- 26 అంశాలతో డేటాబేస్ రూపొందించాలి
- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఎఫ్‌బీఎంఎస్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోని తన చాంబర్‌లో బుధవారం సమీక్షించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడీ, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్-రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 అంశాలతో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌జీఎస్‌డబ్ల్యు, డిస్కమ్స్, ఎంఏయూ డీ, వెబ్‌ల్యాండ్, వాహన్, హెచఆరఎంఎస్, సీబీడిటీల, పంచాయ తీరాజ్, మార్క్‌ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలని సూచించారు. ఇప్పటికే 82 శాతం సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటా బేస్ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం లోని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని, అప్పుడు కచ్చితత్వం పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా అధికా రులు పనిచేయాలని స్పష్టం చేశారు.














