అమరావతి(చైతన్యరథం): దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘ఇంద్ర ధనుస్సు’లో భాగంగా దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఈ కార్యక్రమాన్ని మార్చి 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ బుధవారం ప్రకటించారు. 40 శాతం, ఆ పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అమలు చేస్తామన్నారు. దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు.














