ప్రకటించారు. ఒక పక్క ఫ్యాక్షనిజం, మరోపక్క నక్సలి జంపై పోరాడారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సంవత్సరాల్లో 164 మంది టీడీపీ కార్యకర్తలను అతిదారుణంగా, కిరాతకంగా చంపేశారు. ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురంలో ఈ మారణాకాండ ఎక్కువగా జరిగింది. మా నాయకులు ఒకరువెళ్లి హత్య జరిగిన కుటుంబాన్ని పరామ ర్శించే లోపు మరో కుటుంబంలో హత్య జరిగిందని కబురు వచ్చేది.. అలా ఆనాడు హత్యల పరంపర కొనసాగింది. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలు మళ్లీ ఆ మార్గంలో వెళ్లకూడదనే ఉద్దేశంతో వారి పిల్లల కోసం చంద్రబాబు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మోడల్ స్కూలు ఏర్పాటు చేశారు. ఆ పిల్లలను సొంత పిల్లల మాదిరి ప్రత్యేక శ్రద్ధతో చదివించారు, మాకు కూడా అంత సమయం ఇవ్వలేదు. ఫ్యాక్షన్ దాడుల్లో చనిపోయిన వారి పిల్లలను పరామ ర్శించేందుకు నెలకు ఒకసారి స్కూలుకు వెళ్లి వారి బాగోగులు చూసుకునే వారు. వారికి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్‌లోకి వెళ్లవద్దని హితవు పలికారు. ఇటువంటి ప్రయత్నం భారతదేశం లో ఏ రాజకీయ పార్టీ చేయలేదు..కేవలం ఒక తెలుగుదేశం మాత్రమే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు.















