చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అధికారంలో ఉన్నా కష్టపడాల్సిందే

మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Jun 26, 2025 at 6:08am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఇకపై ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి..ప్రతిరోజూ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలు మనపై పెద్ద బాధ్యత పెట్టారు
  • ప్రజల్లోనే ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించాలి
  • పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు
  • ఈ ఏడాది నిరుద్యోగ భృతి అందిస్తాం
  • మచిలీపట్నం అంటే టీడీపీ, టీడీపీ అంటేనే మచిలీపట్నం
  • కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలి
  • వైసీపీ నేతలకు ఇప్పటికీ అహంకారం తగ్గలేదు
  • మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌

మచిలీపట్నం (చైతన్యరథం): ప్రజలు మనపై బాధ్యత పెట్టారని, కష్టపడి ప్రజాసమస్యలు పరిష్కరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ పిలుపు ఇచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో బుధవారం మంత్రి నారా లోకేష్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కోసం, చంద్రబాబునాయుడు కోసం నిలబడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కేసులతో ఎంత వేధించినా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాన్ని సాధించి పెట్టిన కార్యకర్తలకు నమస్కారాలు తెలుపుతున్నానన్నారు.

పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు
నేను ఈ రోజు మచిలీపట్నం వస్తుంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు. మనపై అక్రమ కేసులు పెట్టిన వారే మనకు సెల్యూట్‌ కొట్టారంటే అదీ ప్రజాస్వామ్య గొప్పదనం. చంద్రబాబు మొండిధైర్యం మామూలుది కాదు. 1996లో రాజమండ్రి సెంట్రల్‌ జైలును ఆధునీకరించిన వ్యక్తి. 2014-19 మధ్య చంద్రబాబు కట్టిన బ్లాక్‌లోనే గత ప్రభుత్వ హయాంలో ఆయనను అక్రమంగా నిర్బంధించారు. జైలు నుంచి చంద్రబాబునాయుడు పులిలా బయటకు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ మనకు సెల్యూట్‌లు కొడతారు. పార్టీ నేతలు కష్టకాలాన్ని మర్చిపోకూడదు. పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన తోట చంద్రయ్య, కంటిచూపు పోగొట్టుకున్న చెన్నుపాటి గాంధీ, గొడ్డలివేటుకు తీవ్రంగా గాయపడ్డ మంజులారెడ్డి, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాతలే మనకు ఆదర్శనం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా వ్యవహరించాలి. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. ఏవైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగానే పోరాడాలి. జగన్‌ రెడ్డిపై కంటే మూడు రెట్లు ఎక్కువగా పార్టీలోనే పోరాడా. పార్టీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌వారం శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం చేరుకున్న మంత్రి నారా లోకేష్‌

ఈ ఏడాది నిరుద్యోగ భృతి అందిస్తాం
దేశంలో ఏ పార్టీకి రానివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. పెద్దఎత్తున కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది నిరుద్యోగ భృతి మొదలుపెడుతున్నాం. భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. వారిని గౌరవించాలనేది టీడీపీ నినాదం. మహిళలను గౌరవించటం అనేది ముందు మన ఇంట్లోనే మొదలవ్వాలి. 50శాతం పనులు మగవారు, 50శాతం పనులు ఆడవారు చేయాలని పాఠ్యాంశాల్లో పెట్టాం. జులై 5న మెగా పేరెంట్స్‌-టీచర్‌ మీటింగ్‌లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి. మహిళలకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సిడీ మొత్తాన్ని మహిళల అకౌంట్లలో జమచేస్తాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వృద్ధాప్య పెన్షన్‌ రూ.4వేలు, దివ్యాంగ పెన్షన్‌ రూ.6వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్‌ అందిస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లాలి

కూటమి ప్రభుత్వ అభివృద్ధిని గడపగడపకు తీసుకెళ్లాలి. జులై 2 నుంచి సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయాలి. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తాం. ఇకపై నేతలందరూ నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలి. కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నేను అది చూసుకుని వెళ్లకుండా ముందుగా కార్యకర్తలతో సమావేశం అయ్యాను. ఇకపై నేతలందరూ నియోజకవర్గ పర్యటనల్లో కార్యకర్తలతో భేటీ కావాలి.
వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు

వైసీపీ నేతలు ఇప్పటికీ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత ఇప్పటికీ ప్రజలను కలుసుకోవడం లేదు. కార్యకర్తలను కలవడం లేదు. రెడ్‌ బుక్‌ పేరు చెబితేనే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరికి బాత్‌రూమ్‌లో జారి చేయి విరిగింది. మేం చట్టప్రకారం ముందుకు వెళ్తున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలకు అహంకారం వద్దు. సౌమ్యంగా ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలు మనపై బాధ్యత పెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. కష్టపడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి లోకేష్‌ ఉద్బోధించారు.

ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తోంది
ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తోంది. కేంద్ర సహకారం వల్లే మనం ముందుకు వెళ్లగలుగుతున్నాం. ఏపీ కోరిన అన్ని కోరికలను ప్రధాని నరేంద్ర మోదీ తీరుస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో 3 లక్షల మంది యోగాసనాలతో గిన్నీస్‌ బుక్‌ రికార్డ్‌ సృష్టించి ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చాం. కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయి. కూటమిని బలోపేతం చేద్దాం. ప్రభుత్వం, పార్టీ జోడెద్దుల బండి. రెండిరటినీ నడిపేందుకు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో కార్యకర్తలను గౌరవిస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణ, జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, జోనల్‌ ఇంఛార్జ్‌ మంతెన సత్యనారాయణ రాజు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌. సాయిరాం ప్రసాద్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

పిల్లలను చదివించేందుకు..ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే!

Next Post

దేశానికే గర్వకారణం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

కార్యకర్త
@ August 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-08-2026

కార్యకర్త
@ August 25, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి
ఆంధ్రప్రదేశ్

కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

చైతన్యరధం
@ August 25, 2026
ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

చైతన్యరధం
@ August 25, 2026
మూడు దశాబ్దాల జాప్యాల కథ
ఆంధ్రప్రదేశ్

మూడు దశాబ్దాల జాప్యాల కథ

చైతన్యరధం
@ August 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-08-2026

కార్యకర్త
@ August 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-08-2026

కార్యకర్త
@ August 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

చైతన్యరధం
@ August 23, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు సాగాలి

చైతన్యరధం
@ August 25, 2026
ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

ప్రతి విత్తనం..ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం కావాలి

చైతన్యరధం
@ August 25, 2026
మూడు దశాబ్దాల జాప్యాల కథ

మూడు దశాబ్దాల జాప్యాల కథ

చైతన్యరధం
@ August 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist