చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాజకీయాలకు అనర్హుడు జగన్‌

కుప్పం నియోజకవర్గం శాంతిపురం సభలో చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
December 30, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాజకీయాలకు అనర్హుడు జగన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ల్యాండ్‌ టైటిల్‌ చట్టం తెచ్చింది భూములు దోచుకునేందుకే
  • ప్రజలకు ఇచ్చేది గోరంత.. పబ్లిసిటీ కొండంత
  • కుప్పం అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యం
  • ఎక్కడికక్కడ కబ్జాలు, దోపిడీలు
  • నేను సీఎం అయ్యాక వీళ్లను వదిలిపెడతానా?
  • కుప్పం నియోజకవర్గం శాంతిపురం సభలో చంద్రబాబు

శాంతిపురం: జగన్‌ లాంటి పాలకుడు రాజకీయాల కు అనర్హుడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికే జగన్‌ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని అన్నారు. ల్యాండ్‌ టైటిల్‌ చట్టంతెచ్చింది భూము లు దోచుకునేందుకేనని మండిపడ్డారు.ప్రజలకు ఇచ్చేది గోరంత..పబ్లిసిటీ మాత్రం కొండంత అని అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం శాంతిపురం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో జరిగిన సభలో చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ శాంతిపురం నాకు కొత్త కాదు ఎప్పుడూ వస్తూనే ఉంటాను.. కానీ మీలో ఈ సారి ప్రత్యేకమైన అభిమానం కనబడుతోందన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. ఈ రెండు రోజుల్లో మన కార్యకర్తల ఉత్సాహం చూశాక కుప్పంలో టీడీపీకి లక్ష ఓట్ల మెజార్టీ కష్టం కాదనిపి స్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జెండా రెపరెపలాడే నియోజకవర్గాలు రెండున్నాయి…ఒకటి కుప్పం..రెండోది హిందూపురం.హిందూపురం ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం..రెండోది మీ అభిమానంతో నేను చెలిచే కుప్పం నియోజకవర్గం. 7 సార్లు నన్ను గెలిపించారు. అంతకు ముందు కుప్పంలో 2 సార్లు టీడీపీని గెలిపించారు. నేను ఇక్కడ కులం, మతం, చూడకుండా మీ పెద్ద కొడుకుగా ఉండాలని పని చేశాను.ఈ నియోజకవర్గంలో ఎవరికీ దక్కని అభి మానం నాకు  దక్కింది. నన్ను నామినేషన్‌ వేయడానికి కూడా రావద్దని చెప్పి గెలిపించిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేము గెలిపించుకుంటాం.. మీరు రాష్ట్రంలో తిరగండి.. మళ్లీ సీఎంగా రావాలని కోరుతున్నారు. తెలుగుజాతికి కుప్పం ఒక ప్రయోగశాల. రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఆ స్ఫూర్తి నిచ్చే ప్రజానీకం కుప్పంలో ఉంది. నా స్ఫూర్తి ప్రదాతలు మీరే. 25ఏళ్ల క్రితం ఇజ్రా యిల్‌ టెక్నాలజీ తీసుకొచ్చాం. మన నియోజకరవర్గా నికి మంచి వాతవారణం దేవుడు ఇచ్చాడు. బంగారం పండిరచే రైతులు ఉన్నారు. మంచి భూములు ఉన్నా యి. చేయూతనిస్తే ఏమైనా చేయగలుగుతారని మొదటి ప్రాజెక్టుగా ఇజ్రాయిల్‌ టెక్నాలజీని ఇక్కడికే తీసుకొచ్చా ను. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల అన్నీ పోయా యి. గుండుసున్నా పెట్టింది. తుంపర సేద్యానికి ప్రాధా న్యం ఇచ్చాం.. దీంతో అధిక దిగుబడి సాధించే అవకా శం వచ్చింది. కుప్పంలో పండని పంటే లేదు. ఈ ప్రాంతంలో సెరీ కల్చర్‌రావాలి…పట్టు పరిశ్రమ కూడా రావాలన్నది నా కల. మొదటి ఎన్నికల సమయంలో కుప్పం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే, ఊర్ల గత చరిత్ర తెలుసుకుంటే పరిస్థితి తెలుస్తుంది. గతంలో కుప్పం-వి.కోట-పలమనేరు రోడ్డు మాత్రమే ఉండేది. ఏ ఊర్లోనూ స్కూళ్లు లేవు..కానీ నేను వచ్చాక నిర్మించాను. మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది..కానీ కుప్పం పట్ల ఇప్పుడు సీత కన్ను ప్రద ర్శిస్తున్నారు. 2004లో నేను ఓడాక ఇజ్రాయిల్‌ టెక్నాల జీని మూసేయడంతో అది గుజరాత్‌కు తరలిపోయిం దని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నీకు బాధ్యత లేదా జగన్‌?

టీడీపీ అధికారంలో ఉండుంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేవి. 2014కు ముందు హంద్రీనీవాను పట్టించుకోలేదు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన హంద్రీనీవా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాను. వి.కోట దాకా నీళ్లువచ్చాయి…87శాతం పను లు పూర్తయ్యాయి. 13శాతం పనులు పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైసీపీ. కుప్పం అంటే మీకు ఎందుకు చిన్నచూపు? కుప్పం కంటే ముందు పులివెం దులకు నీళ్లు ఇస్తానని చెప్పి నేను నీళ్లు ఇచ్చా…నీకు బాధ్యత లేదా జగన్‌? ఎందుకు ఈ నిర్లక్ష్యం.ఇది ఎవరి పాపం? మిగిలిన 13శాతం పనులు పూర్తిచేసి ఉండుం టే నీళ్లు వచ్చేవి. చెరువులకు నీళ్లు కూడా అందేవి. పాలార్‌ నదిపై 35చెక్‌ డ్యాములు నిర్మించాము.. కుప్పంలో కరువు అనేది లేకుండా చేయాలని చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏమొచ్చింది మీకు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల పేరుతో దోపిడీ

ఇక్కడకు తరచుగా మంత్రి పెద్దిరెడ్డి పరుగెత్తుకు వస్తాడు..మన మీద ప్రేమతో కాదు.. గ్రానైట్‌ మీద ప్రేమతో. లెక్కలు తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అం దరికీ మద్యం తాగించి ఆస్తులు దోచుకోవడానికి వస్తా డు. వైసీపీ నేతలకు ప్రజలకు మంచి చేయాలని లేదు. ప్రజల పేరుతో దోపిడీ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి గతంలో అక్రమక్వారీలను చూపించాను..అయినా చర్య ల్లేవు. ఇసుక మద్య, మైనింగ్‌, భూములు ఏది వీళ్ల కళ్లల్లో పడ్డా అది మటాష్‌ అవ్వాల్సిందే. ఆవులపల్లి ప్రాజెక్టు పుంగనూరులో ఉంది. రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూములకు పరిహారం ఇవ్వాలి. కానీ అలా చేయకుండా రూ.2,002 కోట్లకు టెండర్‌ పెట్టారు. ఆవులపల్లి, నీటిగుంటపల్లి, ముదివీడు ప్రాజెక్టులకు అనుమతులు లేవు. అనుమతులు లేకుండా పనులు చేపట్టారు. రైతులను బెదిరించి ఆ ప్రాజెక్టు కడితే రైతు లు కోర్టుకు వెళ్లారు. దీంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వంద కోట్ల రూపాయల ఫైన్‌ వేసింది. ఒక వ్యక్తి దుర్మా ర్గానికి, అన్యాయానికి,అరాచకానికి ప్రజాధనం రూ.25 కోట్లు ఫైన్‌గా చెల్లించారు. హంద్రీనీవా కింద రూ.5,5500 కోట్లపనులు మంత్రి పెద్దిరెడ్డికి ఇచ్చారు. వీళ్లు దోపిడీ దొంగలు, గజ దొంగలు..రూ.15 వందల కోట్లు పనులు చేయకుండా డబ్బులు మార్చుకున్నారు. ఎవర్నీ వదలను. మీరు దోచిన డబ్బులు కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

ఎక్కడికక్కడ కబ్జాలు

కుప్పం నియోజకవర్గంలోని సాదు గ్రామంలో 35 ఎకరాల డీకేటీ భూమిని వైసీనీ నేతలు కబ్జా చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు బుల్లెట్‌ దండపాణి అనే వ్యక్తి నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వ భూమి కొట్టేశాడు. ఈశ్వర దేవాలయం భూముల్ని కూడా కబ్జా చేశారు. ఎంపీ నిధులతో బస్‌ షెల్టర్‌ కడితే భూమికి జాగా కావా లని దాన్ని కూడా కొట్టేశారు.చిందుబల్ల పంచాయతీలో పొలం దారిని కూడా కబ్జా చేసి షెడ్లు నిర్మించారు. ఏడోమైలులో 6.6 ఎకరాలు ఆక్రమించుకుని షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించుకున్నారు. ఏపీఐఐసీకి చెందిన 4 ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేశారు. పోలిశెట్టిగాని పల్లెలో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్‌ చేస్తే ప్రజలే తిరగబడ్డారు. మన నియోజకవర్గం ప్రశాంతమైంది. నేను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు ఇబ్బంది వచ్చిందా? కానీ ఐదేళ్లుగా కుప్పంలో రౌడీ ఇజం, కబ్జాలు పెరిగాయి. యువతను పెడదారి పట్టిస్తున్నారు. 220 కేబీ సబ్‌ స్టేషన్‌, బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ఐటీఐ బిల్డింగ్స్‌, రాళ్లబొదుకూరులో జూనియర్‌ కాలేజీ, ఏపీ మోడల్‌ కాలేజీలు, కళ్యాణ మండపాలు లాంటి ఎన్నోరకాల అభివృద్ధి పనులు చేశాం. రాళ్ల గంగమ్మ గుడికి 5 సెంట్లు ఇస్తే దాన్ని రద్దు చేశారు. గ్రామాలు శుభ్రంగా ఉండాలని చెత్తసేకరణ షెడ్లు కూడా నిర్మించాను. రూ.2కే 20 లీటర్ల నీళ్లు ఇస్తే వైసీపీ వచ్చాక దాన్ని నాశనం చేశారు. శాంతిపురం`గడ్డూరు నుండి కర్నాట క బార్డర్‌ దాకా డబుల్‌ రోడ్డు అడిగారు.. వేయిస్తా. శివరామపురం నుండి కొలమడుగు వరకు కూడా డబుల్‌ రోడ్డువేస్తాం. రాళ్లపల్లి నుండి గోవింద పల్లికి  కూడా డబుల్‌ రోడ్డు వేస్తా. ఇప్పుడు రూపొందిం చే ప్రణాళిక అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. శాంతిపురంలోని ఖాళీ భూములను గుర్తించి వాటిల్లో పరిశ్రమలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను. యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా.? పరిశ్రమలు వచ్చాయా..డీఎస్సీ నిర్వహించారా? మీకు ఆవేశం, కోపం వస్తే వైసీపీ నేతలు బయటకు కూడా రాలేరు. నాడు నేను మీకు నిరుద్యోగ భృతి ఇచ్చాను..6 లక్షల ఉద్యోగాలు కూడా అందించాను..అది ఈ ప్రభుత్వమే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించింది. సీఎంకు ఉద్యోగం కావాలి..మంత్రులకు ఉద్యోగం కావాలి..రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి కానీ రాష్ట్రంలోని యువతకు మాత్రం ఉద్యోగాలు రాకూడదా.? మళ్లీ అధికారంలోకి రాగానే రూ.3 వేల నిరుద్యోగ భృతితో పాటు 20 లక్షల ఉద్యోగాలు అందిస్తాం. యువత మొత్తం జాబు రావాలంటే..బాబు రావాలని అంటున్నారని చంద్రబాబు అన్నారు.

రైతే రాజు అవుతాడు

ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు పండుతాయి. అధికారంలోకి రాగానే హంద్రీనీవా నీళ్లు తీసుకొస్తా..లిఫ్ట్‌ ద్వారా అన్ని చెరువులకు నీళ్లు అందిస్తా. వాణిజ్య పంటల కోసం మార్కెట్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం..మార్కెట్‌ యార్డ్‌ పెట్టి ఎగుమతులు పెంచుతాం. అధికారంలోకి రాగానే విమానాశ్రయం నిర్మిస్తాం..మీరు పండిరచే పంటలు ప్రపంచానికి అందించేలా చేస్తాం.. మళ్లీ రైతురాజ్యం వస్తుంది…రైతే రాజు అవుతాడు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇస్తాను. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తాను.

నేను సీఎం అయ్యాక వీళ్లను వదిలిపెడతానా

పెద్దిరెడ్డీ.. ఈ రోజు నీది..రేపు ప్రజలది. స్థానికుల కే గనులు కేటాయిస్తాం. జనార్థన్‌నాయుడు అనే వ్యక్తికి గ్రానైట్‌ క్వారీ ఉంది. ఆయన్ను బెదిరించి పల మనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ లాగేసుకున్నాడు. ఫ్యాక్టరీ ఎమ్మె ల్యేనే నిర్వహించుకుని విద్యుత్‌బిల్లు మాత్రం జనార్థన్‌ను కట్టమన్నారు. రూ.200కోట్లు గ్రానైట్‌ ద్వారా సంపా దించున్నారు. మంత్రి పెద్దిరెడ్డి వేలకోట్లు దోచుకున్నా రు. ఆయన ఇంట్లో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు. ధైర్యం ఉంటే వాళ్లను తొలగిస్తావా జగన్‌..సీటు ఇవ్వ కుండా మానేస్తావా.? నీకు కమీషన్‌ ఇచ్చిన వాళ్లను, వ్యాపార భాగస్వాములను మాత్రం ఏమీచేయవు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగా మారి, ప్రజలను దోచు కున్నారంటే దానికి కారణం జగన్‌. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీకాళహస్తి ఎమ్మె ల్యే పీఏ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మన కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమకేసులు పెట్టా రు. ఏంటీ దౌర్బాగ్యం? వైసీపీ వాళ్లను నేను సీఎం అయ్యాక వదిలిపెడతానా? ఈపరిస్థితి తెచ్చింది ఎవ రు.. సైకో కాదా? ఈ రాష్ట్రంలో  బతికే హక్కు లేదా.. ఏంటీ ఈ నియంత పోకడలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నారు

14 ఏళ్లు సీఎంగా ఉన్నాను.. ఎంతో మంది సీఎం లను చూశానుకానీ..ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మరో కొత్త చట్టాన్ని తెచ్చారు..అదే ల్యాండ్‌ లైటిల్‌ యాక్ట్‌. మొన్నే సర్వే చేశారు..దాని రహస్యం  మీకు తెలీదు. మీ భూములు మీ పేరు మీదున్నాయో.. వైసీపీ నేతల పేర్ల మీద ఉన్నాయో తెలీదు. మీ భూమిని వైసీపీ నేతలు తేలిగ్గా కొట్టేస్తారు. వైసీపీ నేతలకు వాటా ఇవ్వకుంటే భూముల లెక్కలు మారిపోతాయి.ఈ చట్టం చూస్తే నాకే భయం వేస్తోంది. పలానా భూమి నాది అని చెప్పుకునే అధికారం లేదు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నారు. మీ భూమి కూడా మీ చేతుల్లో ఉండని పరిస్థితి రాబోతోంది. ఇక్కడ స్టేడియం కూడా నిర్మిస్తా. గతంలో పనులు చేసిన వారికి బిల్లులు రాకుండా అడ్డుకోవడంతో ఇబ్బంది పడుతున్నారు.. బిల్లులు మంజూరు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

వైసీపీకి భవిష్యత్‌ లేదు

అంగన్వాడీలకు అన్ని హామీలు ఇచ్చాడు..నాడు ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నా రు. వారి డిమాండ్లు న్యాయమైనవే..వారికి న్యాయం చేసింది టీడీపీనే. అంగన్వాడీలకు రూ.4 వేలు ఉన్న జీతాన్ని రూ.10,500 చేశాను. చిరుద్యోగులను వెట్టి చాకిరీ చేయించుకుని, బానిసలుగా చూడటం కాదు.. వారి సమస్యలు పరిష్కరించాలి. వైసీపీ నేతలకు, కార్య కర్తలకు కూడా ఆ పార్టీలో గౌరవం లేదు. వైసీపీకి భవిష్యత్‌ లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్లీ ఇంటికొకరు తయారు కావాలి. భయపడితే భవిష్యత్తు ఉండదు. నేను అంతిచ్చా..ఇంతిచ్చా అంటున్నాడు. ఫీజు రీయింమర్స్‌మెంట్‌ డబ్బులు నేను నేరుగా కాలేజీలకు ఇచ్చాను..ఇప్పుడు అకౌంట్లో వేసి ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. వైసీపీ పోవాలి..రాష్ట్రం బాగుపడాలని చంద్రబాబు అన్నారు.

Tags: అధికారంకబ్జాలుకుప్పం అభివృద్ధికుప్పం నియోజకవర్గంచంద్రబాబుజగన్‌దోపిడీలునిర్లక్ష్యంభూములురాజకీయ అనర్హుడులూటీల్యాండ్‌ టైటిల్‌ చట్టంశాంతిపురం సభసీఎం
Previous Post

కుప్పం నియోజకవర్గం, శాంతపురం బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం.

Next Post

బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో

Next Post
బీసీల కోసం  ప్రత్యేక మ్యానిఫెస్టో

బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.