- 22ఏ భూముల పరిష్కారామే హై ప్రయారిటీ
- వివాదాల్లో రాజకీయ నేతల జోక్యాన్ని సహించొద్దు
- గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలవల్లే భూవివాదాలు
- భూవివాదరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి
- కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): భూవివాదరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూవివాదాలపై కీలక చర్చను సాగిస్తూ.. 22ఏ భూములపై లోతైన సమీక్ష నిర్వహించారు. 22ఏ భూముల వివాదాల పరిష్కారానికి హై ప్రయార్టీ ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. ‘‘వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో 22ఏ భూముల వివాదాల పరిష్కారంపైనే మొదటి అజెండాగా చేపడదాం. విశాఖపట్నంలో కొన్ని భూవివాదాల్లో కొందరి రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటోందనే అంశంపై తనకు ఫిర్యాదులు అందినట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీపం చంద్రబాబు స్పందిస్తూ.. భూవివాదాల్లో పొలిటికల్ నేతల జోక్యాన్ని ఎంతమాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. భూవివాదాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సీపం చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘పీజీఆర్‌ఎస్ గ్రీవెన్సులు త్వరితగతిన పరిష్కరించండి. పార్వతీపురం మన్యం జిల్లాలో రెవెన్యూ క్లీనిక్స్ పెట్టారు. అన్ని రిజిస్ట్రేషన్ అండ్ ఆస్తి పత్రాలు డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. లింక్ డాక్యుమెంట్లు డేటా వేర్ హౌసింగ్‌లో పెడుతున్నాం. ఉమ్మడి ఏపీలో రెవెన్యూ రికార్డులు నిర్వహణ అత్యుత్తమంగా నిర్వహించాం. 2019-24లో భూ రికార్డులు అస్తవ్యస్తం చేశారు.
తమకు దక్కాల్సిన భూములు దక్కకుంటే… వాటిని లిటిగేషనులో పెట్టేందుకు భూములన్నీ 22ఏలో పెట్టి వివాదంలోకి నెట్టారు. గత పాలనలో అస్తవ్యస్త పరిస్థితులవల్ల ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులన్నీ భూ వివాదాలకు సంబంధించే వస్తున్నాయి. భూ సమస్యలను వందశాతం పరిష్కరించి ప్రజలకు సవ్యంగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కొందరు ప్రొఫెషనల్స్ కావాలనే ఈ భూవివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే పీడీ యాక్టు పెట్టి కఠినంగా వ్యవహరించండి. 22 ఏ భూముల విషయంలో సర్వే చేసి సెటిల్ చేయండి. జాయింట్ ఎల్పీఎం భూముల విషయంలో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి. భూవివాదాల పరిష్కారం చేసే బాధ్యతను ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ల అప్పజెప్పండి. రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలు లేని పరిస్థితి రావాలి. ప్రస్తుతం పెండిరగులో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేద్దాం. ప్రింటింగ్ చేసిన చోటునుంచే పట్టాదారు పాస్ పుస్తకం నేరుగా రైతుకు వెళ్లేలా చర్యలు తీసుకుందాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు కూడా నేరుగా యజమానులకు చేర్చేలా చర్యలు చేపడదాం. హౌసింగ్‌లో పొజిషన్ సర్టిఫికెట్లను కూడా త్వరితగతిన క్లియర్ చేసేయండి. 20-30 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు పొజిషన్ సర్టిఫికేషన్ జారీ చేయాలి. విశాఖ, అనకాపల్లి సహా ఐదారు జిల్లాల్లో భూకబ్జాలు లేకుండా చూడండి. భూకబ్జా ఫిర్యాదులపై తక్షణం కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో నిందితుల్ని వదిలిపెట్టొద్దు. కఠినంగా చర్యలు తీసుకోండి. జిల్లాలవారీగా రెవిన్యూ రసీదులపై దృష్టి పెట్టండి. పన్ను ఎగవేతలు, మానిప్యులేషన్ లేకుండా కలెక్టర్లే చూడాలి. ఒక్కరోజు కూడా మనం ఆదాయం కోల్పోవడానికి వీల్లేదు’’ అని కలెక్టర్లకు సీపం చంద్రబాబు ఆదేశాలిచ్చారు.











