టొరంటో (కెనడా` చైతన్య రథం): ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాల్లో ప్రపంచస్థాయి పేరేన్నికగన్న ఓపెన్ టెక్స్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ రాడ్కోతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్‌వంటి భవిష్యత్ సాంకేతికత రంగాల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు ప్రపంచస్థాయి నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంలో జాన్ రాడ్కో మాట్లాడుతూ… మా సంస్థ డేటా/ కంటెంట్ మేనేజ్‌మెంట్, వ్యాపార ప్రక్రియలు, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ కోసం క్లౌడ్/ ఏఐ పరిష్కారాలను అందిస్తోంది. భారతదేశంలో కూడా బలమైన ఉనికి ఉంది. ఉత్తమ సాంకేతిక నిపుణులను నియమించుకోవడం, పెద్ద ఎంటర్‌ప్రైజ్‌లకు సేవలందించడం, ‘‘ఏఐ`తొలి’’ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. భారత్‌లో ఏఐ, క్లౌడ్ సాంకేతికతలను ఉపయోగించి వివిధ రంగాల్లో సురక్షితమైన, ఆటోమేటెడ్, సమర్థవంతమైన సమాచార నిర్వహణపై దృష్టి సారిస్తున్నాం. టైర్ -2 నగరాలకు మా కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని జాన్ రాడ్కో హామీ ఇచ్చారు.















