చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కుప్పానికి తరచూ వస్తా

కమ్మగుట్టపల్లి మహిళలతో భువనమ్మ ముఖాముఖి

చైతన్యరధం by చైతన్యరధం
July 24, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కుప్పానికి తరచూ వస్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా
  • సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
  • అధికారం కాదు… మీ ప్రేమాభిమానాలే శాశ్వతం
  • కమ్మగుట్టపల్లి మహిళలతో భువనమ్మ ముఖాముఖి

కుప్పం, కమ్మగుట్టపల్లి (చైతన్య రథం): ‘అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీరు సహకరించారని నేను ఇక్కడకు రాలేదు. మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా ఏదోఒకటి చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకొచ్చాను’ అని కుప్పం నియోజకవర్గం కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్త, ఓటరుకు భువనేశ్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ `వైనాట్‌ 175 అన్నవాళ్లకు రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పారు. అరాచకాలు, దౌర్జన్యాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వారికి ప్రజలు మౌనంగా ఓటుతో సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికీ సత్యం, ధర్మం, నిజాయితీ, నిజమే గెలుస్తుందని రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో రుజువు చేశారు.

కుప్పం ప్రజలు తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎంత వేధించినా, ఎంత భయపెట్టినా ఎవరికీ తలొగ్గకుండా ధైర్యంగా నిలబడి టీడీపీ జెండాను ఎగరేశారు. చంద్రబాబును 53 రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు కుప్పం మహిళలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు చూపించిన చొరవ నాలో కదలిక తీసుకొచ్చింది. ఆ ధైర్యంతోనే నేను ‘నిజం గెలవాలి’ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాను. ఆ పర్యటనలో చంద్రబాబుపై మహిళలకున్న అభిమానం, ఆప్యాయత తెలుసుకున్నాను. నేను నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా కుప్పం వచ్చినప్పుడు ఇక్కడి మహిళలు నన్ను ఓ ఆడపడుచులా ఆదరించారు. ఆ సమయంలో వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలే నన్ను మరోసారి ఇక్కడికి తీసుకొచ్చాయి. ఇకనుంచి ప్రతి రెండు మూడు నెలలకు నేను కుప్పం వస్తాను. ప్రజా సమస్యలు తెలుసుకుంటాను.

వాళ్లకు చేయగలిగిన సాయం చేస్తాను. ఎన్నికల ప్రచారం సమయంలో నేను చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గానికి 3 పెద్ద పరిశ్రమలు తెచ్చి, ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చంద్రబాబును ఒప్పిస్తాను. చంద్రబాబు కూడా ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక మ్యానిఫెస్టో అమలుకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన హామీలకు మించి కుప్పం ప్రజలకు మేలు చేస్తారు. నారా లోకేష్‌ కుప్పం గడ్డ మీద నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో మీరిచ్చిన ధైర్యం, చూపిన అభిమానంతో లోకేష్‌ తన పాదయాత్రను ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలబడి, పోరాడి విజయవంతంగా పూర్తిచేశారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. నావంతు నేనుకూడా కుప్పం ప్రజలకు చేతనైన సహాయ,సహకారాలు అందిస్తాను. కుప్పం ప్రజలకు నేను, నా కుటుంబం అన్ని వేళలా అందుబాటులో ఉంటామని మాట ఇస్తున్నాను అని భువనేశ్వరి స్పష్టం చేశారు.

మా కుటుంబానికి ఉన్న 1.7 ఎకరాలను మునిస్వామి, మునియప్ప అనే వ్యక్తులు కబ్జా చేశారు. మేము వారికి పొలం అమ్మకుండానే అమ్మేశామని మోసం చేసి వేధిస్తున్నారు. పెద్దలతో, అధికారులతో అడిగిస్తే కోర్టు ద్వారా అడగండి. లేదంటే డబ్బులు చెల్లిస్తేనే పొలం ఇస్తానని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మాకు మీరే న్యాయం చేయాలి.
`లక్ష్మీదేవి, కమ్మగుట్టపల్లి
మీవద్ద ఉన్న ఆధారాలు నాకు ఇవ్వండి. అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పాలనలో పేదవారి భూములు కబ్జాకు గురయ్యాయి. ఇలాంటి వారందరికీ ప్రత్యేక కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కంకణబద్దులై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. న్యాయం జరుగుతుంది.
`భువనేశ్వరి

మా గ్రామాన్ని 15 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం కావడం లేదు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదు. అభివృద్ధి పనులు జరగడం లేదు. మా గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి.
`ఉమ, జాతిరత్నంపల్లి
చంద్రబాబుకు, నాకు కుప్పం ప్రజలపై ప్రేమ, అభిమానం ఒకేలా ఉంటుంది. ఒక గ్రామం ఎక్కువ, ఒక గ్రామం తక్కువ అనేది లేదు. అభివృద్ధి అవసరమైన ప్రతి గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. మీ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.
`భువనేశ్వరి

Previous Post

హు కిల్డ్‌ బాబాయ్‌? త్వరలోనే జవాబు చెప్తా

Next Post

రెండు నెలల్లో విశాఖ యూజీపీ తొలిదశ పూర్తి

Next Post
రెండు నెలల్లో విశాఖ యూజీపీ తొలిదశ పూర్తి

రెండు నెలల్లో విశాఖ యూజీపీ తొలిదశ పూర్తి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.